ఒక పక్క విభజన హామీలు నెరవేర్చమంటే, ఎదురు దాడికి దిగుతుంది కేంద్రం. రాష్ట్రంలోని కొన్ని పార్టీలతో కలిసి డ్రామాలు ఆడుతుంది. రాజకీయంగా, తొక్కేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మరింత దూకుడుగా, మరో రాజకీయ అడుగు వేసింది కేంద్రం. దీనికి ఏపి ప్రభుత్వం కూడా సై అంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో ఐదు నెల్లలో నిర్వ‌హించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సైతం జమిలి ఎన్నికల మీద ప్రకటన చేశారు ప్రధాని మోడీ. అయితే చంద్రబాబు దానికి నవ్వి ఊరుకుననట్టుగా వార్తలు వచ్చాయి. దేశ వ్యాప్తంగా మారిన రాజకీయాలతో సార్వత్రిక ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. మొన్నటి దాకా సాధారణ ఎన్నికలకు మరో 11 నెలల సమయం ఉందని భావించిన రాజకీయపార్టీలకు తాజాగా బిజెపి వేస్తోన్న ఎత్తులు గమనిస్తున్నాయి.

cbn 25062018 2

ఎట్టి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలను 2018లోనే జరపాలనే పట్టుదలతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. దీంతో ఎన్నికల గడువుకు మరో నాలుగు నెలల ముందే ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. వచ్చే ఏడాదిలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాటిని సార్వత్రిక ఎన్నికలతోనే జరిపించాలని బిజెపి పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా డిసెంబర్‌ మాసాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి 2019మే మాసంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రాకు కూడా ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు ఆఫ్ ద రికార్డుగా ప్రస్తావిస్తున్నారు. మరో ఐదు నెలల పాలనను వదులుకొని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. డిసెంబర్‌ మాసంలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి ఐదు నెలలకు మించి కాలం లేదు.

cbn 25062018 3

గత నాలుగేళ్ల కాలంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం అనుకోకుండా వస్తోన్న ఎన్నికల వల్ల లాభపడుతుందా ? లేక నష్టపోతుందా ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే జరుగుతోంది. కొన్ని మాసాల క్రితం ఆంధ్రాకు బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ టిడిపి ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీపై టిడిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, నమ్మించి గొంతు కోశారని ఆరోపిస్తూ ప్రజల్లో సెంటిమెంట్‌ను మళ్లీ రగిల్చే ప్రయత్నం చేసారు. రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందన్న టిడిపి నాయకుల వాదనతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టిడిపి అధినేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముందుగా వస్తే తమకే లాభం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం తేలిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ గెలుస్తుందన్న సర్వే ఫలితాలతో చంద్రబాబు ఖుషీగా ఉన్నారు.

కడప ఉక్కు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేస్తున్న ఆమరణ దీక్ష 5వ రోజుకు చేరుకుంది. దీక్ష ప్రారంభించి 120గంటలు కావటంతో నేతల ఆరోగ్యం క్షీణిస్తోంది. నిన్న, పలువురు నేతలు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, జగన్‌పై విరుచుకుపడ్డారు. తెలుగు జాతితోనూ, కడప పౌరుషంతోనూ పెట్టుకున్న కేంద్రం దిగిరావల్సిందేనని స్పష్టం చేశారు. జగన్‌, పవన్‌ కల్యాణ్‌లు రాష్ట్రంలో సైంధవుల్లా మారారంటూ దుయ్యబట్టారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ, మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని పవన్, జగన్‌ విమర్శించకుండా చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు. వైసీపీ, బీజేపీ జెండాలు వేరైనా అజెండాలు ఒక్కటేనన్నారు. బళ్లారిలోని గాలి జనార్ధన్‌రెడ్డి, కడపలోని జగన్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకే బీజేపీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదన్న చర్చ జనంలో ఉందన్నారు.

pk 25062018 2

వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ‘‘2011లో జరిగిన ఉప ఎన్నికల్లో కడప పౌరుషానికి, ఢిల్లీకి పోటీ అన్నావు. మరి ఇప్పుడేమైంది? జిల్లాకు అన్యాయం జరుగుతుంటే మోదీని పల్లెత్తు మాట అనవు? దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి, కేసుల మాఫీ కోసం కడప పౌరుషాన్ని ఢిల్లీలోని ప్రధానమంత్రి కాళ్ల వద్ద తాకట్టు పెట్టావు. వైఎ్‌సఆర్‌ కడప జిల్లా అనే పిలిచే అర్హతని కోల్పోయావు’’ అంటూ దుయ్యబట్టారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాయలసీమ పౌరుషం, కడప ముద్దుబిడ్డలం అని చెప్పుకునే వారు ఎందుకు ఢిల్లీ పెద్దలకు వ్యతిరేకంగా నోరు మెదపడంలేదు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి కాళ్లబేరం, ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డితో రాయబారం వంటి రాజకీయాలకు పాల్పడే వైసీపీ రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు.

