డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు, పధకాలు ఇస్తే ఓట్లు వేస్తారు అనేది తప్పు అని తెలంగాణ ప్రజలు హుజురాబాద్ ఎన్నికల్లో తేల్చి చెప్పారు. పది వేల డబ్బు పంచారు, పది లక్షల పధకం అయిన దళిత బంధు ప్రవేశ పెట్టారు. అయినా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. అంటే ప్రజలకు తిక్క రేగింది అంటే, డబ్బులు ఇచ్చినా ఓటు వేయరు, ఎన్ని పధకాలు పెట్టినా ఓటు వేయరు అనేది అర్ధం అవుతుంది. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే అన్నట్టు, కేసీఆర్ దళిత బంధు పధకం తెచ్చారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 40 వేల మంది దళితులు ఉండటంతో, దళిత బంధు పధకం తెచ్చారు. ఈ పధకం ఒకటి రెండు కాదు, ఏకంగా పది లక్షల పధకం. 17 వేల మందికి డబ్బులు వేసారని టీఆర్ఎస్ చెప్తుంది కూడా. ఇంకేముంది, పధకాలు పెట్టేశాం, పది లక్షల పధకం అనుకున్నారు. అయినా ప్రజలు ఈ పధకాలలు లొంగ లేదని అర్ధమైంది. ఎలక్షన్ ముందు రోజు డబ్బు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ చూడని విధంగా, ఆరు వేలు, పది వేలు ఇలా డబ్బు పంచారు. అయినా కూడా దాదాపుగా 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే వాళ్ళు ఇచ్చిన పది వేల డబ్బులు ప్రజలకు పట్టలేదు, అలాగే ఉచిత పధకాలు అంటూ, పది లక్షల పధకాలు పెట్టినా, ప్రజలు లొంగలేదు.
ఇప్పుడు ఇదే ఉచిత సలహా కేసీఆర్ నుంచి జగన్ కు వస్తుంది. ప్రస్తుతం ఎన్నికల్లో బెదిరించి, లేకపోతే ప్రతిపక్షం పోటీ లేకుండా చేసి, ఎన్నికల్లో మేమే గెలిచాం అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ ఏమి తక్కువ సంక్షేమం చేయటం లేదు. పైగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు ఇలాంటివి అన్నీ వేగంగా జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మొత్తం రివర్స్ లో జరుగుతుంది. అప్పులు తేవటం, సంక్షేమం అని అరకోర ఖర్చు పెట్టి, మేము సంక్షేమం చేసేస్తున్నాం అంటూ హడావిడి చేస్తున్నారు. ఎక్కడా అభివృద్ధి అనే మాటే లేదు. కనీసం రోడ్డుల మీద గుంటలు కూడా పూడ్చలేని పరిస్థితి. ఇలా మొత్తం గందరగోళంగా ఉంది పరిస్థితి. మరి కేవలం ఉచితాల మీద ఆధారపడి పరిపాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, కేసిఆర్ కు తగిలిన ఉచిత దెబ్బతో అయినా మేల్కొంటారో, లేక అక్కడ ప్రజలు వేరు, ఇక్కడ ప్రజలు వేరు, మా మాటే వింటారు, ఏమైనా చేస్తాం అనే ధీమాతో ఉంటారో చూడాలి.