మోడీ ఉన్న చోటికి వెళ్లి, నువ్వు చేసిన మోసం ఇది అని, దేశం మొత్తానికి చేసినోడు చంద్రబాబు... మోడీ అనే పేరు కూడా ఎత్తలేని పోటుగాళ్ళు, మన రాష్ట్రంలో పోరాటాలు చేస్తూ, జనం చేవిల్లో పువ్వులు పెడుతూ, పువ్వులు ఎలా చెప్తే అలా ఆడుతున్నారు... మోడీ అనే వాడిని, ఇప్పటి వరకు దేశంలో, చంద్రబాబు ఎదుర్కున్నట్టు ఎవరూ ఎదుర్కోలేదు... చించేస్తాడు, పొడిచేస్తాడు, కేసులు పెడతాడు, మంత్రుల్ని జైలుకి పంపుతారు అంటూ, ప్రచారం చేసినా చంద్రబాబు ఆదరలేదు,బెదరలేదు... పైగా రెట్టించిన ఉత్సాహంతో, రాష్ట్రం కోసం, ఎవడితో అయినా, ఎంతవరకు అయినా వస్తా అంటూ ఢిల్లీ వెళ్లి తొడ కొట్టి వచ్చారు...

jagan 06042018 1

మోడీ మనం అనుకున్నంత బలవంతుడు కాదు, చంద్రబాబు మానం అనుకున్నంత పిరికివాడు కాదు, అని దేశం మొత్తం అనుకునేలా చేసాఋ చంద్రబాబు... రెండు రోజులు అయినా, చంద్రబాబు ప్రెస్ మీట్ లో వాయించిన దరువు, ఇప్పటికీ బీజేపీ పెద్దలకు చెవిల్లో తిరుగుతూనే ఉంది... అలాంటి చంద్రబాబుకి, జగన్ అనే వాడు ఛాలెంజ్ చేసాడు... బీజేపీ ప్లాన్ లో భాగంగా, తన ఎంపీల చేత రాజీనామా చేయించి, చంద్రబాబు నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు కూడా రాజీనామా చేపించు, అంటూ ఒక ట్వీట్ చేసాడు...

jagan 06042018 1

జగన్ పిల్లిబిత్తిరి ఛాలెంజ్ కు లోకేష్ కూడా ట్విట్టర్ లో స్పందించారు... మోడీ మీద ఒక్కసారి అయినా వ్యతిరేకంగా మాట్లాడవా ? మాట్లాడకుండా, కోర్ట్ కి పోయి, అక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తావా అంటూ జగన్ కు కౌంటర్ ఇచ్చారు... ఇది లోకేష్ చేసిన ట్వీట్ "The TDP is protesting the Centre’s indifference to AP in the Parliament & the State. We don’t see @ysjagan raising his voice anywhere as he is busy visiting court on corruption charges. The friday ritual!"

దొంగే, దొంగా దొంగా అని అరిసినట్టు... వీరి చేతగానితనాన్ని, వేరే వారి పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోడీ... నిజానికి, ఇలాంటి విద్యల్లో ఆరితేరి పోయారు... అయితే, దేశ ప్రజలు, ఇలాంటివి చూసి చూసి విసిగిపోయారు... ఇలాంటి డ్రామాలతో, ప్రతి సారి జనాలని పిచ్చోళ్ళని చెయ్యలేము అనేది బీజేపీ పెద్దలు గ్రహించాలి... ఒక్క పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే, వారిని సస్పెండ్ చేసి సభ నడపాల్సిన బాధ్యత మర్చిపోయి, వారి చేతే డ్రామాలు ఆడించి, నీ మీద విశ్వాసం లేదు అని దేశంలో సాగానికి పైగా ఎంపీలు నోటీసు ఇస్తే, అది చర్చకు జరిపే దమ్ము లేక, పారిపోయిన మోడీ, ఇప్పుడు ప్రజలని మభ్యపెట్టటానికి, మరో డ్రామాతో ముందుకు వస్తున్నారు...

mnodi 0604018

పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన తరువాత, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు... బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ మాట్లాడుతూ, ఆయన ప్రభుత్వం చేతగాని తనాన్ని, ప్రతిపక్షాల పై రుద్దే ప్రయత్నం చేసారు... ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు... ఈ ప్రతిష్టంభనకు కారణం కాంగ్రెసేని ఘాటుగా విమర్శించారు. పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు నిరసనగా ఈ నెల 12న తమ పార్టీ ఎంపీలు నిరాహార దీక్ష చేస్తారని చెప్పారు...

mnodi 0604018

తమ పార్టీ (బీజేపీ) కలుపుగోలు రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్షాలు మాత్రం విభజన, నకారాత్మక రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల తీరుకు కారణం బీజేపీకి బలం పెరుగుతుండటమేనన్నారు. ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల కృషి కారణంగానే తమ పార్టీ బలోపేతమవుతోందని చెప్పారు. ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బీజేపీ నేత అనంత్ కుమార్ విలేకర్లకు తెలిపారు. తమ పార్టీ ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ యాత్రను నిర్వహిస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళనకు ఇది ఆరంభం మాత్రమేనని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలోని వెంకటపాలెం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి సైకిల్ యాత్రను ప్రారంభించారు. స్వయంగా సైకిల్ నడుపుతూ ర్యాలీకి నాయకత్వం వహించారు. తొలుత నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ప్రజనుద్దేశించి ప్రసంగిస్తూ కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటోందని, ఇదెంతో దుర్మార్గమని చెప్పారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాందెడ్ల భాస్కరరావు సహాయంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ కుట్రలతో కూలదోసినప్పుడు తాము పోరాటం చేసి కేంద్రం మెడలు వంచామని, ఫలితంగా ఎన్టీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేశారని గుర్తు చేశారు.

