ఒక పక్క రాజ్యసభలో కేవలం పోలవరం మీద లిటిగేషన్ ప్రశ్నలు అడిగించారు... అయినా లాభం లేదు... మరో పక్క సాక్షిలో విషం చిమ్ముడు... మరో పక్క సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ తప్పుడు ప్రచారం... ఇన్ని చేసినా, పోలవరంలో చంద్రబాబుని ఫిక్స్ చెయ్యాలి అనే పన్నాగం వర్క్ అవ్వలేదు.. అందుకే నేరుగా రంగంలోకి దిగారు... ఏకంగా కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు.. బయటకి పోలవరం పూర్తి చెయ్యటానికి ఇబ్బందులు ఏంటి అనే విషయం కోసం కలిసాము అని చెప్పినా, లోపల మాత్రం చంద్రబాబుని ఎలా ఫిక్స్ చెయ్యాలి అనేదాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు...

gadkari 22122017 2

చివరకు పోలవరం మీద కేంద్ర మంత్రి గడ్కరకీ మరిన్న ఫిర్యాదులు ఇచ్చారు... ఆ తలా తోక లేని ఫిర్యాదులు చూసి గడ్కరీ ఫైర్ అయ్యారు... ఇది రాజకీయం చేసే విషయం కాదు.. ఒక్క రోజు కూడా ఈ మహా యజ్ఞం ఆగ కూడదు అని మీ ముఖ్యమంత్రి తపనకు, మా ప్రోత్సాహం అందిస్తున్నాం, మీరు వచ్చి ఎమన్నా సలహాలు ఇస్తారు అనుకుంటే, ప్రాజెక్ట్ మరంత లేట్ చెయ్యాలి అనే విధంగా ఇలా మరిన్ని లిటిగేషన్లు పెడతారు ఏంటి ? మీకు ప్రాజెక్ట్ అవ్వాలి అని లేదా అని వారి మీద ఫైర్ అయ్యారు...

gadkari 22122017 3

ఈ లోప మరో ఎంపి, సార్ పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతి చేసింది అని ఆరోపణలు వస్తున్నాయి, ఆ లెక్కలు మాకు ఇస్తారు అని అడగగానే, గడ్కరీ మరింత ఫైర్ అయ్యారు... ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది.. ఖర్చు పెట్టిన బిల్లులు మాకు ఇస్తుంది... ఆ బిల్లులు అన్నీ పరిశీలించి, స్క్రూటినీ చేసి నాబార్డ్ ద్వారా నిధులు ఇస్తున్నాం... మీకు దీంట్లో అవినీతి ఏమి కనిపిస్తుందో నాకు అర్ధం కావట్లేదు.. ఇది రాజకీయం చేసే విషయం కాదు... దయచేసి అర్ధం చేసుకోండి అంటూ, వైసీపీ ఎంపీలకు చురకలు అంటించారు.. 2019 లోపు ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో ఉన్నాం, మీకు ఎమన్నా సందేహాలు ఉంటే అడగండి, అంతే కాని, ఇలా ప్రాజెక్ట్ ని అడ్డుకోవటానికి చూడవద్దు అని చురకలు అంటించారు...

మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటే, ఈయన మీకు ఎక్కడో ఒక చోట తగిలే ఉంటాడు... ఈయనే జ్యోతిష్కుడు వేణుస్వామి... ఒక బ్లాకు బోర్డ్ మీద రాస్తూ జాతకాలు లైవ్ లో చెప్పేస్తూ ఉంటారు... 2019లో జగన్ సియం అయిపోతారు అని ఎప్పుడూ గెట్టిగా చెప్తూ ఉంటారు... కెసిఆర్ కు రాజయోగం లేదు అని చెప్పారు... చిరంజీవి 150వ సినిమా ఫ్లోప్ అనిక్ చెప్పారు.. ఇంకా చాలా చెప్పారు అనుకోండి, అన్నీ రివర్స్ లో జరిగాయి... చంద్రబాబు ఆరోగ్యం పాడై పోతుంది అని, కూడా ఒకానొక సందర్భంలో కుసారు కూడా... పవన్ కళ్యాణ్ కు సియం అయ్యే అవకాసం లేదు అని కూడా చెప్పారు.. ఈయన ఉద్దేశం జగన్ తప్ప, ఎవరూ ముఖ్యమంత్రి అవ్వకూడదు అని... అయితే, ఇప్పుడు ఏకంగా ప్రధాన‌మంత్రితో దిగినట్లు ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి దొరికిపోయాడు...

