ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్లుగా సీబీఐ వార్తలే పతాకశీర్షికలకి ఎక్కుతున్నాయి. వివేకానందరెడ్డి హత్యకేసులో డెవలప్మెంట్స్‌పై వార్తలు వైసీపీకి బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఇలా సీబీఐ అరెస్టులు, లీకులు, అఫిడవిట్లతో సెన్సేషన్ అయ్యే ప్రతీసారి వైసీపీ సర్కారు సీఐడీని దింపుతోంది. మొన్నటివరకూ సీబీఐ బాబాయ్ మర్డర్ డొంక కదిలించిన ప్రతీసారి సీఐడీ ఏదో ఒక కేసుతో వచ్చేది. మాజీ మంత్రి నారాయణ, స్కిల్ డెవలప్మెంట్ స్కాం, రాజధాని ల్యాండ్ స్కామ్, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, మార్గదర్శి వ్యవహారం ఇలా ఏదో ఒక వార్తని సీఐడీ ద్వారా కౌంటర్ గా ఎంచుకునేది. వివేకానందరెడ్డి కేసు చివరి దశకి చేరింది. అవినాష్ రెడ్డి అరెస్టు వార్తలు ఎండమావులు సీరియల్ని తలపిస్తున్నాయి. సీబీఐ యాక్షన్‌కి కౌంటర్ రియాక్షన్ సీఐడీ ఈసారి కొత్త టార్గెట్ పట్టింది. టిడిపి నేత ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావులని చిట్స్ కేసులో సీఐడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం సీబీఐ అవినాస్ రెడ్డిని అరెస్టు చేయని పక్షంలో తమదే పైచేయి అయిందని సీఐడీ సంబరపడుతోంది. రేపటికి ఎవరిది పై చేయి అవుతుందో మరి?
ఏపీలో సీబీఐ గెలుస్తుందా? సీఐడీ నిలుస్తుందా ? ఇంటరెస్టింగ్ అనాలసిస్...
Advertisements