పోలవరం కుడికాల్వ, విమానాశ్రయం విస్తరణ, మల్లవల్లి పారిశ్రామిక వాడ, ఇలా ఎన్నో మంచి పనులు గన్నవరం నియోజకవర్గంలో జరిగాయి. ఇవి రాష్ట్రానికి మంచి చేసేవే అయినా, అక్కడ భూమి సమీకరించటం మాత్రం, స్థానిక ఎమ్మల్యే వంశీకి ఒక ఛా లెంజ్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఉదారంగా వ్యవహరించి, రైతులకు సంతృప్తికరంగా ఉండేలా పరిహారం ఇచ్చారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్ట్ కి మాత్రం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ, వంశీ ముందుకెళ్ళారు. నవ్యాంధ్రకు ప్రధాన విమానాశ్రయంగా ఉండి, అంతర్జాతీయ హోదా పొందిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ఇక శరవేగంగా జరగనుంది.

vamsi 11082018 2

ఏడాదిన్నర కిందటే పనులు వేగంగా జరగాలని ప్రజాప్రతినిధులు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. కానీ విస్తరణకు అవసరమైన భూ సమీకరణకు అడ్డంకులు రావడం, రాజధానిలో ఫ్లాట్ల కేటాయింపులపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో కార్యాచరణ అనుకున్నంతగా వేగవంతం కాలేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌లు ఇటీవల రైతులతో నిర్వహించిన సమావేశంలో దాదాపుగా ఏకాభిప్రాయం రావడంతో విస్తరణకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎప్పటికప్పుడు, రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి, మార్గం సుగుమం చేసారు.

vamsi 11082018 3

ప్రస్తుతం విమానాశ్రయం 536 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా మరో 1,200 ఎకరాలు సేకరించేందుకు 2016 ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఎకరాకు 1,450 గజాల చొప్పున భూమి కేటాయించేలా సమీకరణ ప్రక్రియ చేపట్టారు. ఆరంభంలోనే దాదాపు 700 ఎకరాల వరకు సమీకరణ జరిగింది. తర్జనభర్జనల అనంతరం 830 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు. ఏలూరు కాల్వ మళ్లించాల్సిందేనని అధికారులు పట్టుబట్టడంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు ముఖ్యమంత్రిని, ఇతర పెద్దల్ని కలిసి కాల్వ మళ్లింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

vamsi 11082018 4

ఈ క్రమంలో ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదన్ను విరమించుకోవాలని, జల రవాణాకు అవసరమైతే ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని ముఖ్యమంత్రి చెప్పడంతో వివాదానికి తెరపడింది. సమీకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయినట్లేనని అందరూ భావించిన తరుణంలో, నిర్వాసితులకు అమరావతి పరిధిలో ఇచ్చే ప్లాట్ల కేటాయింపుపై గందరగోళం ఏర్పడింది. అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాల్లో ఫ్లాట్లు ఇస్తున్నారంటూ ఇటీవల రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.

vamsi 11082018 5

నిర్వాసితులు కోరినట్లుగా నిడమర్రు, కొరగల్లు గ్రామాలను ప్లాట్ల కేటాయింపు నుంచి మినహాయించడం, భూములిచ్చిన రైతులందరి పేర్లతో విమానాశ్రయంలో శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్‌ హామీనిచ్చారు. దీంతో పాటు అవకాశాన్ని బట్టి రైతులందరూ సింగపూర్‌ పర్యటనకు వెళ్లేలా ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నట్లు సమాచారం. దీంతో నిర్వాసితులంతా సంతృప్తి చెంది ఆందోళన విరమించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ర్యాంకుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, మా రాష్ట్రానికి దక్కాల్సిన మొదటి ర్యాంకును తప్పించి, రెండో ర్యాంకును ఇచ్చారని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు సమానంగా మార్కులున్నా, చివరకు ఇచ్చిన ర్యాంకులలో తప్పులు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం వైఖరి కారణంగా తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సైతం మార్కులు తారుమారయ్యాయని పేర్కొన్నారు.

kcr 11082018 2

ఈ వ్యవహారం వల్ల ఈవోడీబీ ప్రామాణికత ప్రశ్నార్థకంగా మారిందని, వెంటనే తప్పులు సవరించి కేంద్రం తిరిగి ర్యాంకులను ప్రకటించాలని కోరారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ లేఖ రాసినట్లు తెలిసింది. అందులో ర్యాంకుల అంశంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను జోషి పేర్కొన్నారు. అయితే తెలంగాణా చేసిన ఫిర్యాదు పై కేంద్రం స్పందించింది. మేము అన్నీ చూశాం, ర్యాంకుల్లో ఏమి తేడాలు లేవు, ఇప్పుడు ఉన్న ర్యాంకులే కొనసాగుతాయని చెప్పింది. మా దగ్గర ఎలాంటి తప్పు లేదు, అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని, DIPP సెక్రటరీ రమేష్ అభిషేక్ చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా, మేము కంపెనీల దగ్గరకు వెళ్లి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని చెప్పారు. 78 ఆక్షన్ పాయింట్స్ మీద ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని చెప్పారు.

