విజయవాడలో బుధవారం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో గందరగోళం నెలకొంది. నేతల మధ్య భేదాభిప్రాయాల కారణంగా ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హంగామా సృష్టించారు .దీనికి గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశం వేదికైంది. సమావేశానికి హాజరైన మల్లాది విష్ణు అలకబూని వేదికపైకి వెళ్లేందుకు ససేమిరా అన్నారు. దీంతో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, పార్ధసారధి ఎన్నిసార్లు పిలిచినా మల్లాది విష్ణు పైకి వెళ్లకుండా భీష్మించుకుపోయారు..స్వయంగా వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి బతిమాలినా ఫలితం లేకుండా పోయింది.

radha 21022018 2

మరోవైపు వంగవీటి రాధా అనుచరులు నానా హంగామా సృష్టించారు. రాధాను సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై రాధా, జై రంగా అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒకింత అసహనానికి గురైన మల్లాది విష్ణు..ఆపండయ్యా అంటూ వారించారు. రాధాని రెండు రోజులుగా పిలుస్తున్నామని, కాసేపట్లో వస్తారని సామినేని ఉదయభాను సముదాయించారు. మొత్తం మీద వంగవీటి రాధా ఆలస్యంగానైనా సమావేశానికి రావడంతో గందరగోళం సద్దుమణిగింది.

radha 21022018 3

ఇప్పటికే రాధా, జగన్ వైఖరి పై గుర్రుగా ఉన్నారనే అభిప్రాయం ఉంది... పార్టీ మారుతున్నారు అనే ప్రచారం కూడా ఉంది... గౌతం రెడ్డి విషయంలో జగన్ ఆడిన డ్రామాలు, అలాగే రాధాకి సీట్ ఇవ్వకుండా, తప్పించే ప్లాన్ వెయ్యటం, రంగాను అన్ని తిట్టిన గౌతం రెడ్డిని బహిరంగంగా జగన్ కలవటం, ఇవన్నీ రాధాకు ఇబ్బందిగా మారాయి... టైం తీసుకుని, అడుగు వేస్తా అని ఇప్పటికే రాధా తన అనుచరుల దగ్గర ప్రకటించారు.. వైసిపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా, రాధా ఆక్టివ్ గా పాల్గునటం లేదు..

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర ప్రారంభమైంది... ఈ రోజు ఆయన కొత్త పార్టీ గురించి ప్రకటన చెయ్యనున్న సంగతి తెలిసిందే... ఈరోజు ఉదయం 8 గంటలకు కమల్‌ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం స్వస్థలం రామేశ్వరం చేరుకున్నారు. కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌కు చేతి గడియారం కానుకగా ఇచ్చారు. సాధారణ గృహాల్లో నివసించడంలోనే గొప్పతనం ఉందని.. కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ అన్నారు. ఉదయం 9 గంటలకు ఆయన మత్య్సకారులతో సమావేశమయ్యారు... 10 గంటలకు హయత్‌ ప్లే్‌స్‌ హోటల్‌లో నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు... చంద్రబాబు నా హీరో అన్నారు...

kamal 21022018 2

కమల్‌ మాట్లాడుతూ..‘నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్‌ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారు. రాజకీయ యాత్రలో భాగంగా కార్యకర్తలు, అభిమానులు నన్ను కలవడానికి వచ్చి శాలువాలు కప్పుతున్నారు. ఇంకెప్పుడూ ఇలా నాకు శాలువాలు కప్పవద్దు. నేను మీ శాలువాగా మారి మీకు రక్షణ కల్పిస్తాను.’

kamal 21022018 3

ఇది వరకు కూడా కమల్ మాట్లాడుతూ, "ఐ యాం ఏ ఫ్యాన్ అఫ్ చంద్రబాబు నాయుడు" అని ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూ లో అన్నారు... "ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే, అన్ని విషయాలు గుర్తుకువస్తాయి.... ఆయన ఇది వారకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించారు... ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి నూతన రాష్ట్రానికి, మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారు.... ఆయన పనితనం అద్భుతం (హీ ఈజ్ కమెండబుల్)... ఆయనకు చేతనైన దాంట్లో, ఆయన చెయ్యదగ్గ వరకు, ఆయన చేస్తున్నారు... హి ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ అంటూ, అందుకే నాకు చంద్రబాబు అంటే ఇష్టం, అందుకే నేను చంద్రబాబుకి ఫ్యాన్ అంటూ, కమల్ హసన్ చెప్పారు..."

