కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ వాతావరణ ప్రతికూలత నేపథ్యంలో హిల్సా బేస్‌ క్యాంపు వద్ద చిక్కుకొని తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న తెలుగు యాత్రికుల యోగక్షేమాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ మేరకు అక్కడి పరిస్థితిపై ఏపీ భవన్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌తో మాట్లాడగా.. హిల్సాలో పరిస్థితి గురించి ఆయన సీఎంకు వివరించారు. హిల్సా బేస్‌ క్యాంప్‌ వద్ద 100 మంది తెలుగు యాత్రికులు ఉన్నట్టు వారు తెలిపారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా యాత్రికుల గురించి సీఎం ఆరా తీశారు.

cbn 002072018 2

ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో మాట్లాడని సీఎం అధికారులను ఆదేశించారు. యాత్రికులను హెలికాప్టర్‌లో హిల్సా నుంచి సిమిల్‌కోట్‌కు.. అనంతరం సిమిల్‌కోట్‌ నుంచి ప్రత్యేక విమానంలో నేపాల్‌గంజ్‌కు తరలించాలని సూచించారు. అలాగే, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను కూడా సంప్రదించాలన్నారు. యాత్రికులకు అవసరమైన రవాణా, వైద్య సదుపాయాలను సమకూర్చాలని ఆదేశించారు. తెలుగు యాత్రికులంతా క్షేమంగా స్వస్థలాలకు చేరేలా వారికి తోడ్పాటునందించాలన్నారు.

cbn 002072018 3

మరోవైపు నేపాల్‌ రాయబార కార్యాలయ అధికారులతో ఇప్పటికే ఏపీ భవన్‌ అధికారులు సంప్రదింపులు జరపగా.. వారు స్పందించారు. యాత్రికులతో తమ ప్రతినిధులు సంప్రదింపుల్లో ఉన్నారని వెల్లడించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, ఇతర వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సిమిల్‌కోట్‌లో తమ వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చే మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బందులు వున్నాయని తెలిపారు. వాతావరణం అనుకూలించగానే విమానాలు నడుపుతామని సంస్థలు చెప్పాయని తెలిపారు.

కేంద్ర రోడ్డు రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎప్పుడు జనవరి నెలలో చెప్పారు. నేను ప్రతి నెలా వచ్చి పోలవరం చూస్తాను, కాంట్రాక్టర్ల చేత పనులు పరిగెత్తిస్తాను, కేంద్రం నుంచి డబ్బులు వెంటనే వచ్చే విధంగా చేస్తాను అని. అయితే, ఇప్పటికి ఏడు నెలలు అయ్యింది. అడ్రస్ లేరు. కేంద్రంతో తెలుగుదేశం కటీఫ్ తరువాత, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈ తరుణంలోనే, ఈ నెల 11న గడ్కరీ, పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. సవరించిన అంచనాలు ఫైనల్ అవ్వాల్సిన దశలో, గడ్కరీ పోలవరం సందర్శన, మనకు మంచిది అనే అభిప్రాయం అధికారాల్ ఉంది. ఈ విషయం పై దేవినేని ఉమా మాట్లాడారు. ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణయించిన సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

gadkari 02072018 2

పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 56 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 66వ సారి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఉమామహేశ్వరరావు సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నిర్మాణం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెడ్ వర్క్స్ 42.16 శాతం, డ్యామ్ ప్రధాన ప్యాకేజీ పనులు 40.65 శాతం, తవ్వకం పనులు 75.80 శాతం, కాంక్రీట్ పనులు 28.40 శాతం, రేడియల్ గేట్ల పనులు 61.30 శాతం, వంద శాతం డయాఫ్రామ వాల్ పనులు, జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70 శాతం పూర్తి అయినట్లు వివరించారు.

gadkari 02072018 3

కుడి ప్రధాన కాలువ పనులు 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 61.67 శాతం, అనుసంధాన ప్యాకేజీ పనులు 58.32 శాతం పూర్తి అయినట్లు చెప్పారు. 1396.6 మీటర్ల డయాఫ్రం వాల్ కాంక్రీట్ పనులు పనులు రికార్డు టైమ్ లో పూర్తి చేసినట్లు తెలిపారు. దిగువ కాపర్ డ్యామ్ పనులు వచ్చే సోమవారానికి పూర్తి అవుతాయన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తరువాత రూ.8662 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.6727 కోట్లు రీఇంబర్స్ చేసిందని, ఇంకా రూ.1935 కోట్లు రావలసి ఉందని అన్నారు. జూన్ చివరినాటికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన బిల్లులను పోలవరం డెవలప్ మెంట్ అథారిటీకి పంపినట్లు మంత్రి చెప్పారు.

క‌త్తి మ‌హేష్ అనే పేరు, గ‌త కొన్నాళ్లుగా మన తెలుగు వార్తా చానల్స్ లో ఈ మధ్య విస్తృతంగా వినిపిస్తున్న పేరు. సినీ విమ‌ర్శ‌కుడిగా పేరు ఉన్నా, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను విమ‌ర్శించ‌డం, పవన్ ఫాన్స్ తో వైరమ ద్వారా ఆయ‌న బాగా గుర్తిండి పోయారు. ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌తో ఆయ‌న నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల నోళ్ల‌లోనూ నానుతున్నాడు. న‌టి శ్రీరెడ్డి విష‌యంలో ఆయ‌న అనుకూలం గా వ్యాఖ్యానించి మ‌రింత‌గా ప్రాచుర్యం పొందారు. తాజాగా రాముడి పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇదిలావుంటే, ఒక్క‌సారిగా ఆయ‌న అనూహ్య‌మైన నిర్ణ‌యం వెల్ల‌డించా డు. తాను రాజ‌కీయ అరంగేట్రం చేయాల‌ని అనుకుంటున్న‌ట్టుగా పేర్కొన్నాడు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ప్ర‌జ‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నాన‌ని బాంబు పేల్చాడు.

