తన పాదయాత్ర సక్సెస్ అవ్వాలి అని, దాని కోసం మీరంతా కృషి చెయ్యాలి అని, నా పాదయాత్ర తప్ప మీ పేపర్ లో, టీవీలో ఇంకా ఏ రకమైన న్యూస్ రాకూడదు అని, జగన్ నిన్న మీడియా, పత్రికా అధిపతులకి పిలుపు ఇచ్చారు... పాదయాత్ర ఆశీర్వాదం కోసం, మీడియా, పత్రికా అధిపతులను లోటస్ పాండ్ కి ఆహ్వానించారు జగన్... అంతకు ముందు రోజే ఈనాడు అధిపతి రామోజీ రావుని కలిసి, 40 నిమషాల పాటు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.. మరి ఏమైందో కాని, రామోజీ అంతటి శత్రువు అయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం పిలుపు రాలేదు... ఆంధ్రజ్యోతి, ఏబిన్ తప్ప, మిగతా అన్ని చానల్స్, పత్రికల అధిపతులను జగన్ తన ప్యాలస్ కు ఆహ్వానించారు...
నిన్న ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ లోటస్ పాండ్ లో జరిగింది... అందరినీ మీటింగ్ హాల్ కి కాకుండా, నేరుగా లోటస్ పాండ్ లోని డైనింగ్ హాల్ కి తీసుకువెళ్ళారు జగన్... దీంతో, ఆ ఇంటీరియర్ అంతా చూసి, మూర్చ పోయినంత పని అయింది ఆ మీడియా అధిపతులకి... నిజానికి ఈ మీడియా ప్రతినిధులు ఆషామాహీ వారు కాదు... బాగా సంపాదించారు కూడా... అయినా, జగన్ లోటస్ పాండ్ చూసి, వారికి దిమ్మ తిరిగింది అంటే, ఇక ఏ రేంజ్ లో మనోడు, ఇంటీరియర్ పెట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు... చంద్రబాబు దుబాయ్ లో రాజ వంశీకులాని కలిసిన వీడియో చూసాం అని, ఆ రాజ వంశీయులకు కూడా, జగన్ లోటస్ పాండ్ కి ఉన్న ఇంటీరియర్ లేదు అని, ఆశ్చర్యపోయారు... ఇవన్నీ జగన్, ఏ దేశం నుంచి తీసుకువచ్చారో అని గుసగుసలాడుకున్నారు...
ఈ షాక్ నుంచి తేరుకోక ముందే, జగన్ ఇంకో షాక్ ఇచ్చారు... సమయం 11 దాటింది, అందునా డైనింగ్ హాల్ లో కూర్చోబెట్టాడు, మాంచి లంచ్ చేసి వెళ్ళచ్చు అనుకున్నారు అంతా... తీరా చుస్తే, బ్రిటానియా బిస్కట్ లు పెట్టి, టీ ఇచ్చి పంపారు అంట జగన్... కనీసం ఏదైనా గిఫ్ట్ ప్యాక్ వస్తుంది అనుకున్న వారు కూడా, అసంతృప్తితో బయటకు వచ్చారు... కేవలం ఆయన చెప్పాల్సింది చెప్పి, కనీసం మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అని, అన్నారు మీడియా ప్రతినిధులు... మీరు మీడియా కవరేజ్ లో నాకు అధిక ప్రాధ్యాన్యత ఇవ్వండి, ఫార్మాలిటీస్ సాయన్న మాట్లాడతారు అని చెప్పి, జగన్ వెళ్ళిపోయారు అని సమాచారం..