మీ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ అని, హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో మీటింగ్ పెట్టి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేసే పని చేసాడు పవన్... ఎప్పటిదో పాత రిపోర్ట్ తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ వన్ గా ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారే లేరు, అంటూ ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మడు... అంతే కాదు, ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడు, లోకేష్ అవినీతి చేస్తున్నాడు అని చెప్పాడు పవన్... ఆధారాలు చెప్పండి అని అడిగితే, నా దగ్గర ఆధారాలు లేవు, ఎవరో చెప్తే విన్నాను, అదే మీకు చెప్తున్నాను అంటూ, గాల్లో ఆరోపణలు చేసి, గుడ్డ కాల్చి మొఖాన వేసాడు.. ఇలా చెప్పటం ద్వారా, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని, ఇండస్ట్రియల్ సర్కిల్ లో చంద్రబాబు ఇమేజ్ ని పాడు చెయ్యవచ్చు అని, బీజేపీ ప్లాన్... కాని, అది జరగలేదు, తరువాత హీరో హోండా వచ్చి శంకుస్థాపన చేసింది, అశోక్ లేల్యాండ్ వచ్చి శంకుస్థాపన చేసింది... ఇది చంద్రబాబు మీద ఉండే నమ్మకం...

pk 18052018 3

తాజగా, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ, అవినీతి పై ఒక రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి, లంచాలు తీసుకోవడంలో దేశంలోనే తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. 13 రాష్ట్రాల్లో మాత్రమే చేసిన సర్వే ఇది.. ఇండియా 2018 అవినీతి అధ్యయన నివేదికను సీఎంఎస్(సెంటర్ ఫర్ మీడియా స్టడీస్) శుక్రవారం విడుదల చేసింది. సీఎంఎస్ సర్వే చైర్మన్ భాస్కర్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఈ ఏడాదిలో 75 శాతం మంది గృహస్థులు అవినీత పెరిగిందని భావిస్తున్నారు. తెలంగాణలో అవినీతి తక్కువ అనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ఎక్కువనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం తక్కువగా ఉంది. అంతేకాదు.. గతంతో పోలిస్తే ఏపీలో అవినీతి తగ్గింది. కానీ ప్రజా సేవలపై పౌరుల క్రియాశీలత తక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు కొన్ని చేస్తున్న ప్రచారం తప్ప ఏపీలో అవినీతి లేదు’’ అని భాస్కర్ రావు తెలిపారు.

pk 18052018 3

ఈ రిపోర్ట్ తో ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం... సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారంతో, ప్రజలు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎంతో నెగటివ్ గా ఫీల్ అవుతున్నారు అని రిపోర్ట్ చెప్పింది... కాని వారి దాకా వచ్చే సరికి, వ్యక్తిగతంగా జరిగిన పనులు గురించి మాత్రం, ఏపి ప్రభుత్వం అద్భుతం అంటున్నారు... గ్రౌండ్ లెవెల్ లో ప్రజలు అందరూ చంద్రబాబు వెంటే ఉన్నారు అనే చెప్తున్న రిపోర్ట్ ఇది... ఈ సర్వే ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో, అవినీతి ఉంది అని అనుకునేవాళ్లు 72%... కాని అవినీతి పేస్ చేసింది మాత్రం 17 % మందే... అదే తెలంగాణాలో, అవినీతి ఉంది అని అనుకునేవాళ్లు 13%... కాని అవినీతి పేస్ చేసింది మాత్రం 73 % మంది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దొంగ ప్రచారం ఇలా ఉంది... రాష్ట్ర ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ మీడియా మ్యనేజేమేంట్ లో ఎలా ఫెయిల్ అయ్యారో ఈ సర్వే చెప్తుంది.. విష ప్రచారం ప్రజలు నమ్మారు, కాని వారి దాకా వస్తే కాని, ఆ విష ప్రచారం తప్పు అని తేలలేదు.. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు, ఇందుకేనేమో తెలంగాణాకి 6 మార్కులు, చంద్రబాబుకు 2.5 మార్కులు వేసింది... ఈ రిపోర్ట్ గురించి, ఇంకా మీకు ఎవరూ చెప్పలేదా పవన్ గారు ? కొంచెం మీ తెలంగాణా రాష్ట్రం గురించి చూసుకోండి, మా ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన సాగుతుంది అని రిపోర్ట్ చెప్తుంది. http://cmsindia.org/cms_ics18/CMS_ICS_2018_Report.pdf

కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు, మోడీ, అమిత్ షా చేస్తున్న నీఛ రాజకీయం, గవర్నర్ ఆడుతున్న నాటకాలు, సుప్రీం కోర్ట్ తీర్పు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు... "గౌరవ సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రోటెం స్పీకర్ ఎన్నికలో గవర్నర్, రాజ్యాంగం చెప్పిన విధంగా పాటించాలని చెప్పారు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు, స్పూర్తి నిలబడాలని చెప్పారు.. "We respect & welcome the verdict of Hon'ble Supreme Court. Governor should have followed the Democratic conventions in appointing protem speaker. We expect that the spirit of Supreme Court judgement will be protected."

cbn tweet 18052018 2

ప్రోటెం స్పీకర్‌‌గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్యను గవర్నర్ నియమించటం వివాదాస్పదం అవ్వటంతో, చంద్రబాబు ట్వీట్ చేసారు. కర్ణాటక విధానసౌధ ప్రోటెం స్పీకర్‌‌గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్య నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆర్‌వీ దేశ్‌పాండేను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే గవర్నర్ వాజూభాయ్ వాలా ఊహించని రీతిలో బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తీరును తప్పుబట్టింది. కర్ణాటక గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ప్రోటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యేను నియమించడం జరుగుతుందని.. ఈ ప్రకారం చూసుకుంటే దేశ్‌పాండే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆయన చెప్పారు.

cbn tweet 18052018 3

ఇది ఇలా ఉండగా, జేడీఎస్‌ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి గురువారం చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. 1984లో తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని చెప్పారు. ‘161 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కర్టాటకలోని నంది హిల్స్‌లో క్యాంప్‌కు వెళ్లాం. అసెంబ్లీలో బల నిరూపణ సమయం వరకూ ఒక్కరు కూడా మా నుంచి విడిపోలేదు. మీరు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి’ అని కుమారస్వామికి సలహా ఇచ్చారు. జేడీఎస్-కాంగ్రెస్‌ కూటమికి మెజారిటీ ఉన్నా తమను కాదని.. ప్రభుత్వ ఏర్పాటుకు అప్రజాస్వామికంగా గవర్నర్‌ బీజేపీకి అవకాశం ఇచ్చారని జేడీఎస్‌ నేత ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గవర్నర్‌ నిర్ణయం అప్రజాస్వామికమని దేశమంతా భావిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.

రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2 వేల కోట్ల విలువ చేసే ‘అమరావతి బాండ్లు’ ఈ నెలాఖరు నాటికి మార్కెట్‌లో విడుదల కానున్నాయి. ఈనెల 22 నాటికి వీటికి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, మరుసటి రోజు ప్రభుత్వ అనుమతులు తీసుకుని నెలాఖరులోగా మార్కెట్‌లోకి తీసుకు రానున్నారు. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ బాండ్లకు సంబంధించిన వివరాలను సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ బాండ్లకు ఎ, ఎ ప్లస్, ఎఎ కేటగిరిల్లో క్రెడిట్ రేటింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అమరావతిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్ల చెల్లింపు అవసరాలకు, ఇతర అభివృద్ధి పనులకు ఈ బాండ్లు అక్కరకొస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు.

amaravati 18052018 2

రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ప్రాథమికంగా రూ.2వేల కోట్ల మేరకు వివిధ బాండ్ల ద్వారా సమీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. ఈ జారీచేస్తున్న బాండ్లతో పాటు ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ‘అమరావతి బాండ్లు’ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాజధాని నిర్మాణం కోసం ఎంతోమంది ముందుకొచ్చి ప్రతి రోజూ తనకు విరాళాలు అందిస్తున్నారని, ఈ నిధుల సేకరణను సక్రమంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరసయ్య అనే వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి నేరుగా తన దగ్గరకు వచ్చి రాజధాని నిర్మాణం కోసం చెక్ ఇచ్చి వెళ్లాడని, మరొకరు తన రెండు నెలల పింఛను అందించారని, ఒక ప్రవాస మహిళ తనకోసం చాలా సేపు వేచి వుండి రూ.10 లక్షలు చెక్ ఇచ్చి వెళ్లారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

amaravati 18052018 3

కొత్త నగరంలో సామాజిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి ఇక్కడ మరో 50 వేల జనాభా అదనంగా పెరుగుతుందని, రాజధానికి కొత్తగా వచ్చే వీరందరి కోసం కనీసం 12 వేల ఆవాసాలు అవసరం పడతాయని భావిస్తున్నామని, ఆమేరకు ప్రభుత్వ గృహ వసతి ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని కమిషనర్ చెప్పారు. అదనంగా వచ్చే జనాభా కోసం హోటళ్లు, మాల్స్, విద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర సదుపాయాలను త్వరతిగతిన సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ-ప్రైవేట్ పద్ధతిలో అతి పెద్ద మాల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అది వీలు కాని పక్షంలో తామే సొంతంగా మాల్ నిర్మాణాన్ని చేపట్టి తరువాత దాని నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని యోచిస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. దీంతో పాటు మధ్య, చిన్న తరహా మాల్స్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై తదితర నగరాలలో ఉన్న కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాల కోసం తగినంత స్థలాన్ని కేటాయించాలని అభ్యర్ధనలు వస్తున్నాయని, దీనికోసం ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకురావాల్సి వుందని కమిషనర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