kcr 110820183

అన్ని రాష్ట్రాలకు సంబంధించి, వారికి ర్యాంకు ఎలా వచ్చింది, ఎక్సెల్ షీట్ లో పంపించామని చెప్పారు. అంతే కాదు, రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులు, ఈ ర్యాంకుల పై ఆధారపడి రావని, ఇది ఒక ప్రామాణిక మాత్రమే అని, వివిధ రాష్ట్రాలు వాళ్ళ పాలసీలను బట్టి, పెట్టుబడులు వస్తాయని అన్నారు. గతనెల 10న ఈవోడీబీ 2017-18 ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. ఇందులో ఏపీ మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో హరియాణా మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇది తట్టుకోలేని కేసిఆర్, కంప్యూటర్‌ టూల్స్‌ ద్వారా జరిగే ర్యాంకుల మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, పలు రాష్ట్రాలకు నష్టం వాటిల్లేలా గణన జరిగిందని, మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు, తప్పులు దొర్లాయి అని కేంద్రానికి ఫిర్యాదు చేసారు. అంతే కాదు, దీనిపై రాష్ట్రప్రభుత్వం తరఫున కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్లమెంటులోనూ ఎంపీల ద్వారా అభ్యంతరాలను లేవనెత్తాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. అయితే వాస్తవం మాత్రం ఇలా ఉంది.

kcr 11082018 4

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌- డీఐపీపీ, ప్రపంచబ్యాంకు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా తీసుకొస్తున్న వాణిజ్య సంస్కరణలను గత మూడేళ్లుగా మదింపుచేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వాల పరిధిలోని వివిధ నియంత్రణ సంస్థల పనితీరును సంస్కరించి మరింత వేగంగా, సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించేలా చేయడమే ఈ కసరత్తు ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన సంస్కరణల సంఖ్యను గత మూడేళ్లలో 285 నుంచి 372కి పెంచారు. కార్మికులు, పర్యావరణం, అనుమతుల మంజూరు, సింగిల్‌విండో విధానం, నిర్మాణ అనుమతుల మంజూరు, కాంట్రాక్ట్‌ల అమలు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, క్షేత్రస్థాయిపరిశీలన విభాగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధానంగా ర్యాంకింగ్‌లకు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సంస్కరణల్లో ఎన్నింటిని అమలుచేశామన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పిస్తున్నాయి.

kcr 110820185

ఇలా సంస్కరణలు అమలు విషయంలో, మన రాష్ట్రానికి 99.73 స్కోర్ రాగా, తెలంగాణా కు 100 శాతం వచ్చింది. అయితే, ఈ సారి మాత్రం, ర్యాంకింగ్స్ విషయంలో కేవలం సంస్కరణలనే పరిగణలోకి తీసుకోలేదు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకున్న కంపెనీల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని, ఈసారి ర్యాంకులు ప్రకటించారు. ర్యాంకులకోసం ఈసారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడంవల్ల ప్రభుత్వ సంస్కరణలు వాస్తవంగా అమలవుతున్నాయా? లేదా? అన్న విషయం ఫీల్డ్ లెవెల్ లో రూడీ అవుతుంది. దేశంలో సుమారు 50వేల మందితో ముఖాముఖి మాట్లాడించి ఆయా ప్రభుత్వాల తీరుపై అభిప్రాయాలు సేకరించింది.

kcr 11082018 6

23 రాష్ట్రాల్లో సుమారు 5వేల మందికిపైగా ప్రైవేటు సెక్టార్‌ వినియోగదారులు, ఇంజినీర్లు, లాయర్లు, ఎలక్ట్రిక్‌ కాంట్రాక్టర్ల ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకొంది. ఇలా వివిధ కంపెనీలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 86.50 స్కోర్ రాగా, తెలంగాణాకు, 83.95 స్కోర్ మాత్రమే వచ్చింది. అందుకే, ఫైనల్ రిజల్ట్ లో మనం ఫస్ట్ వచ్చాం. కంపెనీలు మన రాష్ట్రం పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాయి, చంద్రబాబు ఏ రకంగా కోఆపరేట్ చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇంత పర్ఫెక్ట్ గా సిస్టం ఉంటే, ఫీల్డ్ లెవెల్ లో ఏపి అద్భుతంగా ఉందని రిపోర్ట్ చెప్తుంటే, కెసిఆర్ ప్రభుత్వం మాత్రం, మాకు అన్యాయం జరిగింది అంటూ, ఏపికి నెంబర్ వన్ ర్యాంక్ రావటం పై కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

