సుప్రసిద్ధ ఎలక్రానిక్ సంస్థ ఎల్‌జీ ప్రెసిడెంట్ సూన్‌ క్వోన్‌ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. మ్యానుఫ్యాక్చరింగ్‌, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌, ఓఎల్‌ఈడీ, ఎల్‌ఈడీ, స్కీన్స్‌ వంటి డిస్‌ప్లే సిస్టమ్‌ తయారీ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఎల్‌జీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.ఈ సందర్భంగా తమ సంస్థ కార్యకలపాలాను బాబుకు ఎల్‌జీ ప్రెసిడెంట్ వివరించారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా సూన్‌ క్వోన్‌ సానుకూలంగా స్పందించారు.

lg 07122017 2

ఇప్పటివరకూ తాము తయారీ రంగంలో కొరియా దాటి పూర్తిస్థాయిలో మరే దేశానికి వెళ్లలేదని, అయితే ముఖ్యమంత్రి చంద్ర బాబుచేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇండియాలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీకి ఉన్న అనుకూలతలు ఏమిటని ఎల్‌జీ ప్రెసిడెంట్ సీఎంను అడిగి తెలుసు కున్నారు. దేశంలో వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రా లలో ఇప్పటికే తాము నెంబర్ వన్ గా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు... మరో కొరియన్ కంపెనీ కియా మోటార్స్ ఏపీలో స్థిరపడిన విధానం, ఫాక్స్ కాన్ తమిళనాడును వదిలి ఏపీకి వచ్చి 13 వేల మందితో పనిచేస్తున్న వివరాలను ముఖ్యమంత్రి ఎల్‌జీ కంపెనీ ప్రెసిడెంట్ సూన్‌ క్వో దృష్టికి తెచ్చారు.

lg 07122017 3

దేశ సగటు వృద్ధి రేటు కంటే, రెట్టింపు వృద్ధి రేటు సాధిస్తున్నామని చెప్పారు... ఏపీకి విస్తరించే ప్రతిపాదనను తమ బోర్డుతో చర్చిస్తామని సూన్ తెలిపారు. స్టోరేజ్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో పెట్టుబడులకు తమకు ఆసక్తి ఉందని ఆయన చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అక్కడ ఉన్న వ్యాపార అనుకూలతను పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. కాగా ఇంత సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ప్రభుత్వాధినేతను చూడటం తనను ఆశ్చర్యపరుస్తోందని ఎల్‌జీ సంస్థ ప్రెసిడెంట్ సూన్ ప్రశంసాపూర్వకంగా అన్నారు.

అది ప్రతిపక్ష నేత సొంత డబ్బా కొట్టే డబ్బా ఛానల్ సాక్షి... ఆక్కడ ఉన్నది ఒక కామెడీ ఆర్టిస్ట్ కొమ్మినేని... తాను నెలనెలా జీతాలు ఇచ్చే వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకుని, ఒక కామెడీ ఇంటర్వ్యూ చేసాడు జగన్... ఏ రోటికాడ ఆ పాట పాడడం ఈ కొమ్మినేని వారి స్పెషల్ క్వాలిటీ... ఏదన్నా అర్ధవంతమైన ప్రశ్నలు అడిగాడా అంటే అదీ లేదు.... ఎదో కామెడీ షో లాగా, సొంత డబ్బా, ఆహా ఒహా అని కొమ్మినేని అనటం, దానికి జగన్ సిగ్గు పడటం.... సగం ఇది సరిపోయింది... మిగతా సగం, షంద్రబాబు, షంద్రబాబు, షంద్రబాబు... మరి నీ పాదయత్రలో ఏ సమస్యలు చూసావ్ ? నువ్వు వారికిచ్చిన భరోసా ఏంటి అనే ప్రశ్నలు మాత్రం లేవు... ఎదో ఒకటో రెండో అంతే...

kommineni 06122017 2

అసలు ఈ కామెడీ కామెడీ ఇంటర్వ్యూ లో హైలైట్ ఏంటి అంటే, మీరు పవన్ తో పొత్తు పెట్టుకోవటాని రెడీనా అని ఈయన అనటం....ఆయనేమో, ముందు పవన్ చంద్రబాబు మాయలో నుంచి బయటకు రావాలి అనటం హైలైట్.. ఒక పక్క పవన్ ఛీ కొట్టారు... నీ అంత అవినీతి పరుడు లేడు, అందుకే నువ్వు అంటే అసహ్యం, నీలాంటి వాడిని అధికారంలోకి రాకుండా ఆపటమే ధ్యేయం అన్నారు.. అయినా, జగన్ మాత్రం మాంచి కామెడీ ఆన్సర్ ఇచ్చాడు.. దానికి, కొమ్మినేని వారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, సార్ గారిని పొగిడేశారు...

