ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేసిన సంగతి తెలిసిందే... ఈ సందర్భంలో చంద్రబాబు, వివిధ జాతీయ చానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు... అలాగే, నిన్న సాయంత్రం 3 గంటలకు దాదాపు 2 గంటల పాటు ప్రెజంటేషన్ ఇచ్చి మరీ, మోడీ చేసిన అన్యాయాన్ని నేషనల్ మీడియాకు వినిపించారు... అయితే, ఈ సందర్భంలో, ఏ ఒక్క నేషనల్ మీడియాలో కూడా, చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ రాలేదు.. అలాగే, మరో సంచలన విషయం బయట పడింది... చంద్రబాబుని ఇంటర్వ్యూ చేసిన చానల్స్ కు కూడా, అవి ప్లే చెయ్యవద్దు అనే ఆదేశాలు వెళ్ళాయట...

cbn 05042018 2

అయితే, రెండు ప్రముఖ చానల్స్ మాత్రమే ఆ ఆదేశాలు పాటించాయట... అప్పటికే ఈ రెండు చానల్స్ చంద్రబాబు ఇంటర్వ్యూ ప్లే చేస్తూ ఉండగా, ఆ ఆదేశాలు రావటంతో, చంద్రబాబు ఇంటర్వ్యూ మధ్యలోనే ఆపేశారు అని సమాచారం... నిజానికి ఆ రెండు ప్రముఖ చానల్స్ ఇంటర్వ్యూ చూసిన వారు కూడా, ఇది వాస్తవమే అని చెప్తున్నారు... ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోయింది అని, ఎందుకు ఆగిపోయిందో అర్ధం కాలేదని, ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తరువాత, తెలిసింది అంటున్నారు... ఇంతకీ ఈ విషయం బయట పెట్టింది ఎవరో తెలుసా ?

cbn 05042018 3

ఈ విషయం బయటకు చెప్పింది Derek O'Brien అనే TMC పార్టీ ఎంపీ... ఆయన తన ట్విట్టర్ లో, ఈ విషయం చెప్పారు... "Strong Delhi buzz confirming BJP on the double defensive. At least two TV channels who shot full interviews with @ncbn Chandrababu Naidu told not to run the same"... దీనికి ఇండియా టుడే Rajdeep Sardesai స్పందిస్తూ, మీరు ఆ రెండు చానల్స్ పేర్లు బయట పెట్టండి, మా ఇండియా టుడే మొత్తం ఇంటర్వ్యూ పబ్లిష్ చేసాం అన్నారు... ఇది బీజేపీ పెద్దల వరుస... చివరకు ఇలాంటి ఆటలు కూడా ఆడుతున్నారు... అయినా వారికి తెలియనిది ఏంటి అంటే, ఇలాంటి ఆటలు చంద్రబాబు ఎప్పుడో ఆడేసారు... రాజశేఖర్ రెడ్డి టైంలోని ఇలాంటి ఆటలు ఆడేశారు.. ఇంకా ఢిల్లీ పెద్దలు అప్డేట్ అవ్వలేదు పాపం...

మొన్న అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు వీడియో వేసి, అన్నీ చూపిస్తే, కొంత మంది రాష్ట్ర బీజేపీ నేతలు, చంద్రబాబు ఇలాంటివి చెయ్యకూడదు అని, ప్రధానిని అవమానిస్తారా, మేము చంద్రబాబుకి నోటీస్ ఇస్తాం, మేము చంద్రబాబు పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం అంటూ ఊగిపోయిన విషయం చూసాం... అయితే, ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో కాదు, దేశ రాజధానిలో, మోడీ చేసిన మోసాల గురించి వీడియోలు వేసి మరీ, ఏకి పడేసారు... రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని అందరికీ చెప్తూ, ప్రతి విషయం పై వీడియోలు, డాక్యుమెంట్ లు చూపిస్తూ, కేంద్రం ఎలాంటి పనులు చేస్తుంది చెప్పారు...