పరిపాలన నగరంలో చేపట్టనున్న అన్ని ప్రభుత్వ భవంతుల నిర్మాణాలకు సంబంధించి జూన్ 16 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల నిర్మాణం నెలాఖరు నాటికి టెండర్ దశను పూర్తిచేసుకుని పునాదుల స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ముఖ్యుల బంగ్లాల నిర్మాణం పునాదుల దశలో ఉందన్నారు. పునాదుల నిర్మాణంలో అంతర్జాతీయంగా పేరొందిన ‘కెల్లార్’ వంటి సంస్థలను భాగస్వామ్యుల్ని చేయాలని ముఖ్యమంత్రి ఆయనకు చెప్పారు.

6 ఎల్‌పీఎస్ జోన్లలో చేపట్టిన అండర్ గ్రౌండ్ అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని కమిషనర్ చెప్పారు. ఉండవల్లి, పెనుమాక మినహా మిగిలిన అన్ని గ్రామాలలో లే అవుట్ల అభివృద్ధి పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. సీఆర్‌డీఏకు వెలుపల ఉన్న ప్రాంతంలో ప్రధాన రహదారి విస్తరణకు కొన్ని ఇబ్బందులు వున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఉండవల్లి నుంచి తాడేపల్లి వెళ్లే మార్గంలో రహదారి విస్తరణకు ఉన్న ఇబ్బందులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు, 100 కోట్లు కాదు, ఎమ్మల్యేకు 150 కోట్లు.. ఒక్కో ఎమ్మల్యేకు 150 కోట్లు.. ప్రజా స్వామ్య చరిత్రంలో ఒక మైనింగ్ మాఫియా డాన్ చేస్తున్న అరాచకాలు ఇవి.. సహజ సంపద కొల్ల గొట్టిన ఒక దొంగని ప్రధాని స్థాయి వ్యక్తి నెత్తిన ఎక్కించుకుంటే జరిగే పరిణామాలు ఇవి... ఒక్కో ఎమ్మల్యేకు 150 కోట్లు.. వామ్మో వాయ్యో, అనుకుంటం తప్ప, మనం ఏమి చెయ్యలేము.. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలో బీజేపీ బండారం బట్టబయలైంది. శనివారం 4 గంటలకు అసెంబ్లీలో సీఎం యడ్యూరప్పకు విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతలు వల వేస్తున్నారు.

gali 18052019

ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి జనార్దన్‌ రెడ్డి బేరసారాలు జరిపారు. దీనికి సంబంధించి ఆడియో టేప్ లీక్ అవడం కన్నడ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలతో జనార్దన్‌రెడ్డి మాట్లాడిన ఆడియోను కాంగ్రెస్‌నేత ఉగ్రప్ప శుక్రవారం విడుదల చేశారు. ఆడియో టేపులో రాయచూర్‌ రూరల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి బేరమాడారు. యాడ్యూరప్పకు మద్దతిస్తే లైఫ్‌ సెటిల్‌ చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన బసవన్న గౌడ.. ‘‘మీపై నాకు గౌరవం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి నమ్మక ద్రోహం చేయలేను’’ అని బదులిచ్చారు.

gali 18052019

బీజేపీ అధిష్ఠానం సూచనతో మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చే బాధ్యతను బళ్లారి బీజేపీ నేత గాలి జనార్దన రెడ్డి ఆయన సోదరులతో పాటు స్నేహితుడు బి.శ్రీరాములు స్వీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా మెజార్టీకి అవసరమైన కాం గ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల మద్దతును కూడ గట్టాలని వీరిద్దరికీ సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ వాదనను బలపరిచేలా గాలి జనార్దన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సుభాష్‌ ఐకార్‌ రంగంలోకి దిగారు. గౌరిబిదనూరు ఎమ్మెల్యే శివశంకర్‌ రెడ్డిని, పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్పను ఫోన్‌లో సంప్రదించారు. బీజేపీకి సహకరిస్తే మంత్రి పదవితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

Advertisements

Latest Articles

Most Read