జగన్ మోహన్ రెడ్డి, లోటస్ పాండ్ బ్యాచ్ ని గత నాలుగేళ్ళుగా చూస్తున్నాం.. ఈ లోటస్ పాండ్ బ్యాచ్ కి, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ కూడా తోడయ్యిన తరువాత, సోషల్ మీడియాలో వెళ్ళు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో జుబుక్స కలిగించేలా పోస్టర్ లు వేసి, చివరకు మహిళా ఎమ్మల్యేలను కూడా ఎంతో చండాలంగా చూపించారు. ఇప్పుడు ఈ సైకో బ్యాచ్ కు తోడు, పవన్ కళ్యాణ్ బ్యాచ్ తయారు అయ్యింది. వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు, మొత్తం సోషల్ మీడియాలోనే వీళ్ళ హడావిడి. 90 శాతం హైదరాబాద్ నుంచి, ఈవెంట్ మ్యానేజ్మెంట్ చేసే కంపెనీల చేతిలో సోషల్ మీడియాను పెట్టారు. అయితే, పవన్ కళ్యాణ్ చెప్పే సూక్తులు, ఆదర్శ భావాలు విని, అబ్బో, వీరికి మించిన వారు లేరు అని అనుకునేవారు. కాని, ఈయన అభిమానులు మాత్రం, పరమ చెత్త.. జగన్ బ్యాచ్ కనీసం ఫోటో మార్ఫింగ్ అన్నా చేసేది, ఈ బ్యాచ్ అయితే ఏకంగా విదేశాల నుంచి ఫోటోలు లేపుకొస్తున్నారు...
వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో ఉండే సమస్యలు తీసుకువచ్చి, అవి మన రాష్ట్రంలో ఉండే సమస్యలుగా, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతే కాదు, వాటిని ముఖ్యమంత్రినీ సంబంధిత మంత్రులనూ ట్యాగ్ చేస్తున్నారు. అధికారులు నిజమే అనుకుని, ఆ సమస్య వైపు చేసే లోపు, అవి మన రాష్ట్ర సమస్యలు కాదని, ఎక్కడ నుంచో అవి తీసుకువచ్చి, ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని తెలుసుకుని, ఈ చెత్త రాజకీయం చూసి, అధికారులు కూడా అవాక్కవుతున్నారు. నిజమైన సమస్యలకు స్పందించే వారి, వారి అధికారుల సమయం అంతా ఇలాంటి అసత్య ప్రచారాల కోసం వృధా అవుతుంది. ప్రతి సమస్యనూ చూసి ఆయా ప్రాంతాలకు అధికారులు వెళ్ళడం, అది అసత్యం అని గ్రహించి రిపోర్ట్ చేసి కేస్ మూసివెయ్యడం జరుగుతుంది.
ఒకటో రెండో అయితే పరవాలేదు, ప్రతి రోజు ఎదో ఒకటి ఇలా చేస్తున్నారు. పాలక పక్షంపై బురద జల్లాలన్న యావతో పై తమకు తెలియకుండానే సమాజానికి ఎనలేని హానిని కలిగిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల నిజమైన సమస్య ఉన్నప్పటికీ అధికారులు ఇదీ తప్పుడు కంప్లైంటే అయ్యి ఉంటుందిలే అని తామే ఒక నిర్ధారణకి రావడం మొదలు పెడితే నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి కూడా సకాలంలో వాళ్ళ సమస్యలు తీర్చబడవు. హైదరాబాద్ రోడ్లుని, విజయవాడ రోడ్లు గా చూపిస్తారు, కేసిఆర్ పర్యటన కోసం పిల్లలను రోడ్ పై కూర్చోబెడితే, చంద్రబాబు చేసారని చెప్తారు. ఇండోనేషియాని, ఆంధ్రా చేస్తారు, ఒక ఉత్తరాది రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర గా చూపిస్తారు. నిజమైన సమస్యలు ఏమి దొరక్క, ఇలా చేస్తున్నారా, లేక చంద్రబాబుని ఎదుర్కోవటానికి, ఇలా ఫేక్ ప్రచారం తప్ప, ఏమి చేయ్యలమని డిసైడ్ అయ్యారా ?