modi cbn 047042018

రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జాతీయ మీడియాకు వివరించారు. ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ నెల్లూరు, తిరుపతి సభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన ప్రకటన వీడియోను, అమరావతి శంకుస్థాపన సభలో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన వీడియో దృశ్యాలను మీడియాకు చూపించారు. పోలరవరం ప్రాజెక్టుపై కేంద్రం చెప్తున్నవన్నీ అబద్దాలేనని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని రాష్ట్రమే పూర్తి చేస్తుందని నీతి ఆయోగ్ చెప్పిందని, ఆ ప్రకారం రాష్ట్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు.

modi cbn 047042018

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కుదరదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం అబద్ధం. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. విభజన హామీలన్నీ నెరవేర్చాల్సిందే. నీతి ఆయోగ్‌ సిఫార్సు మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాం. పోలవరానికి ఖర్చు పెట్టిన నిధుల్లో కేంద్రం ఇంకా రూ.3వేల కోట్లు ఇవ్వాలి. పోలవరానికి సంబంధించి డీపీఆర్‌-2ను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. దిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని ప్రధాని మోదీ అమరావతిలో ప్రకటించారు. రాజధాని కోసం రూ.2500 కోట్లు మాత్రమే ఇచ్చారు. యూసీలు ఇచ్చినా ఇవ్వలేదంటున్నారు. ఏదైనా ఉంటే నేరుగా చెప్పాలి.. బురదజల్లడం మంచిది కాదు. స్వయంగా ప్రధాని ప్రకటించిన హామీలే అమలుకు నోచుకోలేదు" అంటూ మోడీని దేశం ముందు ఎండగట్టారు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ రాజధాని ఢిల్లీలో, ప్రధాని మోడీ చేసిన మోసాన్ని, ప్రతి విషయం ఆధారాలతో సహా నేషనల్ మీడియాకు చూపిస్తూ, మోడీని చాకిరేవు పెడుతున్నారు... ఇప్పటి వరకు, దేశంలో ఎవరూ చేయిని విధంగా, మోడీని దేశ రాజధానిలోనే తూర్పారబడుతున్నారు... ఎన్నికల సమయంలో ఏపీకి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు, అమరావతి వచ్చి ఢిల్లీకి మించిన రాజధాని కడతాను అనటం, ఇలా అన్ని వీడియోలు, నేషనల్ మీడియాకు చూపించారు... అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, అమరావతిలో అత్యద్భుత రాజధానిని నిర్మిస్తామని మోదీ చెప్పారని అన్నారు...

delhi 04042018

ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని చెప్పి, ఆ తరువాత హోదాకు బదులు, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబితే అంగీకరించామని చంద్రబాబు అన్నారు.. అయితే, అది కూడా రెండున్నరేళ్లు అయినా పైసా ఇవ్వలేదు అని చెప్పారు... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల తాను ఓ లేఖ కూడా రాశానని అన్నారు... మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ అంటోందని విమర్శించారు... అలాగే హోదా లేదు అంటూనే, మిగతా రాష్ట్రాలకు ఇచ్చారని చెప్పారు.. అందుకే, ఇవన్నీ మాకు వద్దు, మా హోదా మాకు ఇవ్వండి అని అడుగుతున్నామని చెప్పారు...కేంద్ర ప్రభుత్వ తీరువల్ల 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు..