pk 25062018 3

మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగన్‌కు అనుభవం, అవగాహన లేదన్నారు. అసెంబ్లీ అంటే లోటస్‌ పాండ్‌, చట్టం అంటే ఇడుపులపాయ అనుకుంటారని, అనుభవం లేని ప్రతిపక్ష నేత ఉండడం రాష్ట్రానికి దౌర్భాగ్యమన్నారు. మరో పక్క నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి. జగన్, బీజేపీ ట్యూన్ లోనే పవన్ మాట్లాడటం, ఉక్కు పరిశ్రమ రాకపోవటానికి కేంద్రం కారణం కదాని, తెలుగుదేశం మాత్రమే కారణం అంటూ, ప్రైవేటు సంస్థలకు స్టీల్ ప్లాంట్ కట్టబెట్టే ప్లాన్ లోనే, పవన్ కూడా మాట్లాడుతున్నారని అంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనటం చూస్తుంటే, వీరికి రాష్ట్రం పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అంటున్నారు.

రాజశేఖర్ రెడ్డి ముద్దుగా పెద్ద కొడుకు అని పిలుచుకునే వ్యక్తి, జగన్ మోహన్ రెడ్డికి సోదర సమానుడు... ఇది జగన్ బ్యాచ్ గాలి జనార్ధన్ రెడ్డి గురించి ముద్దుగా పిలుచుకునే తీరు... సామాన్య ప్రజలు మాత్రం, సహజ వనరులు కొట్టేసిన దొంగ... బెయిల్ కోసం జడ్జికే లంచం ఇచ్చిన వాడు.. జైలు జీవితం అనుభవించి, కండీషనల్ బెయిల్ పై, బయట తిరుగుతున్న వాడిగా పిలుస్తారు.. ఓబులాపురం గనుల కొట్టేసి, లక్షల కోట్లు వెనకేసుకున్న గాలి జనార్ధన్ రెడ్డి, ఎట్టకేలక తెలుగు మీడియా ముందుకు వచ్చాడు.. అది కూడా, స్టీల్ ప్లాంట్ కోసం.. ఒక పక్క, బీజేపీ, జగన కలిసి, గాలి జనార్ధన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్ కట్టబట్టే కుట్ర చేస్తున్నారు అనే విమర్శలు చేస్తూ ఉండగానే, ఈయన మీడియా ముందుకు వచ్చాడు.

gali 24062018 2

బ్రాహ్మణి స్టీల్స్ కోసం దాదాపు రూ.1350 కోట్లు ఖర్చు పెట్టానని, కడపలో స్టీల్ ప్లాంట్ పనులు తనకే అప్పగించాలని కోరారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ పనులు వేరే వాళ్లకు కేటాయిస్తే, తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తానని, అవసరమైతే, చంద్రబాబును కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, బ్రాహ్మణి స్టీల్స్ కు సంబంధించిన అన్ని వివరాలు అందజేస్తానని చెప్పారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదంటూ మెకాన్ సంస్థ నివేదిక ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయని గతంలో ఇదే సంస్థ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

gali 24062018 3

నిజానికి, ఆ ఖర్చు పెట్టిన రూ.1350 కోట్లకు సంబదించిన మిషనరీ, సిబిఐ జప్తు చేసింది. ఎందుకంటే, అది కూడా ప్రజల దగ్గర కొట్టేసిన డబ్బు కాబట్టి. అంతే కాదు, ఈ బ్రాహ్మణి స్టీల్స్ కోసం రాజశేఖర్ రెడ్డి చేసిన అరాచకం ఎవరూ మర్చిపోలేదు. ఎకరా 18000 లెక్క పదివేల ఎకరాలు, వైస్, గాలి జనార్దనరెడ్డికి కి ఇస్తుంటే, ఏడ్చిన వారిని, మరింత ఎగతాళి చేసేలా, విమానాశ్రయంకు కూడా అని, మరో నాలుగు వేల ఎకరాలు ఇచ్చాడు, కావాలంటే మరో పదివేల ఎకరాలు ఇస్తా అన్నాడు. వచ్చి పడిన వేల ఎకరాల భూములను బ్యాంకులో తాకటెట్టాడు గాలి. వైఎస్ కు బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఇచ్చాడు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. బ్రహ్మణి ఉక్కు భ్రమలు మెల్లగా వీడిపోయాయి. ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి, మళ్ళీ వచ్చి, నేను స్టీల్ ప్లాంట్ కడతాను, నాకు ఇవ్వండి అంటున్నాడు.. ఒక దొంగకి, ఏ ప్రభుత్వం అన్నా, ఇలాంటివి ఇస్తుందా ? లేకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలి అంట, ఈయన గారు కష్టపడి సంపాదించిన సొమ్ము మరి...

