ముంద‌స్తుకి వెళ్లాల‌నుకుంటోన్న జ‌గన్ రెడ్డి ఎన్నో ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాడు. కానీ ఏ బాబాయ్ హ‌త్య‌తో ల‌బ్ధి పొంది సీఎం అయ్యాడో అదే హ‌త్య కేసు వ‌చ్చే ఎన్నిక‌ల వ్యూహంలో అడుగులు ముందుకు వేయ‌కుండా ముంద‌రి కాళ్ల‌కి బంధం వేసి ప‌డేసింది. మ‌రోవైపు టిడిపి అధినేత చంద్ర‌బాబు త‌న‌దైన రాజ‌కీయ చ‌తుర‌త మొద‌లు పెట్టారు. ద‌త్త‌పుత్రుడు అంటూ రోజూ అరుస్తోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయి స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. గుడివాడలో ఇటీవ‌ల ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వైకాపా తురుపుముక్క‌గా భావించే కొడాలి నానికి అన్యాప‌దేశంగా హెచ్చ‌రిక‌లు పంపింది. మ‌ళ్లీ ఎన్టీఆర్ శ‌త‌జయంతి ఉత్స‌వాల‌కి గుడివాడ అడ్డా చేసుకుని చంద్ర‌బాబు మార్క్ మాస్ట‌ర్ స్ట్రోక్ ఇచ్చారు. ఓ వైపు నంద‌మూరి బాల‌కృష్ణ‌, మ‌రోవైపు త‌మిళ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌లు స‌భ‌కి హాజ‌రై తెలుగుదేశం విజ‌య‌బావుటాని ముంద‌స్తుగానే ఎగుర‌వేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని బెదిరించ‌డానికే ర‌జ‌నీకాంత్‌ని తీసుకొచ్చార‌ని కొడాలి నాని ఆరోపించిన మ‌రుస‌టి రోజే ప‌వ‌న్ క‌ళ్యాన్ నేరుగా చంద్ర‌బాబు ఇంటికి వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపి రావ‌డంతో వైకాపా క్యాంపులో గంద‌ర‌గోళం మొద‌లైంది. వైసీపీ ప్ర‌యోగించే బూతుల‌కు కౌంట‌ర్లు ఇచ్చే ప‌ద్ద‌తి మానేసిన తెలుగుదేశం.. కొత్త టాస్క్ ఇస్తూ, దాని చుట్టే వైకాపా తురుపుముక్క‌ల‌ని తిప్పుతూ డిఫ‌రెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తూ..ఆట‌ని ర‌క్తి క‌ట్టిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన్నాళ్లుగా సీబీఐ వార్త‌లే ప‌తాక‌శీర్షిక‌లకి ఎక్కుతున్నాయి. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో డెవ‌ల‌ప్మెంట్స్‌పై వార్త‌లు వైసీపీకి బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఇలా సీబీఐ అరెస్టులు, లీకులు, అఫిడ‌విట్ల‌తో సెన్సేష‌న్ అయ్యే ప్ర‌తీసారి వైసీపీ స‌ర్కారు సీఐడీని దింపుతోంది. మొన్న‌టివ‌ర‌కూ సీబీఐ బాబాయ్ మ‌ర్డ‌ర్ డొంక క‌దిలించిన ప్ర‌తీసారి సీఐడీ ఏదో ఒక కేసుతో వ‌చ్చేది. మాజీ మంత్రి నారాయ‌ణ‌, స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాం, రాజ‌ధాని ల్యాండ్ స్కామ్, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారం ఇలా ఏదో ఒక వార్త‌ని సీఐడీ ద్వారా కౌంట‌ర్ గా ఎంచుకునేది. వివేకానంద‌రెడ్డి కేసు చివ‌రి ద‌శ‌కి చేరింది. అవినాష్ రెడ్డి అరెస్టు వార్త‌లు ఎండ‌మావులు సీరియ‌ల్ని త‌ల‌పిస్తున్నాయి. సీబీఐ యాక్ష‌న్‌కి కౌంట‌ర్ రియాక్ష‌న్ సీఐడీ ఈసారి కొత్త టార్గెట్ ప‌ట్టింది. టిడిపి నేత ఆదిరెడ్డి వాసు, ఆయ‌న తండ్రి ఆదిరెడ్డి అప్పారావుల‌ని చిట్స్ కేసులో సీఐడీ అరెస్టు చేసింది. ప్ర‌స్తుతం సీబీఐ అవినాస్ రెడ్డిని అరెస్టు చేయ‌ని ప‌క్షంలో త‌మ‌దే పైచేయి అయింద‌ని సీఐడీ సంబ‌ర‌ప‌డుతోంది. రేప‌టికి ఎవ‌రిది పై చేయి అవుతుందో మ‌రి?