delhi 04042018

అలాగే, బిల్ లో పెట్టిన 19 అంశాలు ఒక్కొక్కటి వివరించారు... పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధాని చేసిన ఆరు హామీలు కూడా వివరించారు... అవి ఏంటి, కేంద్రం ఇప్పటి వరకు ఏమి ఇచ్చింది, ప్రస్తుత స్థితి ఏంటి అనేది వివరించారు.. అలాగే UCలు ఇవ్వటం లేదు అనే విషయాలు కూడా, ఆధారాలతో సహా అందరికీ చూపించారు... పోలవరంలో కేంద్రం ఎలా సహకరిస్తుంది అనేది వివరిస్తూ, రాష్ట్రం ఎలా పోలవరం పనులు చేస్తుంది, లైవ్ పెట్టి మరీ చూపించారు... ఇవన్నీ మా హక్కులని, మా హక్కులు కోసం కూడా ఇలా పోరాడాల్సి వస్తుంది అని, చెప్పారు... బీజేపీ వాళ్ళు అన్నీ అసత్యాలు చెప్తున్నారు కాబట్టే, నేను ఇన్ని ఆధారాలతో మీకు ఇవన్నీ చూపించాల్సి వచ్చింది అని చెప్పారు...

ఈ GVL నరసింహారావు అనే అతను ఇంతకు ముందు ఎవరికీ తెలియదు... చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, చంద్రబాబుని తిట్టటానికి ఈయన్ను రాష్ట్రానికి పంపించారు... అంతకు ముందు దాకా, ఈయన ఢిల్లీలోనే ఉండేవారు... ఏనాడు రాష్ట్ర సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు... చంద్రబాబుని ఒక రెండు నెలలు బాగా తిట్టాడు అని, మెచ్చుకుని, అమిత్ షా, మొన్నే ఆయనకు రాజ్యసభ టిక్కెట్ కూడా ఇచ్చారు... ఇక అప్పటి నుంచి, ఈయన గారి మ్యూజిక్ మాములుగా లేదు... అమిత్ షా కంటే ఎక్కువ కబుర్లు, చెప్తూ, మీకు లక్షల లక్షల కోట్లు ఇచ్చాం, మీకు అవి ఇచ్చాం, మీకు ఇవి ఇచ్చాం అంటూ హడావిడి చేస్తున్నాడు....

gvl 04042018

అయితే, రెండు రోజుల నుంచి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తూ, అందరినీ కలిసి, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు... ఇదే సందర్భంలో, ఈ ఈ GVL నరసింహారావు ప్రెస్ తో మాట్లాడుతూ, చంద్రబాబు మమ్మల్ని వదిలేసింది, కేవలం రాజకీయ కోణంలోనే అని, అంతకు మించి ఏమి లేదు అని చెప్పారు... అయితే, ఇదే విషయం, కొంత మంది విలేకరలు, ప్రెస్ మీట్ లో చంద్రబాబుని అడిగారు... దీనికి చంద్రబాబు స్పందిస్తూ, అదిరిపోయే పంచ్ వేసారు... "నాకు ఏమి రాజకీయ బెనిఫిట్ ఉంటుంది... రాజకీయం కోణంలో వీరితో కలిసింది ఓట్లు కోసం అయితే, 2019లో వీళ్ళు ఓడిపోతారని నేను బయటకు వస్తున్నానా ? రాజకీయ కోణం అంటే ఓట్లే కదా ? అంటే వీరు 2019లో గెలుస్తారని నమ్మకం లేదా" అంటూ GVL నరసింహారావుకి పంచ్ వేసారు చంద్రబాబు...

gvl 04042018

ఈ GVL నరసింహారావు, మొన్న కూడా అమరావతి గురించి ఒక టీవీ ఛానల్ లో మాట్లాడుతూ, మీకు అంత రాజధాని ఎందుకు, ఇంత పెద్ద రాజధాని మీకు అవసరమా ? మయసభ ఎమన్నా కడతారా అంటూ, రాజధాని గురించి ఎగతాళిగా మాట్లడారు... తెలుగుదేశం నాయకులు ఎవరూ ఇతనికి గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు.. ఈ రోజు చంద్రబాబు మాత్రం, మరో మాట మాట్లాడకుండా, పంచ్ వేసారు... ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అబద్ధాలు ప్రచారం చేస్తే, చూస్తూ ఊరుకోను అంటూ, ఢిల్లీ నుంచే బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు...

Advertisements

Latest Articles

Most Read