నీతి ఆయోగ్ సమావేశంలో, ప్రధాని మోడీకి, చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో వైసీపీ, జనసేన ఎంత గోల చేసిందో చూసాం. దేశం మొత్తం, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులకు, ప్రధాని వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తే, ఆ సందర్భంలో చంద్రబాబు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనికి ఎదో ఒంగిపోయాడు అని, లొంగిపోయాడు అని, పిచ్చ ప్రచారాలు చేసారు. టీ బ్రేక్ సమయంలో, ప్రధాని మోడీ, అందరి ముఖ్యమంత్రులని పలకరిస్తూ, మమత, చంద్రబాబు, కుమారస్వామి దగ్గరకు వచ్చి, వీరిని కూడా పలకరించారు. దీని పై రచ్చ రచ్చ చేశారు. అయితే, ఇప్పుడు ఇదే పరిస్థితి పాపం పవన్ కళ్యాణ్ కు వచ్చింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ పత్రిష్టాపన కార్యక్రమం సందర్భంగా జరిగన సంఘటనకు, పవన్ ఒక పెద్ద ట్వీట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది.

pk 23062018 2

విగ్రహ పత్రిష్టాపన కార్యక్రమంలో పాల్గున్న పవన్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నవ్వుతూ అభివాదం చేసాడు. ప్రతిగా నమస్కారం చేసిన ముఖ్యమంత్రి. అలాగే ఇద్దరూ కలిసి, 20 నిమషాల పాటు మాట్లాడుకోవటంతో, టీవీల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. దీని పై పవన్ ట్వీట్ చేసారు. అంతే కాదు, ఈ ట్వీట్ తో, మొన్న ముఖ్యమంత్రి, ప్రధాని కలిసిన సందర్భంలో రెచ్చిపోయి హడావిడి చేసిన పవన్ ఫాన్స్ కు కూడా, గట్టిగా గడ్డి పెట్టాడు పవన్. రాజకీయ నాయకులు బయట ఏదో ఒక సందర్భంలో తారసపడుతుండటం, ఇలా ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం మామూలేనని, దానికి ఎదో అయిపొయింది అంటూ, హడవిడి చెయ్యటం మంచిది కాదు, అది సంస్కారం అంటూ, ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే, తప్పేమీ లేదు అని ట్వీట్ చేసారు.

pk 23062018 3

‘‘వైసీపీ, టీడీపీ నేతలు ఏదో ఒక సమయంలో తారసపడుతుంటారు. అలాంటప్పుడు వారి బాగోగులు కనుక్కోవడం జరుగుతుంటుంది. దయచేసి ఇలాంటివి జరిగినప్పుడు ఆ రెండు పార్టీల వారు కానీ, ఇతరులు కానీ ఏదో జరిగిపోతోందంటూ ఊహించుకోవద్దు. నేను కలుసుకున్న, పలకరించిన వారిలో చాలామంది నాకు తెలిసినవారే అయి ఉంటారు. గతంలో వారితో కలిసి రాజకీయ ప్రయాణం చేయడమే ఇందుకు కారణం. రాజకీయ విభేదాలను కేవలం విధానాల పరంగానే నేను చూస్తాను. వ్యక్తిగత కోణంలో చూడను. ఇది లోపించడం వల్లే వైసీపీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సజావుగా సాగనీయడం లేదు’’ అని పవన్ ట్వీట్‌ చేసారు. మొత్తానికి, పవన్ కు, పవన్ ఫాన్స్ కు ఇప్పుడు ఖర్మ సిద్ధాంతం గుర్తుకు వచ్చింది. మనం ఒకరిని అకారణంగా ఎగతాళి చేస్తే, అదే సందర్భం మనకు ఎదురు అవుతుంది, అప్పుడు మనం దానికి సమాధనం చెప్పుకోవాలి.. దీన్నే ఖర్మ సిద్ధాంతం అంటారు... రీల్ లైఫ్ కి, రియల్ లైఫ్ కి తేడా తెలుసుకుంటే, అందరికీ మంచిది.