ఎవ‌రికి లేని ఇంటి పేరు ఎదుగూరి సంధింటి సింపుల్‌గా వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి మాత్ర‌మే ఉంది. దేశంలో ఏ రాజకీయ పార్టీ నేత‌ల‌పై లేని కేసులు వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపైనే ఉన్నాయి. అక్ర‌మాస్తుల కేసుల్లోనూ, అక్ర‌మ సంపాద‌న‌లోనూ జ‌గ‌న్ రెడ్డే నెంబ‌ర్ వ‌న్. ఇటువంటి ప్ర‌త్యేక‌త‌లు ఉన్న జ‌గ‌న్ రెడ్డి సీబీఐ-ఈడీ కేసుల్లో అరెస్ట‌యి 16 నెల‌లు చంచ‌ల్ గూడ జైలులో ఉన్నాడు. చంచ‌ల్ గూడ పేరు విన‌గానే ఠ‌క్కున షిక్క‌టి షిరున‌వ్వుల జ‌గ‌న్ రెడ్డి గుర్తొస్తారు. అంత‌టి అనుబంధం ఆ జైలుతో జ‌గ‌న్ రెడ్డికి పెన‌వేసుకుపోయింది. చంచ‌ల్ గూడ జైలుతో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని మ‌రోసారి కొన‌సాగించారు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్ రెడ్డి. వ‌ర‌స‌కి సోద‌రుడ‌య్యే వైఎస్ వివేకానంద‌రెడ్డిని అంత‌మొందించిన కేసులో నిందితుడిగా వైఎస్ భాస్క‌ర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా రిమాండ్ విధించింది. దీంతో గ‌తంలో అబ్బాయ్ జ‌గ‌న్ రెడ్డి ఉన్న జైలులోనే బాబాయ్ భాస్క‌ర్ రెడ్డిని చంచ‌ల్ గూడ‌కి పంపారు. ఎదుగూరి సంధింటికి బాగా అచ్చి వ‌చ్చిన జైలు చంచ‌ల్ గూడ అనే సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది.

వైకాపా ప్ర‌వ‌ర్త‌న ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌కుండా విచిత్రంగా ఉంటోంది. ఏ విష‌యంలో ఎందుకు స్పందిస్తున్నారో కూడా అర్థంకావ‌డంలేదు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వంలో పాల్గొని చంద్ర‌బాబు పాల‌నాద‌క్షుడ‌ని త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌శంసించారు. ఇదే పెద్ద నేరం అన్న‌ట్టు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు బూతుల‌తో విర‌చుకుప‌డ్డారు. వైసీపీ సోష‌ల్మీడియా అయితే పెద్ద ఎత్తున ర‌జ‌నీకాంత్ పై ఫేక్ మార్పింగ్ పోస్టుల‌తో దాడి చేసింది. అయితే వివేకానంద‌రెడ్డి హ‌త్య అంద‌రి కంటే ముందు జ‌గ‌న్ రెడ్డి దంప‌తుల‌కు తెలుసు అని, సీబీఐ విచార‌ణ చేస్తే వివేకా హ‌త్య రోజు తెల్ల‌వారుజామున జ‌గ‌న్ రెడ్డితో ఉన్న న‌లుగురునీ పిల‌వాల్సి ఉంటుంద‌ని బాంబు పేల్చారు. వాస్త‌వంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య బ‌య‌టి ప్ర‌పంచానికి 6.30కి తెలిస్తే, జ‌గ‌న్ రెడ్డి ఆయ‌న భార్య‌కి అంత‌కంటే ముందే తెలుసు అని సెన్సేష‌న్ ఆర్టిక‌ల్ ప్ర‌చురించారు. ఆ రోజు జ‌గ‌న్ తో ఉన్న‌వాళ్ల పేర్లు కూడా రాసి పారేశాడు. దీనిపై వైకాపాలో ఒక్క నోరూ లేవ‌లేదు. వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యంలో జ‌గ‌న్ రెడ్డి దంపతుల వైపే వేళ్ల‌న్నీ చూపుతున్నాయ‌ని ఏబీఎన్ ఆర్కే పేర్లు, వివ‌రాలు, ఆధారాల‌తో స‌హా రాసి పారేస్తే...వైకాపా ఖండించేందుకు సాహ‌సించ‌లేదంటే..స‌మ్ థింగ్ ఫిషీ..

Advertisements

Latest Articles

Most Read