వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారు. ఇది వైసీపీ తరుచూ చేసే ఎదురు దాడి. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఎదురు దాడి ఇది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తే, అసలు ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి బయట ఉండేవారా అని ప్రశ్న వస్తూ ఉంటుంది. అయితే వాస్తవంలో మాత్రం, అన్నీ వైసిపీకి అనుకూలంగా జరుగుతూ ఉంటారు. అలా అని వైసీపీ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తుందని ఎవరూ అనరు కానీ, కొన్ని రకాల ఫిర్యాదులు అయితే వెళ్ళాల్సిన వాళ్లకు వెళ్తున్నాయి. తాజాగా ఒక సంఘటన జరిగింది. ఆయన ఒక మంత్రి గారి భర్త. ఐటి కమీషనర్ గా విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇన్కమ్ టాక్స్. ఇది ఎంత కీలకమైన డిపార్టుమెంటు అనేది అందరికీ తెలిసిందే. ఆయన వచ్చారని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. ఇప్పుడు ఇదే వారి పాలిట శాపం అయ్యింది. చివరకు ఇది హోంమంత్రి దాకా ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి భర్త ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటులో పని చేస్తున్నారు. ఆయన గతంలో ముంబై, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పని చేస్తూ ఉండేవారు.

mekathoti 02112021 2

అయితే ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన ఐటి కమీషనర్ గా విజయవాడ వచ్చారు. ఆయన వచ్చారని తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి వచ్చారు. అయితే ఈ నియామకం వెనుక కుట్ర ఉందని,ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయటానికి, మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టటానికి, ఈ నియామకాలు అంటూ, విమర్శలు వచ్చాయి. దీని పైన, బీజేపీ ఎంపీ ఒకరు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. ఈ నియామకం సర్వీస్ రూల్స్ కు విరుద్ధం అని, వెంటనే ఈ నియామకాన్ని వెనక్కు తేవాలని లేఖలో తెలిపారు. ఇక ఇదే ఎంపీ మరో ఫిర్యాదు కూడా చేసారు. సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ లో, జగన్ తరుపున కేసులు వాదించే సుభాష్ అనే న్యాయవాదిని నియమించారని, నిందితులు వెంట ఉండే వారికి, సిబిఐలో పదవులు ఎలా ఇస్తారాని, ఇది నైతికంగా తప్పుడు సంకేతాలు వెళ్తుందని, ఈ నియామకం కూడా రద్దు చేయాలి అంటూ, ఆ ఎంపీ అమిత్ షాకు లేఖ రాసారు.

మన రాష్ట్రంలో వ్యవస్థలును లెక్క చేయకపోవటం, రాజ్యాంగ వ్యవస్థలను కూడా హేళన చేయటం, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి బాగా అలవాటు. ఎలక్షన్ కమిషన్ అయినా లెక్క ఉండదు, శాసనమండలి చైర్మన్ అయినా లెక్క ఉండదు, మీడియా అయినా లెక్క ఉండదు, న్యాయమూర్తులు అయినా లెక్క ఉండదు, న్యాయస్థానాలు అయినా లెక్క ఉండదు. చివరకు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాను కూడా కుళ్ళు రాజకీయాల్లోకి లాగుతారు. చేసేవి చట్టవిరుద్ధమైన పనులు. అవి మాత్రం కోర్టులు కొట్టివేస్తే మాత్రం, న్యాయమూర్తులను దూషిస్తారు. ఇలాగే ఏడాది క్రితం, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని పిచ్చోడిని చేసి, అతని పై ప్రవర్తించిన తీరుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబిఐ ఎంక్వయిరీ ఆదేశించింది. అయితే దీని పై వైసీపీ నేతలు, క్యాడర్ మొత్తం కోర్టులను దూషించారు. దీంతో చరిత్రలో మొదటి సారి, హైకోర్టు బాధితులుగా కేసు నమోదు చేసి, ఈ కేసు కూడా సిబిఐకి ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే గత వారం రోజులుగా సిబిఐ తీరు పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సిబిఐ తీరు అనుమానాలను తావు ఇస్తుందని,నిందితులను రక్షించే విధంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యనించింది. అయితే సిబిఐ మాత్రం నిస్సహాయత వ్యక్తం చేస్తూ, తాము విదేశాల్లో ఉన్న వారిని పట్టుకోలేక పోయాం అని కోర్టుకు తెలిపింది.