అమరావతి అంటే చాలు అన్ని వైపుల నుంచి, విషం చిమ్మే ఒక జాతి మన రాష్ట్రంలో చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం... మై బ్రిక్, మై అమరావతి అంటూ, 10 రూపాయలు పెట్టి ఇటుకలు కొనమని, తద్వారా ప్రజా రాజధానిలో భాగస్వామ్యం కావలి అని పిలుపిచ్చినా, దాని మీద కూడా పడి ఏడ్చిన సందర్భం చూసాం... మన రాష్ట్రంలో ఉన్న ఏంతో మంది సంస్కారహీనులు, ఈ ఆటో డ్రైవర్ ను చుసైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం... రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి పడుతున్న తపన, కృషికి స్పూర్తి పొంది ఓ ఆటోడ్రైవర్‌ చేసిన పని, అందరికీ ఆదర్శం...

auto 11082018

రాజధాని నిర్మాణానికి రూ.1,28,575 విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ఆటోడ్రైవర్ అందజేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ మాజీ కార్పొరేటర్ పి.శివ సాయి ప్రసాద్ తో కలిసిన సురేష్ ఈ మేరకు చెక్కును సమర్పించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి పడుతున్న తపన, కృషికి స్పూర్తి పొంది విరాళమిచ్చినట్లు విజయవాడ గుణదలకు చెందిన ఆటోడ్రైవర్ పి. సురేష్ బాబు పేర్కొన్నారు. ఆటో సొంతంగా నడుపుకుంటూ ఒక్కో రూపాయి చేసుకున్న పొదుపు నుంచి ఉదారతతో విరాళమిచ్చారు. రాజధాని నిర్మాణం పట్ల సురేష్ తన భాగస్వామ్యాన్ని, సేవా తత్పరతను చాటుకున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. సురేష్ ను స్పూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సిఆర్డీయే అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఐఏఎస్, ఇతర అధికారుల నివాసాలకు సంబంధించిన ఆరు టవర్ల నిర్మాణం డిసెంబర్ లోగ పూర్తి చేయడానికి పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టవర్ల ఆకర్షణీయంగా , ఉన్నత నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఒక టవర్ లో నివాసాలను కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రతి నెల రాజధాని పనుల ప్రగతి వివరాలను విడుదల చేయమని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

amaravati 11082018 4

రాజధాని నవనిర్మాణం కోసం స్వచ్ఛందంగా అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని , మనం చేసే పనులు వారికి స్ఫూర్తిని కలిగించాలని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని అభివృద్ధి పనులకు చేపట్టిన సిఆర్డీయే బాండ్ల కార్యక్రమంలో బిడ్డింగ్ వచ్చే మంగళవారం జరుగుతుందని అధికారులు వివరించారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్ఈ )లో లిస్టింగ్ కు వెళ్తున్నామని, ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. 10.3 శాతం వడ్డీ రేటుతో బాండ్లు విడుదల చేస్తున్నారు. రాజధాని రైతుల భూముల రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడానికి మరో డిప్యూటీ కలెక్టర్ నియమించుకోమని ముఖ్యమంత్రి సూచించారు.

amaravati 11082018 5

మరి కొన్ని గ్రామాలకు చెందిన రైతులను సింగపూర్ పర్యటనకు పంపడానికి సీఎం అంగీకరించారు. డిసెంబర్ కల్లా విజయవాడ, గుంటూరు లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధాన కాలువల చుట్టూ సుందరీకరణ వేగవంతం చేయాలని అన్నారు. తిరుపతిలో 27 కిలోమీటర్లు ప్రాంతం మేర స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అభివృద్ధి పై ముఖ్యమంత్రి సమీక్షించారు. తిరుపతి లో అలిపిరి నుంచి ఉన్న అత్యంత రద్దీ ప్రాంతాలను కలుపుతూ వివిధ ప్రాంతాలను స్మార్ట్ స్ట్రీట్ గా అభివృద్ధి చేయడానికి ఉన్న ప్రతిపాదనలను చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వివరించారు. స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ లో భాగంగా లక్ష్మీపురం నుండి అలిపిరి వరకు స్మార్ట్ ఫ్లై ఓవర్ ఏర్పాటుకు ప్రతిపాదన ఉందని అన్నారు.

amaravati 11082018 2

రాష్ట్రంలో ప్రారంభించిన అన్న కాంటీన్ ల గురించి మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అన్న కాంటీన్ల నిర్వహణ ఉండాలని పురపాలక డైరెక్టర్ కన్నబాబు ను సూచించారు. ఇప్పటికే 66 అన్న కాంటీన్లు ప్రారంభమయ్యాయి. మరో వంద కాంటీన్లను ఆగష్టు 15వ తేదీకల్లా ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహనిర్మాణం ప్రగతిని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

amaravati 11082018 3

సర్వాంగ సుందరంగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలన్నిటిని అన్ని మాధ్యమాల్లో ప్రజలకు తెలిసేలా చేరవేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, అజేయ్ జైన్, సీఆర్డీఏ కమీషనర్ సిహెచ్. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read