kathi 02072018 2

వ‌చ్చే ఎన్నిక‌లకు ముందే తాను వైసీపీలో చేర‌తాన‌ని క‌త్తి ప్ర‌క‌టించాడు. దీనికి సంబంధించి ఆయ‌న ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేసిన‌ట్టు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే తాను జ‌గ‌న్‌ను క‌లుస్తాన‌ని చెప్పాడు. అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను చిత్తూరు ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని కోర‌నున్న‌ట్టు తెలిపాడు. అయితే, ఈ వ్యాఖ్యలు కత్తి మహేష్ ఉన్నట్టు ఉండి చేసినవి కావని, ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని టాక్ నడుస్తుంది. అసలు పవన్ ఇష్యూ కూడా, జగనే చేపించాడు అనే పుకార్లు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే కత్తికి వైసీపీ నుంచి చిత్తూరు ఎంపీ టికెట్ దక్కడం అంత తేలిక అయితే కాదు. ఇంతకు ముందు అక్కడ నుంచి పోటీ చేసిన సామాన్య కిరణ్ కుటుంబం కి జగన్ తో మంచి సంబంధాలున్నాయి.

kathi 02072018 3

మరో ట్విస్ట్ ఏంటి అంటే, సామాన్య కిరణ్, కత్తి కూడా మంచి స్నేహితులు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే, కత్తి చేసిన వ్యాఖ్యలు, ఎదో అలా చెప్పినవి కాదు. దీని పై ఇప్పటికే కసరత్తు జరిగిందని, జగన్ ఆశీస్సులతోనే, కత్తి ఇలా ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. సామాజిక వ‌ర్గం రీత్యా క‌త్తి ఎస్సీ కాబ‌ట్టి.. చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న‌కు స‌రైందే. అంతేకాదు, ఇది ఆయ‌న సొంత‌జి ల్లా కూడా! ఈ నేప‌థ్యంలోనే క‌త్తి ఇలా కోరుకోవ‌డం, జగన్ కూడా ఓకే అని ఉంటారాని అంటున్నారు. అయితే, కత్తికి ఆర్ధికంగా ఖర్చు పెట్టే స్థోమత లేదు కాబట్టి, ఆ విషయంలో జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మనోడికి ఎదురు తీసుకోవటమే కాని, తన దగ్గర ఉన్నది ఇవ్వటం అలవాటు లేదు కాబట్టి, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో క్లారిటీ అడిగారని, ఆ విషయంలో క్లారిటీ వచ్చినాకే, కత్తి విషయంలో ఫైనల్ గా జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.

కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాథోర్ ప్రారంభించిన ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దేశ వ్యాప్తంగా స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీలు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొని తాను కసరత్తు చేస్తున్న వీడియోని ట్వీట్ చేశాడు. దీంతో పాటు అతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఛాలెంజ్ చేశాడు. దీన్ని స్వీకరించిన ప్రధాని తాను యోగా చేస్తున్న వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి సంచలన విషయం బయటకొచ్చింది. ప్రధాన మంత్రి చేసిన ఈ యోగా వీడియో కోసం ప్రభుత్వం ఏకంగా రూ.35 లక్షలు ఖర్చు చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.

fitness 02072018 2

అయితే ఈ ఖర్చు కేవలం ఈ వీడియో కోసం మాత్రమేకాదు.. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం చేసిన కొన్ని యానిమేషన్ చిత్రాల కోసం కూడా వెచ్చించినట్లు తెలుస్తోంది. యోగా దినోత్సవం ప్రచారం కోసం నరేంద్ర మోదీ యోగా చేస్తున్నట్లుగా ఓ యానిమేషన్ వీడియోని చిత్రీకరించారు. అయితే దీనికి ముందుగా రూ.40 నుంచి 45 లక్షల వరకూ ఖర్చు జరుగుతుందని భావించినా.. తక్కువ ఖర్చు జరిగే చోట చిత్రీకరించి మొత్తాన్ని తగ్గించినట్లు సమాచారం. ఇది మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం కోసం ఇచ్చిన యాడ్‌లకు ఆయుష్ మినిస్ట్రీ దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఈ కథనం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సోషల్‌మీడియాలో ఈ కథనం ప్రచారం కావడంతో ప్రధానిని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఆ కథనం అవాస్తవమని వాదిస్తున్నారు.

fitness 02072018 3

అయితే ఈ విమర్శల పట్ల సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ స్పందించారు. మోదీ ఫిట్‌నెస్ వీడియోను ప్రధాని కార్యాలయ వీడియోగ్రాఫర్ చిత్రీకరించారని తెలిపిన రాథోడ్.. డబ్బు ఖర్చు పెట్టారని వచ్చిన వార్తలు తప్పుడు కథనాలన్నారు. మోదీ ఫిట్‌నెస్ వీడియోల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మోదీకి ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసరగా.. దానికి స్వీకరించిన మోదీ.. త్వరలోనే ఫిట్‌నెస్ వీడియో షేర్ చేస్తానని తెలిపారు. అందుకు అనుగుణంగానే.. యోగా దినోత్సవానికి వారం రోజుల ముందు ప్రధాని మోదీ తన ఫిట్‌నెస్ వీడియోను ట్వీట్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read