దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన దేశంలోనే అతిపెద్ద పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలకు, నిబద్ధతకు, చిత్తశుద్ధికి ఈ ప్రాజెక్టు నిర్మాణ వేగం అద్దం పడుతుంది. అయితే పోలవరం కంట్రాక్టర్ విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు... పోలవరం కంట్రాక్టర్ ని మార్చేది లేదు అని కేంద్రం చెప్పింది.. వెంటనే చంద్ర బాబు గడ్కారి కి కాల్ చేసి నాగపూర్ వచ్చి కలుస్తాను అని అడిగారు... వైజాగ్ నుంచి ఢిల్లీ వేల్లి అక్కడి నుంచి అమెరికా వేల్లల్సిన చంద్రబా బు, నాగపూర్ వెళ్లి గడ్కారి తో మాట్లాడి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి అమెరికా బయలుదేరాల్సిన పరిస్థితి.
చంద్రబాబుకి పోలవరం మీద ఉన్న కమిట్మెంట్ ఇది. 10 రోజులు విదేశీ పర్యటనలో ఉంటే, పోలవరంలో పనులు ఆగిపోతాయని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, 4 ప్రత్యామ్నాయాలను సూచించారు. ఈ నెల 24 వరకూ తాను నాగ్‌పూర్‌లోనే ఉంటానని, 25న దిల్లీ వెళ్తానని, అదే రోజు ఈ పోలవరం అంశం పై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చంద్రబాబుకి హామీ ఇచ్చారు.. 2019 లోగా ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయడమే మా లక్ష్యం... "మేమైతే కాంట్రాక్టర్ ను మారిస్తే పనులు జోరు పెరుగుతుంది అని చెప్తున్నాం.. కాదు అంటే, ప్రాజెక్టు వ్యయానికి సంబంధించిన అంచనాలను పెంచి సబ్ కాంట్రాక్టర్ లు అందరికీ నేరుగా ఎస్క్రో ఖాతాలు ఏర్పాటు చేసి వారికే ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరపడం" అని ముఖ్యమంత్రి గడ్కరీకి సూచించారు...
చంద్రబాబుకి హామీ ఇచ్చిన మేరకు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు గడ్కరీ. సోమ, మంగళవారాల్లో పోలవరం పనులను మసూద్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ సభ్యులు కూడా బుధవారం సమావేశానికి హాజరవుతున్నారు. మరి కేంద్రం చంద్రబాబు ఇచ్చిన సూచనలకు తగ్గట్టు సహకరిస్తుందా, ఎమన్నా ఇబ్బందులు పెడుతుందా అనేది చూడాలి...