babu 221222017 2

జ్యోతిష్కుడు వేణు స్వామి చేస్తోన్న పలు మోసాల‌ను, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ డ‌బ్బు సంపాదించుకుంటోన్న‌ తీరును ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేని ఓ టీవీ న్యూస్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో బ‌య‌ట‌పెట్టారు. వేణు స్వామి దేశంలో ఏ ప్ర‌ముఖుడిని వ‌ద‌ల‌డం లేద‌ని, సినీన‌టులు, రాజ‌కీయనాయ‌కుల‌ను గురించి ఎన్నో వ్యాఖ్య‌లు చేస్తుంటార‌ని బాబు గోగినేని చెప్పారు. ఓ రాజ‌కీయ నాయకుడు చ‌నిపోతాడ‌ని, ఒక‌రికి ఆరోగ్యం బాగుండ‌ద‌ని, ఒక‌రు లేచిపోయి పెళ్లి చేసుకుంటార‌ని ఎన్నో వ్యాఖ్య‌లు చేస్తార‌ని అన్నారు. చివ‌రికి తెలుగు బిగ్‌బాస్ షోను కూడా వ‌ద‌ల‌లేద‌ని, శివ‌బాలాజీ గెల‌వ‌బోడ‌ని, న‌వ‌దీప్ గెలుస్తాడ‌ని చెప్పాడని అన్నాడు. అది నిజం కాలేద‌ని చెప్పారు.

babu 221222017 3

బాబు గోగినేని ప‌లు ఆధారాల‌ను చూపుతూ ప్ర‌శ్న‌లు అడుగుతుండ‌డంతో, ఆయన ధాటికి తట్టుకోలేక జ్యోతిష్కుడు వేణు స్వామి మాట్లాడుతూ... "న‌న్ను న‌మ్మండి.. న‌మ్మ‌కండి. ఈ చ‌ర్చ‌లో బాబు గోగినేని చెప్పిన విష‌యాల‌ను మాత్ర‌మే న‌మ్మండి.. నాకు జ్యోతిష్యం రాదు... నేను చెప్పేవి అన్నీ అబద్ధాలు... బాబు గోగినేని వాదనే కరెక్ట్... ఆయ‌న చెప్పిందే న‌మ్మండి. నేను చెప్పేది ఏవీ నిజాలు కావు.." అంటూ విచిత్రంగా మాట్లాడి దండం పెట్టేసి వెళ్లి పోయారు.

కాకినాడ ఎస్టీఆర్ సాగర తీరంలో మూడు రోజుల పాటు నిర్వహించిన బీచ్ పెస్టివల్ గురువారం రాత్రితో ఘనంగా ముగిశాయి. గతంకన్నా భిన్నంగా యువతను ఆకట్టుకోటానికి ఈ సారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు రెహమాన్, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, వందేమాతరం శ్రీనివాస్ తో పాటు సినీ గాయకులతో మూడు రోజుల పాటు నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చివరి రోజు స్వరమాంత్రికుడు రెహమాన్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి... కాకినాడ... కాకినాడ... అంటూ, కాకినాడ పై రెహమాన్ పాడిన థీమ్ సాంగ్ హైలైట్ అయ్యింది... కింద వీడియోలో చూడవచ్చు...