మహా కామేశ్వ‌ర పీఠం అధిప‌తి య‌ద్ద‌న‌పూడి అయ్య‌న్న పంతులు గారు నిన్న విజాగ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు... ఈ సందరభంగా, అక్కడ విలేకరులు, రాష్ట్ర రాజకీయాల పై అభిప్రాయం అడగగా, అయన అభిప్రాయం చెప్పారు, అయ్య‌న్న పంతులు గారు... ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాసం ఉంది అని చెప్పారు... కాని, కొత్త పార్టీ వస్తే మాత్రం, కొంత ఇబ్బంది ఉంటుంది అని అన్నారు... పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించేనా అని విలేకరులు అడిగితే, అవును అని చెప్పారు...

ayyanna 21022018 2

పవన్ కళ్యాణ్‌లు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం అధికార పార్టీలకే నష్టమని విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహ కామేశ్వర పీఠాధిపతి యద్దనపూడి అయ్యన్న పంతులు చెప్పారు... పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఓటు చీల్చే అవకాసం ఎక్కువ అని చెప్పారు... 2014 ఎన్నికలకు ముందు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న సంగతి తెలిసిందే...

ayyanna 21022018 3

తరువాత చంద్రబాబు గురించి చెప్పారు... చంద్రబాబు ఎంతో తెలివి, ఓర్పు ఉన్నవారని చెప్పారు... చంద్ర బాబు నాయుడు తెలివి తక్కువ గా నిర్ణయాలు తీసుకుంటారు అంటే నేను నమ్మను, ఆయన చాలా తెలివితేటలు అయినోడు, ఓపిక ఉన్నోడు అలాంటి వ్యక్తీ ని వదులుకోకూడదు మనం అని అన్నారు.. ప్రజలకు మంచి జరగాలి అంటే చంద్ర బాబు నాయుడే ఉండాలి కాని, ఇలాంటి చచ్చు వెధవలు ఎవరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని అయ్య‌న్న పంతులు గారు అన్నారు... ఇంతకీ ఏపిలో ఉన్న ఆ చచ్చు వెధవ ఎవరో అయ్య‌న్న పంతులు గారు చెప్పలేదు... కాని, వేరే చెప్పాలా ? ఏపి రాజకీయాల్లో ఉన్న ఆ చచ్చు వెధవ ఎవరో మనకు తెలియదా ?

సీనియర్‌ ఐఎఎస్‌,ఐపిఎస్‌ అధికారులపై, A1 జగన్, A2 విజయసాయి రెడ్డి ఎలా రేచ్చిపోతున్నారో చూస్తున్నాం... జగన్ ఏమో, నెంబర్ వన్ ఐఎఎస్‌ ఆఫీసర్ గా పేరున్న అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుని, జైలుకి తీసుకుపోతా అని అన్నారు... ఒక సందర్భంలో నందిగామలో ప్రభుత్వ డాక్టర్ల పై దౌర్జన్యం చేసారు.. ఇక విశాఖ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ అయితే, నా భూతో న భవిష్యత్తు... ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ నువ్వు అంటూ, రెచ్చిపోయారు... ఇప్పుడు జగన్ బాటలోనే A2 విజయసాయి రెడ్డి నడుస్తున్నారు... మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు...

vijaysai 210222018 2

సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుల సంగతి, ముఖ్యమంత్రిగా 'జగన్‌' ప్రమాణస్వీకారం చేసిన అరగంటనేలోనే చూస్తామని విజయసాయి రెచ్చిపోయారు.. దీని పై నిన్న రాష్ట్రంలోని ఐపీఎస్ ఆఫీసర్లు గెట్టిగా వార్నింగ్ ఇచ్చారు... ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం చెప్పింది... ఆ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి వెనక్కు తీసుకోవాలని, లేకపోతే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది... ఈ రోజు సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర పై చేసిన వ్యాఖ్యల పై, ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించింది...

vijaysai 210222018 3

సీనియర్ ఆఫీసర్ మీద, నిబద్దత కలిగిన ఆఫీసర్ మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు... మేము ప్రభుత్వానికి, ప్రజలకు పని చేస్తామని, చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు... చెప్పారు... సతీష్ చంద్ర ఎంత నిజాయితీ గల అధికారో, అందరికీ తెలుసు అని, ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని, క్షమాపణ చెప్పాలని విజయసాయి ని కోరారు... అయితే ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ, గతంలో వీరి చేసిన అరాచకాలవల్లే కొంత మంది సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు జైలు పాలు అయ్యారని, మరి కొందరు అనారోగ్యాల పాలు అయ్యారని..వారు ఆరోపిస్తున్నారు. తాము ఎటువంటి తప్పులు చేయడం లేదని..ఒకవేళ చేస్తే..దానిపై తగిన ఫౌరంలలో ఫిర్యాదులు చేసుకోవచ్చని..అంతే కానీ..తమకు సంబంధం లేని విషయాల్లో ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read