సుప్రసిద్ధ ఎలక్రానిక్ సంస్థ ఎల్‌జీ ప్రెసిడెంట్ సూన్‌ క్వోన్‌ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. మ్యానుఫ్యాక్చరింగ్‌, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌, ఓఎల్‌ఈడీ, ఎల్‌ఈడీ, స్కీన్స్‌ వంటి డిస్‌ప్లే సిస్టమ్‌ తయారీ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఎల్‌జీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.ఈ సందర్భంగా తమ సంస్థ కార్యకలపాలాను బాబుకు ఎల్‌జీ ప్రెసిడెంట్ వివరించారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా సూన్‌ క్వోన్‌ సానుకూలంగా స్పందించారు.

lg 07122017 2

ఇప్పటివరకూ తాము తయారీ రంగంలో కొరియా దాటి పూర్తిస్థాయిలో మరే దేశానికి వెళ్లలేదని, అయితే ముఖ్యమంత్రి చంద్ర బాబుచేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇండియాలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీకి ఉన్న అనుకూలతలు ఏమిటని ఎల్‌జీ ప్రెసిడెంట్ సీఎంను అడిగి తెలుసు కున్నారు. దేశంలో వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రా లలో ఇప్పటికే తాము నెంబర్ వన్ గా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు... మరో కొరియన్ కంపెనీ కియా మోటార్స్ ఏపీలో స్థిరపడిన విధానం, ఫాక్స్ కాన్ తమిళనాడును వదిలి ఏపీకి వచ్చి 13 వేల మందితో పనిచేస్తున్న వివరాలను ముఖ్యమంత్రి ఎల్‌జీ కంపెనీ ప్రెసిడెంట్ సూన్‌ క్వో దృష్టికి తెచ్చారు.

lg 07122017 3

దేశ సగటు వృద్ధి రేటు కంటే, రెట్టింపు వృద్ధి రేటు సాధిస్తున్నామని చెప్పారు... ఏపీకి విస్తరించే ప్రతిపాదనను తమ బోర్డుతో చర్చిస్తామని సూన్ తెలిపారు. స్టోరేజ్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో పెట్టుబడులకు తమకు ఆసక్తి ఉందని ఆయన చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అక్కడ ఉన్న వ్యాపార అనుకూలతను పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. కాగా ఇంత సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ప్రభుత్వాధినేతను చూడటం తనను ఆశ్చర్యపరుస్తోందని ఎల్‌జీ సంస్థ ప్రెసిడెంట్ సూన్ ప్రశంసాపూర్వకంగా అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read