kommineni 06122017 3

పవన్ విషయంలో జగన్ ఈ కామెడీ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, అసలు పవన్‌కళ్యాణ్‌తో తనకు పరిచయం లేదని చెప్పారు... చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ ఎంటరౌతారని, చంద్రబాబును పవన్ విమర్శించరని జగన్ చెప్పారు... పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని, చంద్రబాబు ప్రభావం నుంచి బయటకు రావాలన్నారు.. అప్పుడే ఆలోచిస్తామని జగన్ చెప్పారు... ఈ కామెడీ ఇంటర్వ్యూ చుసిన ప్రజలు మాత్రం, కొమ్మినేని ప్రశ్నలకు, జగన్ ముసి ముసి నవ్వులు చూస్తుంటే, ఎస్ వీ రంగారావు గారు మళ్ళీ పుట్టాడు రా అని అనుకుంటున్నారు...

ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తోంటే.. చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను వాడుకుని వ‌దిలేస్తార‌ని కొంద‌రు త‌నతో చెప్పారని, త‌న‌కు ఎవరు ఏంటో తెలియ‌దా? తెలియకుండానే రాజకీయాల్లోకి వస్తామా? అని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య చేశారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు... జవాబుదారీతనం ఉన్న రాజకీయ వ్యవస్థ రావాలని, చంద్రబాబుకు అనుభవం ఉంది కాబట్టే మద్దతిచ్చానని పవన్‌ పేర్కొన్నారు...

pk cbn 06122017 2

అయినా చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడు అంటున్నారు... సొంత మనుషులు అనుకున్నవాళ్లే దెబ్బ కొట్టినప్పుడు బయటవాళ్లు ఎందుకు కొట్టరని ప్రశ్నించారు. ఎవరి అవసరార్ధం వాళ్లు మాట్లాడుతుంటారు. అన్నీ తెలుసు. కానీ మనకు ఓర్పు ఉండాలి...ఎదగడానికే ముందొచ్చిన మహా వృక్షాలకు మోకరిల్లాలని, ఏ పార్టీని తక్కువగా అంచనా వేయనని, ఏపార్టీ అనుభవం ఆ పార్టీదేనని పవన్‌ పేర్కొన్నారు....

pk cbn 06122017 3

రాష్ట్రం, స‌మాజం, ప్ర‌జా శ్రేయ‌స్సు కోస‌మే తాను బీజేపీ-టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చానని చెప్పుకొచ్చారు. పార్ల‌మెంటు తలుపులు మూసేసి రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డం వ‌ల్లే తాను కాంగ్రెస్‌ను వ్య‌తిరేకిస్తున్నాన‌ని తెలిపారు. జగన్‌ అంటే నాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని, కాని జగన్ చేసిన అవినీతితో తనకి వ్యతిరేకం అని అన్నారు... మార్పు కోసమే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందని, జనసేన భావజాలాన్ని కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పవన్‌ పిలుపు ఇచ్చారు....

మూడు రోజుల పాటు కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై, కొరియన్ మీడియా పొగడ్తల వర్షం కురిపించింది... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కోసం చంద్రబాబు పడుతున్న తపనతో పాటు, పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఇస్తున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధనాలను కూడా మెచ్చుకుంది... అతి పెద్ద కియా మోటార్స్ స్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది, సంవత్సరం పడుతుంది అనుకున్న భూమి చదును పనులు, మూడు నెలల్లో చేసి ఇవ్వటం వంటివి కూడా ప్రస్తావించింది...

korea 06122017 1 2

‘కియా మోటార్స్‌ను అడగండి...ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంద’ని చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు చెప్పిన మాటలు కూడా కొరియన్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది... ఏపీలో 14 ఓడరేవులను అభివృద్ధి , ఏపీ రెండంకెల వృద్ధి రేటు, వ్యవసాయ రంగంలో 25.6 శాతం వృద్ధి ఇలా ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయాలు, ప్రణాలికలు కూడా కొరియన్ మీడియా ప్రస్తావించింది... బిజినెస్‌ సెమినార్‌లో బూసన్‌ వైస్‌ మేయర్‌ కిమ్‌ యంగ్‌వాన్‌ ప్రసంగిస్తూ... చంద్రబాబును డైనమిక్‌ లీడర్‌గా ప్రశంసించటం కూడా అక్కడి పత్రికలు రాశాయి..

korea 06122017 1 3

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న, కొరియా పారిశ్రామికమండలి (ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌),‘మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌’ (ఎంఐసీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం గురించి కూడా అక్కడ పత్రికలు రాశాయి... మొత్తానికి, మన రాష్ట్రం మీద, మన ముఖ్యమంత్రి మీద కొరియా మొత్తం ఒక మంచి పోజిటవ్ వైబ్స్ నడుస్తున్నాయి... కియా మోటార్స్ మన రాష్ట్రంలో రావటం అనేది ఎంత పెద్ద అచీవ్మెంట్ అనేది స్పష్టంగా అర్ధమవుతుంది... కియా

Advertisements

Latest Articles

Most Read