మొన్న అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు వీడియో వేసి, అన్నీ చూపిస్తే, కొంత మంది రాష్ట్ర బీజేపీ నేతలు, చంద్రబాబు ఇలాంటివి చెయ్యకూడదు అని, ప్రధానిని అవమానిస్తారా, మేము చంద్రబాబుకి నోటీస్ ఇస్తాం, మేము చంద్రబాబు పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం అంటూ ఊగిపోయిన విషయం చూసాం... అయితే, ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో కాదు, దేశ రాజధానిలో, మోడీ చేసిన మోసాల గురించి వీడియోలు వేసి మరీ, ఏకి పడేసారు... రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని అందరికీ చెప్తూ, ప్రతి విషయం పై వీడియోలు, డాక్యుమెంట్ లు చూపిస్తూ, కేంద్రం ఎలాంటి పనులు చేస్తుంది చెప్పారు...
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జాతీయ మీడియాకు వివరించారు. ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ నెల్లూరు, తిరుపతి సభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన ప్రకటన వీడియోను, అమరావతి శంకుస్థాపన సభలో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన వీడియో దృశ్యాలను మీడియాకు చూపించారు. పోలరవరం ప్రాజెక్టుపై కేంద్రం చెప్తున్నవన్నీ అబద్దాలేనని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని రాష్ట్రమే పూర్తి చేస్తుందని నీతి ఆయోగ్ చెప్పిందని, ఆ ప్రకారం రాష్ట్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కుదరదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం అబద్ధం. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. విభజన హామీలన్నీ నెరవేర్చాల్సిందే. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాం. పోలవరానికి ఖర్చు పెట్టిన నిధుల్లో కేంద్రం ఇంకా రూ.3వేల కోట్లు ఇవ్వాలి. పోలవరానికి సంబంధించి డీపీఆర్-2ను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. దిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని ప్రధాని మోదీ అమరావతిలో ప్రకటించారు. రాజధాని కోసం రూ.2500 కోట్లు మాత్రమే ఇచ్చారు. యూసీలు ఇచ్చినా ఇవ్వలేదంటున్నారు. ఏదైనా ఉంటే నేరుగా చెప్పాలి.. బురదజల్లడం మంచిది కాదు. స్వయంగా ప్రధాని ప్రకటించిన హామీలే అమలుకు నోచుకోలేదు" అంటూ మోడీని దేశం ముందు ఎండగట్టారు...