kakinada 22122017 2

ఎలా ఉన్నారు కాకినాడ... బాగున్నారా... అంటూ రెహమాన్ నోటి వెంట మాటలు రాగానే ఒక్కసారిగా తెలుగువారంతా ఉప్పొంగిపోయారు. కృతజ్ఞతగా కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన దిల్ సే దిల్సే అంటూ హిందీ గీతాన్ని ఆలపించి సంగీతాభిమానుల పై తనకున్న ప్రేమను చాటారు. రెహమాన్ బృందంలో హరిచరణ్, జోషితా గాంధీలు కలిసి ప్రేమించే ప్రేమవా... ఊరించే ఊహవా అనే గీతాన్ని, జోషితా గాంధీ, గీతామోహన్లు కలిసి కొమరం పులి చిత్రంలోని నమ్మకమీయరా స్వామి... నిర్భయమీయరా స్వామి అంటూ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి... నాని చిత్రంలోని పెదవే పలికిన మాటల్లోని తియ్మని మాటే అమ్మా అంటూ విజయప్రకాష్ తన గానామృతంలో కట్టిపడేశారు. ఈ సంద ర్భంగా రెహమాన్ బృందం మా తుఝే సలాం. ఊర్వశి ఊర్వశి టేకి టీజీ పాలసీ పాటలు ఆలపించి ఉత్సాహ పరిచారు.. రెహమాన్ పాడే సమయంలో బాణసంచా కాల్పులతో ఆ ప్రాంతం అంతా సంబరాలు నెలకొన్నాయి.

kakinada 22122017 3

ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే, సినీ రంగంలో సంగీత అరగ్రేటం చేసిన రెహమాన్ గురువారంతో 25 ఏళ్ల పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చి తెలుగు ప్రజల మధ్య పండుగ చేసుకోడానికి ఆహ్వానించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 20 నిమిషాల సేపు పాటలు పాడిన తర్వాత వేదికపైకి అతిధులు వెళ్లి రెహమాన్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్కెస్రా కొనసాగింది. సుమారు 90 మంది మ్యూజీషియన్స్, ఆరుగురు గాయకులు సంగీత విందు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అంటే ఈ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... ఈ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, ఇటు నియోజకవర్గ ఎమ్మల్యేగా, రెండు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... ఇవాళ చేసిన మంచి పని, మరోసారి ఆయన ప్రజా నాయకుడు అని ప్రూవ్ చేసింది... ఇవాళ డాక్టర్ గా కూడా, తన వృత్తి ధర్మం నెరవేర్చారు.. ప్రజా నాయకుడిగా కూడా పని చేసి, ఒక జీవితాన్ని కాపాడారు... సియం పర్యటన ఏర్పాట్లు చేస్తున్న కోడెల, ప్రమాదం జరిగింది అని తెలుసుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి, మనిషిని కాపాడారు...

kodela 22122017 2

నరసరావుపేట మండలం కోటప్పకొండ లో మూర్చ వ్యాధి తో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిరు యామల్లయ్య అనే వ్యక్తి. ఆ లోయ దాదాపు 150 అడుగులు ఉంటుంది. యామల్లయ్య వయసు 25 ఏళ్ళు... ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ కోడెల, నేరుగా రంగంలోకి దిగారు.. కోసం సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు... స్పీకర్ వ్యక్తిగత సిబ్బంది, అలాగే పోలీసులు ఆపరేషన్ లో పాల్గున్నారు... 150 అడుగుల లోతులోకి దిగారు... ఆ వ్యక్తిని పైకి తీసుకురావటం కష్టంగా ఉండటంతో, ఆపరేషన్ ఇబ్బందిగా మారింది..

kodela 22122017 3

దీంతో తాడులు, నిచ్చెన సహాయంతో, ఆ వ్యక్తిని పైకి తీసుకువచ్చారు... స్పీకర్ కోడెల స్వయంగా ప్రాధమిక చికిత్స చేశారు. వెంటనే తన కాన్వాయ్ లోనే, అసుపత్రికి పంపించారు. కోటప్పకొండ నుంచి నరసరావుపేట హాస్పిటల్ కి తరలించారు... అక్కడ కూడా స్పీకర్ స్వయంగా ఉండి చికత్స చేపించారు... ఇప్పుడు బాధితుడు కోలుకుంటున్నాడు.... ఈ విషయం తెలిసిన ప్రజలు కోడెల చేసిన పనికి శభాష్ అంటున్నారు... ప్రజల పట్ల అందరు నాయకులు ఇదే దృక్పదంతో ఉండాలి అని కోరుకుటున్నారు...

Advertisements

Latest Articles

Most Read