ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అంటే ఈ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... ఈ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, ఇటు నియోజకవర్గ ఎమ్మల్యేగా, రెండు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... ఇవాళ చేసిన మంచి పని, మరోసారి ఆయన ప్రజా నాయకుడు అని ప్రూవ్ చేసింది... ఇవాళ డాక్టర్ గా కూడా, తన వృత్తి ధర్మం నెరవేర్చారు.. ప్రజా నాయకుడిగా కూడా పని చేసి, ఒక జీవితాన్ని కాపాడారు... సియం పర్యటన ఏర్పాట్లు చేస్తున్న కోడెల, ప్రమాదం జరిగింది అని తెలుసుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి, మనిషిని కాపాడారు...
నరసరావుపేట మండలం కోటప్పకొండ లో మూర్చ వ్యాధి తో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిరు యామల్లయ్య అనే వ్యక్తి. ఆ లోయ దాదాపు 150 అడుగులు ఉంటుంది. యామల్లయ్య వయసు 25 ఏళ్ళు... ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ కోడెల, నేరుగా రంగంలోకి దిగారు.. కోసం సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు... స్పీకర్ వ్యక్తిగత సిబ్బంది, అలాగే పోలీసులు ఆపరేషన్ లో పాల్గున్నారు... 150 అడుగుల లోతులోకి దిగారు... ఆ వ్యక్తిని పైకి తీసుకురావటం కష్టంగా ఉండటంతో, ఆపరేషన్ ఇబ్బందిగా మారింది..
దీంతో తాడులు, నిచ్చెన సహాయంతో, ఆ వ్యక్తిని పైకి తీసుకువచ్చారు... స్పీకర్ కోడెల స్వయంగా ప్రాధమిక చికిత్స చేశారు. వెంటనే తన కాన్వాయ్ లోనే, అసుపత్రికి పంపించారు. కోటప్పకొండ నుంచి నరసరావుపేట హాస్పిటల్ కి తరలించారు... అక్కడ కూడా స్పీకర్ స్వయంగా ఉండి చికత్స చేపించారు... ఇప్పుడు బాధితుడు కోలుకుంటున్నాడు.... ఈ విషయం తెలిసిన ప్రజలు కోడెల చేసిన పనికి శభాష్ అంటున్నారు... ప్రజల పట్ల అందరు నాయకులు ఇదే దృక్పదంతో ఉండాలి అని కోరుకుటున్నారు...