cbn cycle 06042018 1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సోనియాగాంధీ అశాస్త్రీయంగా విభజించారని, కాంగ్రెస్ చేసిన అన్యాయానికి ఆ పార్టీ ఆంధ్రులు రగిలిపోయారని, ఆగ్రహ జ్వాలల మధ్య కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెలుగువారితో పెట్టుకోవద్దని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే బీజేపీకి కూడా కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం తాము ప్రారంభించిన పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని చంద్రబాబు అన్నారు. రైతులు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఉదారంగా, స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమినిచ్చారని, ఇందువల్ల రైతులు లాభపడ్డారని, ప్రభుత్వం కూడా ప్రయోజనం పొందిందని చెప్పారు. కొందరు కుట్రపూరితంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, ఇది దారుణమైన విషయమని విమర్శించారు.

cbn cycle 06042018 1

అయితే సైకిల్ యాత్ర చేస్తున్న సందర్భంలో, ముగ్గురు చిన్న పిల్లలు, అందరినీ ఆకట్టుకున్నారు... వెంకటపాలెంకు చెందిన ముగ్గురు పిల్లలు, చంద్రబాబుతో పాటు సైకిల్ యాత్రలో, పరిగెడుతూ వచ్చారు... మూడు కిలో మీటర్ల పాటు, అలాగే చంద్రబాబు సైకిల్ తొక్కుతుంటే, ఆయన పక్కనే పరిగెడుతూ వచ్చారు... వారిని చుసిన చంద్రబాబు, ఎంతో ముచ్చటతో మెచ్చుకున్నారు... కేంద్రం పై చేస్తున్న నిరసనలో, ఈ చిన్న పిల్లలు, ఇలా పరిగెడుతూ రావటంతో, వారి చర్యలకు మెచ్చిన చంద్రబాబు, వారికి మూడు సైకిళ్ళు బహుమతిగా ఇచ్చారు... చంద్రబాబు చేసిన ఈ పనితో, ఆ పిల్లల ఆనందానికి అవధులు లేవు....

అనుకున్నదే అయ్యింది... 56 అంగుళాల ఛాతీ, ఆంధ్రోడి దెబ్బకు నెల రోజుల నుంచి పారిపోతూ ఉండటం చూసాం... పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కూడా, చర్చ జరపుండా, నిరవధిక వాయిదా వేసుకుని పారిపోయారు... నీ పై విశ్వాసం లేదు, నీ పరిపాలన పై విశ్వాసం లేదు అని, గత నెల రోజుల నుంచి, అన్ని విపక్షాలు ఏకమై, ఆందోళన చేసినా, చర్చకు ముందుకు రాలేక, పారిపోయారు... ప్రజాస్వామ్యం దేశంలో, సిగ్గు పడేలా, నీ పై విశ్వాసం లేదు అని చెప్తున్నా, అది ఎదుర్కునే దమ్ము లేక, కొన్ని పార్టీలతో డ్రామాలు ఆడించి, రోజుకి పది నిమషాలు కూడా సభ జరపకుండా పారిపోతూ వస్తున్నారు... చివరకు, చివరి రోజు కూడా ఇలాగే పారిపోయారు...

modi 06042018 1

మొదట్లో వైసిపీ అవిశ్వాసం నోటీసుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తాను అని చెప్పింది... అప్పటికి, ఇంకా దేశంలోని ఏ పార్టీ కూడా వైసిపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు... కాని, ఒక పక్క అవిస్వాసం అంటూ, మరో పక్క అదే నోటీసు పట్టుకుని విజయసాయి రెడ్డి ప్రధాని ఆఫీస్ కి వెళ్ళటంతో, వెంటంటే చంద్రబాబు అలెర్ట్ అయ్యారు... వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అని తెలుసుకుని, వెంటనే వారే అవిశ్వాసం పెట్టారు... అంతే, చంద్రబాబు అవిశ్వాసం పెట్టిన గంటలో, దేశంలో అన్ని విపక్షాలు, చంద్రబాబుకి మద్దతు ప్రకటించాయి... ఇదే మోడీ పతనానికి మొదటి అడుగు... అప్పటి నుంచి, పారిపోతూనే ఉన్నారు...

modi 06042018 1

అవిశ్వాసాని భయం లేదంటూనే, బీజేపీ ఇలా డ్రామాలు ఆడిస్తుంది అని, విపక్షలాన్నీ అంటున్నాయి... అయినా మాకు సంపూర్ణ బలం ఉంది అని చెప్పుకుంటున్న బీజేపీ, ఎందుకు వెనకడుగు వేసింది ? వీళ్ళు చేసిన పనులు అన్నీ, బయట పడతాయనా ? అన్ని రాష్ట్రాల వారు, మోడీ పై విరుచుకుపడితే వీరిఇమేజ్ దెబ్బతింటుంది అనా ? ఒక పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే, వారిని సస్పెండ్ చేసి సభ నడపలేరా ? అసలు వింత ఏంటి అంటే, సందట్లో సడేమియ్యా.. నా పేరు బుడే మియ్యా ... అన్నట్టు, ఇంత గోలలోనూ కావలిన బిల్లులు పాస్ అయిపోయాయి...

Advertisements

Latest Articles

Most Read