జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు తమకి ఏం న్యాయం చేస్తారని అడిగితే, మన ప్లేట్లో మనమే బిర్యానీ వడ్డించుకుని తిందాం అని నిర్భయంగా చెప్పారు. జగన్ అన్నట్టే సీఎం అయ్యాక ఏపీలో వనరులు, ప్రజాధనాన్ని బిర్యానీ తిన్నట్టు తినేస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక, తాను నెలకి రూపాయి జీతం తీసుకుంటానని ప్రకటించారు. కానీ ప్రజాధనం మాత్రం అడ్డంగా రోజుకి కోట్లు దోచుకుంటున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తాగే హిమాలయ వాటర్ లీటర్ రూ.60 పై ఏడ్చిన జగన్ రెడ్డి తాగే ఆవ ఆల్కలైన్ వాటర్ అక్షరాల రూ.1,012. జగన్ రెడ్డి వేసుకునే చెప్పుల ఖరీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెత్తందార్లతో తనలాంటి పేదవాడు యుద్ధం చేస్తున్నాడని జనం ముందు చెబుతున్న జగన్ వేసుకునే చెప్పులు బెర్లూటీ అక్షరాలా 1,34,000. జగన్ రెడ్డి తాగే నీరు, వేసే చెప్పులు, వాడే డ్రెస్సులు లక్షల్లో ఉంటే తాను పేదవాడినని కలర్ ఇవ్వడం పెద్ద జోక్ అంటున్నాయి విపక్షాలు. వందల ఎకరాల్లో ఆరుకి పైగా ప్యాలెస్లు ఉన్న జగన్, ఒక్క సీబీఐ చార్జిషీట్ల ప్రకారం 42 వేల కోట్లు దోచేసిన జగన్ రెడ్డి పేదవాడంటే వైసీపీ వాళ్లే నవ్వుతున్నారు.
news
కర్ణాటక ఫలితాలు రాగానే, అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సిబిఐ...
అందరూ అనుకున్నదే జరిగింది. కర్ణాటక ఎన్నికలు అయ్యేవరకూ సీబీఐ వివేకా హత్యకేసులో అడుగులు ముందుకు వేయదని అనుకున్నదే జరిగింది. కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. బీజేపీ దారుణ పరాజయం చూసింది. కోట్ల మూటలతోని, దొంగ ఓట్లతోని బీజేపీ తరపున వెళ్లిన వైకాపా కీలక మంత్రి పెద్దిరెడ్డి పోల్ మేనేజ్మెంట్ వికటించింది. కమలనాథుల కర్ణాటక అవసరం తీరిపోయింది. మళ్లీ సీబీఐ జూలు విదుల్చుతోంది. వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు జారీ చేయడంతో వైకాపాలో గందరగోళ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో రేపు సీబీఐ విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులలో పేర్కొంది. ఇప్పటికే నాలుగుసార్లు సీబీఐ విచారణకి హాజరైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడంతో రకరకాల అనుమానాలు వెల్లువెత్తాయి. వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి అని సీబీఐ పేర్కొంది. తండ్రిని అరెస్టు చేసి కొడుకుని వదిలేయడంతో సీబీఐపైనా, కేంద్రంలోని అదృశ్యశక్తిపైనా అనుమానాలు వచ్చాయి. అంతా అనుకున్నట్టే కర్ణాటక ఎన్నికల అవసరం అయిపోవడంతో ఇక బీజేపీ సీబీఐ తన పని తాను చేసుకోవచ్చనే ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చని, రేపు అవినాష్ రెడ్డి అరెస్టు తప్పకపోవచ్చని తెలుస్తోంది.
చంద్రబాబు ఆ ముగ్గురునీ రంగంలోకి దింపాడు.. ఇక సినిమా మాములుగా ఉండదు..
అంతా తానై..అన్నీ తానై రాజకీయాలు నడిపించే చంద్రబాబు వ్యూహం మార్చేశారు. పరిస్థితులు అనుకూలించి మంచి నాయకత్వం అందుబాటులోకి రావడంతో బాబు రిలాక్స్‌డ్ పాలిటిక్స్ చేస్తున్నారు. యువగళం పాదయాత్రతో నారా లోకేష్ కేడర్ లీడర్లలో మంచి క్రేజ్ ఏర్పడింది. టిడిపి కొద్దిగా బలహీనంగా ఉన్న చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఇంపాక్ట్ బాగా పడింది. పెద్దిరెడ్డి ఇలాఖాలోనూ టిడిపి యువనేత తొడగొట్టి సవాల్ విసిరి టిడిపిలో నవ్యోత్తేజం నింపారు. చంద్రబాబు రాజకీయాలకి పరిమితమైతే లోకేష్ క్షేత్రస్థాయిలో చుట్టేసి వస్తున్నారు. ఇక ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకి ఎవరు అధ్యక్షులైనా, వారి పాత్ర నామమాత్రమేనని, ఆ పార్టీ అధినేతదే అంతా అనే పద్ధతి మారిపోయింది. కింజరాపు అచ్చెన్నాయుడు దూకుడు, చొరవని నియోజకవర్గ విభేదాలు సరిదిద్దేందుకు, ఐక్యత సాధించేందుకు, కేడర్‌కి అండగా నిలిచేందుకు వాడుతున్నారు. టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండే బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో టిడిపిలో చాలా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ టిడిపి కార్యక్రమాలకి హాజరవుతూ తెలుగుదేశంలో జోష్ నింపుతున్నారు. చంద్రబాబుకి లోకేష్, అచ్చెన్న, బాలయ్య రూపంలో మంచి కమిట్మెంట్, చరిష్మా, దూకుడు ఉన్న నేతలు అదనపు బలంగా సమకూరారు. దీంతో కొన్ని కార్యక్రమాలని ఈ ముగ్గురికి అప్పగించి రాజకీయ వ్యూహాలు, పార్టీ ఎత్తులు, ఎన్నికల ప్రణాళికలో నిమగ్నమయ్యారు చంద్రబాబు.
ఊరిలో అన్న.. జగన్ కొత్త కార్యక్రమం..
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రకరకాల పేర్లతో ప్రజల దగ్గరకి వచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇటీవలే గడప గడపకీ మన ప్రభుత్వం, జగనన్నే మా నమ్మకం, జగనే మా భవిష్యత్తు, జగనన్నకి చెబుదాం కార్యక్రమాలను భారీ ప్రచారంతో లాంఛ్ చేసింది వైకాపా. అయితే ఈ ప్రోగ్రాంలన్నీ సక్సెస్ అయ్యాయని చంకలు గుద్దుకుంటూ గణాంకాలు విడుదల చేసిన వైకాపా మరో కొత్త ప్రోగ్రాంతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ కొత్త క్యాంపెయిన్ పేరు ``ఊరిలో అన్న`` అని అనుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఊరిని ఎంపిక చేసుకుని ఆ ఊరు హెలికాప్టర్‌లో ఉదయం చేరుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలతో ఆ ఊరిలోనే ఉండేలా ప్రోగ్రాంని ప్లాన్ చేస్తున్నారు. తరచూ వెళ్లే నియోజకవర్గాలు కాకుండా, సీఎం అయ్యాక జగన్ వెళ్లని నియోజకవర్గాలని కవర్ చేసేలా ఈ కార్యక్రమాన్ని ఐప్యాక్ డిజైన్ చేసింది. ఇది కార్యరూపం దాల్చుతుందో లేదోననే ఆందోళన పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే ఊరిలో అన్న పేరుని విపక్షాలు ట్రోలింగ్ వాడుకునే అవకాశం ఉందని కొందరు డౌట్ పడుతున్నారు.