ప్రభుత్వాలికి కూడా తెలియని సమాచారం పవన్ కళ్యాణ్ కు తెలిసిపోతూ ఉంటుంది. ఈయన ఎయిర్ పోర్ట్ లో ఉండగా, ఐపిఎస్ ఆఫీసర్ లు, ఇంటలిజెన్స్ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వకుండా, పవన్ కళ్యాణ్ కు వచ్చి నివేదికలు ఇస్తారు. కామెడీగా ఉన్నా, పవన్ చెప్పే మాటలు ఇవి. ఏ సందర్భంలో, ఏ ఇష్యూ వచ్చినా, నాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటూ, పవన్ ఎదో చెప్తూ ఉంటారు. అలాగే తిరుమల ఇష్యూ పై కూడా స్పందించారు. తిరుమలలో శ్రీవారి గులాబీ వజ్రం, పలు నగలు మాయమయ్యాయని, ఈ విషయం నాకు కొన్నేళ్ళ క్రిందటే తెలుసని, స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలకు తరలించినట్టు నాకు ఒక ఐపిఎస్ ఆఫీసర్ చెప్పారు అంటూ, పవన్ కళ్యాణ్ రెండో రోజుల నుంచి వరుస ట్వీట్లు వేస్తున్నారు. ఈ వ్యాఖ్యల పై, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు.

pawan 23062018 2

వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి కుట్రకు వైసిపి, జనసేన ప్రధాన సూత్రధారులని వ్యాఖ్యానించారు. తిరుమలపై దుష్ప్రచారానికి రమణ దీక్షితులను పనిముట్టుగా వాడుకుంటున్నారని విమర్శించారు. తిరుమల కొండపై అనేక సమస్యలు వచ్చినప్పుడు రమణ దీక్షితులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం, ఎన్వీ ప్రసాద్‌ వంటి పలువురు అధికారులు దీక్షితుల నైజాన్ని బయటపెట్టారని గుర్తు చేశారు. బిజెపి స్క్రిప్ట్‌ను పవన్‌ ట్వీట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలకు వెంకటేశ్వరస్వామి గుడినీ వాడుకోవడం దారుణమని విమర్శించారు.

pawan 23062018 3

పవన్‌ అంటేనే గాలి అని, గాలి వార్తలు నమ్మి వాటిని చెప్పడం తప్ప, ఆయనకు సొంతగా ఆలోచించే శక్తి లేదని, ఆయన అజ్ఞాతవాసని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌ రీల్‌ లైఫ్‌ నుంచి రియల్‌ లైఫ్‌కు ఉన్న తేడాను గమనించాలని హితవు పలికారు. ఎవరో ఏదో చెబితే అదే నిజం అనుకుని జనం ముందు చెప్పడం ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనమన్నారు. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని సూచించారు. ఎప్పుడో ఎయిర్‌పోర్టులో ఐపిఎస్‌ అధికారి చెప్పిన విషయాన్ని ఇప్పటి వరకు పవన్‌ ఎందుకు దాచారని ప్రశ్నించారు. ఆ పోలీస్‌ అధికారి పేరు చెబితే పిలిపించి వాస్తవాలు మాట్లాడతామన్నారు. 1952 తరువాత వెంకటేశ్వరస్వామి నగలకు సంబంధించి అన్ని రికార్డులూ ఉన్నాయని, రాయల ఆభరణాల రికార్డులు 1952కు ముందే లేవని కెఇ చెప్పారు. వెంకన్న మహిమగల దేవుడు. ఆయనతో పెట్టుకుంటే ఎవరికీ మంచిది కాదు.. చేటు తప్పదు అని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నగరంలోని రాయపూడిలో, ఐకానిక్ టవర్ కు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. కృష్ణా నదికి అభిముఖంగా... 33 అంతస్తులలో ఐకాన్‌ టవర్‌ ఉంటుంది... 500 కోట్లతో నిర్మాణం జరగనున్న ఈ ప్రాజెక్ట్, 18 నెలల్లో పూర్తవుతుంది. ఇది రాజధానికే ఒక వజ్రంలా ఉంటుందని సొసైటీ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, కృష్ణానదికి మధ్యన ఉండటం వల్ల ప్రకృతి ఒడిలో ఇమిడినట్లుగా ఉంటుంది. 33వ అంతస్తులో రూఫ్‌టాప్‌ పూల్‌, ఎన్‌ఆర్‌టీ క్లబ్‌ ఉంటాయి. ప్రైవేటు కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, జిమ్నాజియం కూడా ఉంటాయి. ఐకాన్‌ చుట్టూత ఇన్‌సులార్‌ స్కిర్ట్‌ ఏర్పాటు చేయడం వల్ల 30 శాతం ఇంధనం ఆదా అవుతుంది. రూప్‌ టాప్‌ గార్డెన్స్‌తో సహజసిద్ధమైన చల్లదనం అమరుతుంది. నీటిని పొదుపు చేసేందుకు కూడా ప్రాజెక్టులు చేపడతారు. సోలార్‌ విద్యుత్‌తో కార్బన్‌ ఎమిషన్స్‌ ఉండవు. రివర్‌ఫ్రంట్‌లో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు స్పెషాలిటీ కియోస్క్‌లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో సంస్థకి 4,500 ఎస్‌ఎఫ్‌టీని కేటాయిస్తారు.

