ఏపీలో సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చయి. ఇక దీన్ని పట్టుకుని బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు.. చూసారా, మీ చంద్రబాబు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా, మేము మీకు ఎంత చేస్తున్నామో, మా మోడీకి మీరు అంటే అంత ఇష్టం అంటూ ఊదరగొడుతున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, అనంతపురం జిల్లా జంతలూరులో యూనివర్శిటీని నెలకొల్పేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ.902 కోట్ల వ్యయంతో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించనుందని, ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు..

bjp 16052018 2

యూనివర్శిటీకి సంబంధించి పూర్తి స్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో యూనివర్శిటీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదల చేసే ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. అయితే, ఈ వార్తా పట్టుకుని, బీజేపీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు... అయితే, దీని వెనుక ఉన్న వాస్తవం చూద్దాం.. ఇదేదో, బీజేపీ, మోడీ మన మీద ప్రేమతో ఇచ్చేది కాదు. ఇది రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో పలు కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయం ఉంది. ఇందులో భాగంగానే సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కూడా ఉంది.

bjp 16052018 3

దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా జంతలూరులో, 2015లోనే భూమి కేటాయించింది. దీని కోసం 1100 కోట్లు విలువ చేసే, 491.23 ఎకరాలు భూమి అప్పట్లోనే ఇచ్చింది. అంతే కాదు, ఈ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కేటాయించింది.. కేంద్రం ముందుగా చెయ్యల్సింది, సెంట్రల్ యూనివర్సిటీ చట్టానికి సవరణలు. అప్పుడు కాని, యూనివర్సిటీ పెట్టటం కుదరదు. ఈ చిన్న పని, 4 ఏళ్ళు అయినా చెయ్యలేదు.. ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ లో కేసు, ప్రజల ఆందోళన చూసి, కనీసం ఆ బిల్ అయినా పెట్టి, పనులు మొదలు పెట్టాలని చూస్తుంది. దీని కోసం, ఎదో చేసేసినట్టు, మనకి ఎదో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు హడావిడి చేస్తున్నారు. వీళ్ళు ఆ చట్టంలో సవరణ తెచ్చి, ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలకు ఇస్తున్నట్టు డబ్బులి ఇస్తూ పొతే, ఇది కూడా మరో 50ఏళ్ళు పడుతుంది... దీనికి ఎదో చేసేసినట్టు బిల్డ్ అప్ ఇస్తారేంటి ?

మొన్న అమిత్ షా పై నిరసన తెలిపితే, చించుకున్న బీజేపీ నేతలు, ఈ రోజు మన హక్కులు అడుగుతున్నందుకు, హీరో శివాజీ పై దాడి చేసారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీకి రాజీనామా చేసి, వైసిపీలో చేరిన, కన్నా లక్ష్మీనారాయణ విజయవాడకు చేరుకోనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్దకు బీజేపీ శ్రేణులు వచ్చాయి. ఇదే టైంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వద్దకు వచ్చిన శివాజీని చూసి ఆయనకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. శివాజీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.

sivaji 16052018 2

ఈ నేపథ్యంలో మోదీపై విమర్శలు చేస్తావా? అమిత్ షా ను విమర్శలు చేస్తావా ? మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటూ కొందరు భాజపా కార్యకర్తలు ఆయనపై దుర్భాషలాడుతూ అడ్డుకున్నారు. ఆయన కారును అడ్డుకొనే ప్రయత్నం చేశారు. శివాజీ కూడా కార్ కిందకు దిగి, అదే స్థాయిలో వారి పై తిరగబడ్డారు... నేను రాష్ట్రం ప్రయోజనాల కోసం అడుగుతున్నాని, అడుగుతూనే ఉంటానని, మీలాంటి ఉడత ఊపులకు భయపడను అంటూ శివాజీ కూడా వారికి సమాధానం చెప్పారు..

sivaji 16052018 3

నిన్ను చంపుతాం, ఇక్కడే పాతేస్తాం అంటూ, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళలేవు అంటూ, కొంత మంది కార్యకర్తలు శివాజీ పై దాడి చేసారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నటుడు శివాజీకి రక్షక కవచంగా నిలిచారు. అనంతరం ఆయనను కారులో పంపించేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే మొన్న అమిత్ షా పై కొంత మంది నిరసన తెలిపితే, మెము ఎంతో శాంత మూర్తులం అని బిల్డ్ అప్ ఇచ్చిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఏమి చెప్తారో మరి... అయినా, శివాజీ ఒక్కడే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రులు అడుగుతున్నారు... మోడీని నిలదీస్తున్నారు.. అందరినీ కొడతారా ?

ఎవడాడు ?? మధ్య కర్ణాటకలో, ముంబై కర్ణాటక లో, కోస్తా కర్ణాటకలో పూర్తి ఆధిక్యంలో ఉన్న బీజేపీ ని బెంగళూరు లో ఉచ్చపోయించిది ఎవడు? హైద్రాబాద్ కర్ణాటకలో బీజేపీ ని మూడో స్థానానికి నెట్టింది ఎవడు ? కేవలం మైసూర్ కర్ణాటకలో మాత్రమే గట్టిగా ఉన్న JDS ను, హైద్రాబాద్ కర్ణాటక లో గౌరవప్రద స్థానాలు రావటానికి కారణం ఎవడు? సిరిగుప్ప లో గెలిచిన బీజేపీ, పక్కనే ఉన్న సిందనురు లో, పురంధరేశ్వరి తిరిగినా, 3 వ స్థానానికి పడిపోవటానికి కారణం ఎవడు? 16 మంది కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఒకచోట ఓడిపోగా, మంత్రి కృష్ణ బైరేగౌడ 600+ మెజారిటీ తో బయటపడటానికి కారణం ఎవరు? బీజేపీ మాజీ డిప్యూటీ CM - R Ashok, మాజీ మంత్రి అరవింద లింబావళి, బెంగళూర్ సౌత్ రమేష్ గెలవటానికి నానా కష్టాలు పడటానికి కారణం ఎవరు ??