punch 02112021 2

నిన్న ఈ కేసు పై మళ్ళీ విచారణ జరిగింది. విచారణ జరిగిన సందర్భంలో ట్విస్ట్ నెలకొంది. పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి అడ్రస్ దొరకటం లేదు అంటూ సిబిఐ కోర్టుకు చెప్పటంత, రిజిస్టార్ తరుపు న్యాయవాది అశ్వనీ కుమార్, నిన్న కోర్టు ముందు పంచ్ ప్రభాకర్ వివరాలు అన్నీ ఉంచారు. పంచ్ ప్రభాకర్ అడ్డ్రెస్ తో పాటుగా,అతని ఫోన్ నెంబర్, అతని ఈమెయిలు ఐడి ఇలా పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచారు. మరి ఇప్పుడైనా సిబిఐ ఈ వివరాలు పట్టుకుని అతన్ని పట్టుకుని వస్తుందో, లేదా మరేదైనా సాకులు చెప్తుందేమో చూడాలి. అలాగే ట్విట్టర్, యూట్యూబ్ లను కూడా ప్రతి వాదులుగా చేర్చాలని కోర్టుకు చెప్పటంతో, కోర్టు కూడా దీనికి అంగీకరించింది. ఇక నిన్న ప్రభుత్వం తరుపు అడ్వొకేట్ జనరల్ మాట్లాడుతూ ఇప్పటికే కోర్టుల పై వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణ కోరుకున్నారని చెప్పగా, కోర్టు స్పందిస్తూ, 2020 మే తర్వాత హైకోర్ట్ పైన ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదా ? దీని పై మీరు చెప్పగలరా అని ప్రశ్నించగా, అటు వైపు నుంచి సరైన సమాధానం రాలేదు.

బూతులు తిట్టేది వాళ్ళు, వ్యవస్థలు నాశనం చేసేది వాళ్ళు, అక్రమ పనులు చేసేది వాళ్ళు, చట్ట విరుద్ధమైన పనులు చేసేది వాళ్ళు, దా-డు-లు చేసేది వాళ్ళు.. కానీ ఎదురు దా-డి చేసేది మాత్రం టిడిపి పైన. రాష్ట్ర రాజకీయాల్లో బూతులును పరిచయం చేసింది వైసిపి. ఏకంగా మంత్రులు కూడా బూతులు లేకుండా ప్రెస్ మీట్ పెట్టరు. అసెంబ్లీలో బూతులు తిడితే, నా మనసు దోచుకున్నావ్ అని ముఖ్యమంత్రి అంటారు. దా-డు-లు చేస్తే నా మీద ప్రేమతో, బీపీ పెరిగి చేసారని అంటారు. డీజీపీ గారు భావ ప్రకటనా స్వేఛ్చ అంటారు. ఇలా వ్యవస్థలు నాశనం అవుతున్నాయని, టిడిపి పోరాడుతుంటే, పట్టాభి బోస్ డీకే అన్నారని, దానికి కొత్త కొత్త అర్ధాలు చెప్పి, అసలు తెలుగుదేశం పార్టీనే రద్దు చేసి పడేయాలని విజయసాయి రెడ్డి నేతృత్వంలోని బృందం, ఎలక్షన్ కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేసింది. పట్టాభి మాట్లాడిన ఒక్క మాటతో, టిడిపి పార్టీనే రద్దు చేయాలని వైసీపీ అంటుంటే, మరి ఇన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వైసిపీని ఏమి చేయాలి ? అందుకే తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. విజయసాయి రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కు వెళ్ళిన రెండు రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ కౌంటర్ స్ట్రాటజీ మొదలు పెట్టింది. విజయసాయి రెడ్డి పాచికకు రెండు రోజుల్లోనే టిడిపి కౌంటర్ ఇచ్చింది.