ntrtower 23062018 2

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచానికి సేవలు అందించే అదృష్టం కల్పించిన జన్మభూమి రుణాన్ని తీర్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇన్మ ర్మేషన్‌ టెక్నాలజీ అంటే సిలి కాల్‌ వ్యాలీ ఏవిధంగా గుర్తుకు వస్తుందో అదే తర హాలో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా రూపొందిం చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రవాసాంద్రులు జన్మభూమిని మరు వకూడదని, ఏ దేశంలో స్థిరపడతారో ఆ దేశ ప్రజలతో మమేకం కావాలన్నారు. ఆయా దేశాలలో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అదే సమయం లో వారు జ న్మించిన రాష్ట్రానికి, గ్రామానికి చేయూతను అం దించాలన్నారు. ఏపీ ఎన్నార్టీలో 120 దేశాల నుంచి ప్రవా సాంధ్రులు ప్రాతినిధ్యం ఉందని, దేశంలో మరే ఇతర రాష్ట్రా నికి ఈ ఘనత లేదన్నారు. గత నాలు గేళ్లలో నాలెడ్జ్‌ సోసైటీకి పెద్ద పీట వేశామని, విదేశాల లో భారత కీర్తిని పెంచడంలో తెలుగువారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు.

ntrtower 23062018 3

తెలుగువారి సంక్షేమం కోసం ఏపి ఎన్‌ఆర్టీని పెట్టా మని, దీనిలో 83వేల మంది సభ్యులు చాలదేశాల నుంచి ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీరిలో 620 మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముం దుకు వస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రపంచం తీరే మారిందని అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, ఆలీబాబా లాంటి ఆన్‌లైన్‌ కంపెనీలు ఐటీని వినియో గించుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నా యని అన్నారు. ఒక వ్యక్తి ఆలోచన సంపద సృష్టికి మూలమని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఏపీ ఎన్‌ఆర్పీలు రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టడంతో పాటు గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఏపీ ఎన్‌ఆర్టీలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. తెలుగుజాతి సత్తా ఒక సక్సెస్‌ స్టోరీ కావాలని ఆకాం క్షించారు.

కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలతో, సార్వత్రిక ఎన్నికల పై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం అనంతపురం జిల్లా నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని ప్రజాదర్బార్‌ హాల్‌లో సమా వేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల పై సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని, ఈ సారి అసెం బ్లి, పార్లమెంట్‌ ఎన్నికలే కాకుండా స్థానిక సంస్థలకు ఒకే సారి ఎన్నికలు జరగను న్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొ న్నారు. నేతలు కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఎన్నికల సంగ్రామానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో తలసరి ఆధాయం రెట్టింపు అయిందని, అదే విధంగా గడచిన మూడేళ్ళుగా రెండంకెల వృద్ధి సాధిస్తున్నామన్నారు.

cbn 23062018 2

పైసా అవినీతి లేకుండా ప్రతి నెల 50 లక్షల మందికి సామాజిక భద్రతా పించన్లు ఇస్తున్నామని దీనిపై ఏడాదికి రూ.5,700 కోట్లు వెచ్చిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నెలకు రూ.200 పించన్‌ ఇచ్చి 200 సార్లు చె ప్పేవారని, ఇప్పుడు రూ.వెయ్యి ఇస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడంలో విఫలమవుతున్నారని నేత లపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. మరో వైపు అన్ని రాజకీయ పార్టీలు టిడిపిపై విష ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించా ల్సిన అవసరం ఉందన్నారు.

cbn 23062018 3

మూడు పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని, ప్రతి రోజు తెలుగుదేశం ప్రభుత్వంపై పదిరకాల విమర్శలు చేస్తున్నారని వీటన్నింటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని నేతలకు అధినేత దిశా నిర్ధేశం చేశారు. ప్రతినేత, కార్యకర్త పరిస్థితులు, మారుతున్న రాజకీయాలను అవగాహన చేసుకుని విశ్లేషకులుగా తయారు కావాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండి పార్టీకి ఉన్న రాజకీయ బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరంటే నాకు మోహమాటం ఉంటుందేమో కానీ ప్రజలకు ఏమాత్రం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు నేతల కు స్పష్టం చేశారు. నాయకుడికి శత్రువు అహంభావమేనని, తనకు ఎదురులేదని ఎవ రన్నా భావిస్తే బోల్తా కొట్టడం ఖాయమని అన్నారు. కేడర్‌తో మమేకం అయినప్పుడే నాయకులుగా ఎదుగుదల ఉంటుందని హితబోద చేశారు.

Advertisements

Latest Articles

Most Read