karanataka 16052018 2

బెంగళూరు లో 3 పార్లమెంట్ స్థానాలు, అత్యధిక కార్పొరేషన్ వార్డు లు గెలిచిన బీజేపీ, వెనుకబడతానికి కారణం ఎవరు?? రాయచూరు సిటీ లో గెలిచిన బీజేపీ, రాయచూరు రూరల్ లో ఓడిపోవడానికి కారణం ఎవరు? బళ్లారి జిల్లాలో గాలి కుటుంభం తప్ప మిగతా బీజేపీ వారు ఓడిపోవడానికి కారణం ఎవరు? బాగేపల్లి లో సాయికుమార్ 4 వ స్థానానికి పోవటానికి కారణం ఎవరు? కోలార్ జిల్లాలో బీజేపీ సున్నా చుట్టటానికి కారణం ఎవరు? ప్రత్యేకహోదా కు మద్దతు ఇస్తాము అని చెప్పటానికి ఆంధ్రా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్నీ బెంగళూరు వచ్చేలా చేసింది ఎవడు??

karanataka 16052018 3

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ CwC తీర్మానం చెయ్యటానికి కారణం ఎవరు? సిద్ధరామయ్య తెలుగువారికి open Letter రాయటానికి కారణం ఎవరు?? బెంగళూరులో మహా Tv డిబేట్ అంటే మీరు ఉలిక్కిపడతానికి కారణం ఎవరు? APNGO నాయకులు బెంగళూరులో ఒక సమావేశానికి వస్తే మీకు వెన్నులో వణుకు పుట్టటానికి కారణం ఎవరు?? ప్రధాని 22 చోట్ల ర్యాలీలు, నెలకు పైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మకాం, 15 మంది కేంద్రమంత్రులు నెల రోజుల ప్రచారం, ఆంధ్రా తెలంగాణ బీజేపీ నాయకుల ప్రచారం, 50,000 మంది RSS కార్యకర్తల ప్రచారం, 2 సంవత్సరాల నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు బెంగళూరు లో మకాం, అన్ని తెలుగు సంఘాలతో సమావేశాలు, పురంధరేశ్వరి 2 నెలల ప్రచారం, అమెచే కమ్మ వారితో ప్రత్యేక సమావేశాలు..

ఇన్ని చేసినా, బీజేపీ ని గెలుపు ముంగిట బోర్లా పడేలా చేసింది ఎవడు? రాజ్ భవన్ చుట్టూ తిరిగేలా చేసింది ఎవడు? నిత్యం మీ చేత చంద్రబాబు నామస్మరణ చేపించింది ఎవడు?? తెలుగోడు ???? ఆంధ్రోడు ???????? కర్ణాటకాంద్రుడు ????????????

12 ఓట్లతో గెలిచాను, ఇక నియోజకవర్గ సమస్యలు ఎందుకు అనుకున్నాడో ఏమో, పనీ పాట ఏమి లేనట్టు, ఎక్కడ లిటిగేషన్ ఉంటే, అది పట్టుకుని కేసులు వేసి, ఎప్పుడూ కోర్ట్ ల చేత మొట్టికాయలు తింటా ఉంటాడు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మల్యే, జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి... అమరావతి మీద ఎన్ని కేసులు వేసాడో చూసాం, పేదలకు ఇచ్చే ఫైబర్ నెట్ మీద కేసులు, సాధావర్తి భూముల పై కేసులు వేసి, ప్రభుత్వానికి రూపాయ్ ఆదాయం రాకుండా చేసాడు... అయితే, ఇప్పుడు రివర్స్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పైనే కేసు వేసే పరిస్థితి వచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి భాగోతాలు బయటకు లాగటానికి ఏసీబీ రంగంలోకి దిగింది.

alla 16052018 2

ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బినామీ ఆస్తుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉంది. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరం, అంటే జనవరి 18, 2017లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలు ఒకవైపు, ఏ కేసు నిమిత్తం వెళ్లినా లంచాలు తెమ్మని పీడిస్తారన్న ఫిర్యాదులు మరోవైపు వెల్లువెత్తడంతో, ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గా ప్రసాద్ ఇళ్లపై నేడు ఏసీబీ దాడులు చేసింది.

alla 16052018 3

గుంటూరు, ఒంగోలు, చీరాల, హైదరాబాద్ ప్రాంతాల్లోని ఆయన, ఆయన బంధువుల ఇళ్ల పై ఏకకాలంలో దాడులు చేసారు. ఒక్క గుంటూరులోనే 11 చోట్ల 11 బృందాలు దాడులు చేయగా, భారీ ఎత్తున అక్రమాస్తులు, నగదు బయటపడ్డట్టు తెలుస్తోంది. అయితే , విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్ బాధితులు గుంటూరులో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈయన వల్ల గతంలో ఇబ్బందులు పడినవారు, ఈ విధంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి ఘరానా మోసాగాడిగా పేరు ఉన్న అధికారికి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీ ఆస్తుల కేసులో దొరికాడని, ఏసిబి విచారణకు రమ్మంది. ఇలా అధికారులు, జగన్ పార్టీ ఎమ్మల్యేలు కలిసి, ఇంకా ఎన్ని బినామీ ఆస్థులు సంపాదించారో, ప్రభుత్వమే విచారణ చేసి బయట పెట్టాలి.

Advertisements

Latest Articles

Most Read