kesinani 02112021 2

నిన్న ఎంపి కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు కనకమేడల, నిమ్మల కిష్టప్ప కలిసి, ఢిల్లీలో ఎన్నికల కమీషనర్ ని కలిసారు. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారని, తరువాత కేసులు పెట్టటంతోనే, సొంత పార్టీ పెట్టుకుని, షీల్డ్ పొందుతున్నారని, అప్పుడు ప్రతిపక్షంలో కానీ, ఇప్పుడు అధికార పక్షంలో కానీ, ఎప్పుడూ రాజ్యాంగాన్ని అనుసరించి పనులు చేయటం లేదని, వైసీపీ పార్టీని రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్, న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మెన్, మీడియా, ఏపీపీఎస్సీ ఇలా ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని, దళితులూ, మైనారిటీలు, గిరిజనలు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారు, ఇలా అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని ఎలక్షన్ కమిషన్ కు ఆధారాలతో సహా సమర్పించారు. ఇక వైసీపీ చేస్తున్న దా-డు-లుకు సంబంధించి ఆధారాలు కూడా, ఇలాంటి పార్టీ ఈ దేశంలో అవసరం లేదని, రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ ని కోరారు. దాదపుగా 30 నిమిషాలు ఈ భేటీ జరిగింది. వీటి పై ఎఫ్ఐఆర్ నమోదు చేసారా అని ఎన్నికల కమీషనర్ అడగగా, పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని, ఎదురు బాధితుల పైనే కేసులు పెడుతున్నారని తెలిపారు. మీడియాతో మాట్లాడిన కేశినేని నాని, విజయసాయి రెడ్డిని దులిపేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం అనేది గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులు వేసినా, ఉన్నాతధికారులను, డీజీపీని, చీఫ్ సెక్రటరీని, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను కోర్టుకు పిలుస్తున్నా, ప్రభుత్వ వైఖరిలో మార్పు రావటం లేదు. ప్రభుత్వ పెద్దలకు తగ్గట్టు నడుచుకుంటున్నారా, లేక అధికారులే పదే పదే తప్పులు చేస్తున్నారా అనేది తెలియదు కానీ, అధికారులకు మాత్రం కోర్టుల్లో ఇబ్బందులు తప్పటం లేదు. మనం నాలుగు రోజులు క్రిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఫోటో ఒకటి చూసాం. ఆ ఫోటోలో ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్, స్కూల్ లో మరుగుదొడ్లు కడుగుతూ ఉన్న ఫోటో అందరం చూసాం. వస్తున్న ఫిర్యాదులకు విసుగెత్తి, ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో, ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఆ ప్రభుత్వం స్కూల్ టీచర్, స్కూల్ లో ఉన్న మరుగుదొడ్లు కడుగుతూ, తన నిరసనను తెలిపారు. ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు కూడా ఈ ఫోటో పై, ప్రభుత్వ తీరుని ఎండగట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియలేదు కానీ, ఫోటో వైరల్ కావటం, పౌర సమాజం స్పందించటం, అందరూ చూసారు. ఈ విషయం ప్రాముఖంగా పత్రికల్లో కూడా వచ్చింది.

hc teachers 02112021 2

అయితే నిన్న ఒక కేసు విషయంలో హైకోర్టు ఈ విషయం ప్రస్తావించింది. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు చదవు చెప్పే కంటే, ఇతర పనులు చేయటానికి ఉపయోగపడుతున్నారని, ఇది బాధ పడాల్సిన అంశం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు అంటూ, ప్రభుత్వం పై హైకోర్టు మండిపడింది. ఉపాధ్యాయులు చదువు చెప్పటం ఏమో కానీ, మిగతా అన్ని పనులు చేస్తున్నారని, చివరకు వారి చేత మరుగుదొడ్లు కూడా కడిగించే స్థాయికి తీసుకొని వచ్చారని వ్యాఖ్యానించింది. గతంలో మద్యం షాపుల ముందు, మద్యం తాగే వారిని లైన్ లో నుంచో పెట్టటానికి ఉపాధ్యాయులను వాడారని హైకోర్టు గుర్తు చేస్తింది. ఈ మధ్య కాలంలో మధ్యాహ్న భోజనం గురించి కూడా ఉపాధ్యాయులనే చూడమన్నారని, మరగు దొడ్లు నిర్వహణ పై ఫోటోలు తీసి యాప్ లో పెట్టమన్నారని, ఉపాధ్యాయులు చదువు చెప్పటానికి ఉన్నారని, ఇలాంటి పనులకు కదాని, ఇది తీవ్రమైన వ్యవహారం అని, టీచర్లను, చదువు చెప్పటానికే వినియోగించుకోవాలని, మీ ప్రభుత్వానికి చెప్పండి అంటూ హైకోర్టు, అడ్వొకేట్ జనరల్ కు సూచించింది.

Advertisements

Latest Articles

Most Read