ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రకరకాల పేర్లతో ప్రజల దగ్గరకి వచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇటీవలే గడప గడపకీ మన ప్రభుత్వం, జగనన్నే మా నమ్మకం, జగనే మా భవిష్యత్తు, జగనన్నకి చెబుదాం కార్యక్రమాలను భారీ ప్రచారంతో లాంఛ్ చేసింది వైకాపా. అయితే ఈ ప్రోగ్రాంలన్నీ సక్సెస్ అయ్యాయని చంకలు గుద్దుకుంటూ గణాంకాలు విడుదల చేసిన వైకాపా మరో కొత్త ప్రోగ్రాంతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ కొత్త క్యాంపెయిన్ పేరు ``ఊరిలో అన్న`` అని అనుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఊరిని ఎంపిక చేసుకుని ఆ ఊరు హెలికాప్టర్లో ఉదయం చేరుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలతో ఆ ఊరిలోనే ఉండేలా ప్రోగ్రాంని ప్లాన్ చేస్తున్నారు. తరచూ వెళ్లే నియోజకవర్గాలు కాకుండా, సీఎం అయ్యాక జగన్ వెళ్లని నియోజకవర్గాలని కవర్ చేసేలా ఈ కార్యక్రమాన్ని ఐప్యాక్ డిజైన్ చేసింది. ఇది కార్యరూపం దాల్చుతుందో లేదోననే ఆందోళన పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే ఊరిలో అన్న పేరుని విపక్షాలు ట్రోలింగ్ వాడుకునే అవకాశం ఉందని కొందరు డౌట్ పడుతున్నారు.
ఊరిలో అన్న.. జగన్ కొత్త కార్యక్రమం..
Advertisements