రాష్ట్ర సమస్యల కోసం, ఎవరితో అయినా కలిసి పని చేస్తా అని బిల్డ్ అప్ లు... కట్ చేస్తే, కేంద్రం పై పోరాటం చెయ్యాలి అంటేనే వణుకు... జానాల మధ్యకు వచ్చి, ఎదో పిచ్చ పట్టినట్టు ఊగుతాడు, ఎందుకు ఊగుతాడో తెలీదు.. మోడీ అనే మాట, నోటిలో నుంచి వచ్చి, కొన్ని నెలలు అయ్యింది. బీజేపీకి ఇబ్బంది అనుకున్న ప్రతిసారి వచ్చి హడావిడి చేస్తాడు. చంద్రబాబు తన పుట్టిన రోజున ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే, అర్ధరాత్రి ట్వీట్లు మొదలు పెట్టాడు. వారం ముందు తన తల్లిని ఎవరో ఒక సినిమా ఆక్టర్ ఎదో అంటే, వారం తరువాత, ఆ విషయాన్ని చంద్రబాబుకి ముడి పెట్టి, వరుస ట్వీట్లు మొదలు పెట్టాడు.. విశాఖలో ధర్మ పోరాట సభ అంటే, హడావిడి చేసాడు... కడపలో ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష అంటే, ఎప్పుడో అయిపోయిన, శ్రీ వారి నగల గురించి, రమణ దీక్షితులు చెప్పే అబద్ధాల గురించి, ట్వీట్లు మొదలు పెట్టాడు.. ఇవన్నీ కేంద్రం పై పోరాటం చేస్తున్న వారికి ప్రజల్లో ఫోకస్ రాకుండా చేసే, నీఛమైన దిగజారుడు చర్యలు...

pk 25062018 2

నిన్న మరింత ముందుకు వెళ్ళాడు.. జగన్ మోహన్ రెడ్డి లాగా సిగ్గు అనేది పూర్తిగా వదిలేసాడు... ఒక పక్క కడప ఉక్కు పై 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే, వారికి కనీస మద్దతు ప్రకటించలేదు. సరే, ప్రకటించక పోగా, తెలుగుదేశం పార్టీ వల్లే ఉక్క పరిశ్రమ రావటం లేదని, కేంద్రం తప్పు లేదంటూ, దిగజారిపోయి మాట్లాడుతున్నాడు.. ఇపుడు ఉక్కు పరిశ్రమ కోసం గోల చేస్తున్న టీడీపీ నేతలే ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారు అంటూ, బోడి గుండుకి మోకాలుకి ముడి పెడుతున్నాడు.. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి కలిసి బ్రాహ్మిణి స్టీల్స్ తో చేసిన అరాచాకాన్ని తెలుగుదేశం ఒక్కటే కాదు, పవన్ పక్కన ఉన్న కమ్యూనిస్ట్ లు కూడా అడ్డుకున్నారు. అది ప్రైవేటు సంస్థ... ఇప్పుడు మనకు, కేంద్రం వచ్చి ఉక్కు పరిశ్రమ పెట్టాలి... ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా, బీజేపీ, జగన్ పన్నిన పన్నాగం ప్రకారం, ఉక్కు పరిశ్రమను, గాలి జనార్ధన్ రెడ్డికి ఇవ్వమంటావా పవన్ ?

pk 25062018 3

అంతే కాదు మరో కామెడీ విషయం కూడా చెప్పాడు... రోడ్డు వెంట పిట్టల దొరలు చెప్పే కబురులు లాగా... జిందాల్ సంస్థ, కడపలో తాము ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమని తనతో చెప్పింది అంట... నువ్వు ఎవడివి, నీకు చెప్పటానికి ? ఒక రోజు బయట ఉంటే, నెల రోజులు ఫార్మ్ హౌస్ లో ఉండేవాడివి, అయినా నీ అర్హత ఏంటి అంటే, జిందాల్ సంస్థ నీతో చెప్తుంది ? చెప్తే కేంద్రంతో, లేకపోతే రాష్ట్రం ప్రభుత్వంతో చెప్తుంది.. అంతే కాదు, రాష్ట్రంలో పరిశ్రమ రావాలి అంటే, పెర్సెంటేజ్ ఇవ్వాలి అంట, అందుకే భయపడిపోయి పరిశ్రమలు రావటం లేదంట... ఈ విషయం విదేశాలకు వెళ్ళినప్పుడు, తనతో వచ్చి పారిశ్రామకవేత్తలు చెప్పారంట... ఏంటి అండి ఇది ? ఇదేమన్నా త్రివిక్రమ్ సినిమాలో స్క్రిప్ట్ అనుకుంటున్నాడా ? అందరూ వచ్చి ఈయనకే చెప్తారు, ఇదేమి కామెడీనో ఏంటో ? కియా, అశోక్ లేల్యాండ్, హీరో, గమేషా, సెల్కాన్, ఫాక్ష్కాన్, ఇవన్నీ ఎలా వచ్చాయి ? కేంద్రాన్ని సమర్ధించటం కోసం, ఉక్క పరిశ్రమ విషయంలో కేంద్రం పై నిందలు రాకుండా ఉండటం కోసం, ఇన్ని అబద్ధాలు, ఒక 10 నిమషాల ప్రెస్ మీట్ లో మాట్లాడాడు... జగన్ కు పోటీగా, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.. జగన్ అంటే కేసుల కోసం లొంగిపోయాడు.. మరి ఇతగాడు, ఎందుకు, దేనికి, ఏ పెన్ డ్రైవ్ కు లోంగాడో, ఆ అమిత్ షా కే తెలియాలి...

Advertisements

Latest Articles

Most Read