నీటిపారుద‌లని నోటి పారుద‌ల‌గా, ఇరిగేష‌న్ శాఖ‌ని ఇరిటేష‌న్ శాఖ‌గా మార్చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఇటీవ‌ల కాలంలో చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నారు. బుల్లెట్టు దిగిందా లేదా అంటూ అసెంబ్లీలో రౌడీభాష‌తో క‌ల‌కలం రేపిన అనిల్ కి అస‌మ్మ‌తి బుల్లెట్టు దిగి చాలా రోజులైనా, నెత్తికెక్కిన అధికారం వ‌ల్ల క‌న‌ప‌డ‌టంలేద‌ని నెల్లూరు వైసీపీ నేత‌లు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి కాక ముందు బాబాయ్ రూప్ కుమార్ యాద‌వ్‌తో క‌లిసే పంచాయ‌తీలు, సెటిల్మెంట్లు, వ్యాపారాలు వెల‌గ‌బెట్టారు అనిల్ కుమార్ యాద‌వ్‌. మంత్రి అయ్యాక బాబాయ్ అబ్బాయ్ మ‌ధ్య గ్యాప్ పెరిగింది. అబ్బాయ్ మంత్రి ప‌ద‌వి ఊడింది. జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల‌తోనూ చెడింది. అండ‌గా ఉండే రెడ్డి సామాజిక‌వ‌ర్గం వారూ అనిల్ అంటేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. బాబాయ్ రూప్ కుమార్ అనిల్‌ అస‌మ్మ‌తి వ‌ర్గానికి ఇష్టుడ‌య్యాడు. నెల్లూరు డిప్యూటీ మేయ‌ర్ అయిన రూప్ కుమార్‌.. అనిల్ సీటుపైనా క‌న్నేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ రెడ్లు కూడా రూప్ కుమార్‌కి మ‌ద్ద‌తుగా తెర‌వెనుక స‌హ‌కారం అందిస్తున్నారు.

అవివాహితుడైన రూప్ కుమార్‌కి అబ్బాయ్ అనిల్ గుట్టుమ‌ట్ల‌న్నీ తెలుసు. దీంతో బాబాయ్ ఎదురు తిరిగినా ఏం చేయ‌లేక మౌనంగా వుంటున్నాడు. నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రూప్ కుమార్ ప‌వ‌ర్ సెంట‌ర్ అయ్యారు. త‌న అనుచ‌రుడైన మైనారిటీ నేత షాపు మెట్ల‌ను కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. దీని వెనుక అనిల్ కుమార్ యాద‌వ్ ఆదేశాలు ప‌నిచేశాయ‌ని రూప్ కుమార్ అనుమానించారు. అయితే 24 గంట‌లలోగానే ఆ షాపు ముందు మెట్లు నిర్మించిన డిప్యూటీ మేయ‌ర్ రూప్ కుమార్ దమ్ముంటే తనను ఆపేవారు ఎవరో రావాలని సవాల్ విసిరారు. ఈ స‌వాల్ అబ్బాయ్ అనిల్‌కేన‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు.

ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుని టిడిపి ప‌లాస ఇన్చార్జి ప‌శువు అంటుంటారు. డాక్ట‌ర్ అయిన ఒక మంత్రిని ఇలా అన‌డ‌మేంటి అని చాలా మంది వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే నీచ‌పు కూత‌లు కూస్తుండ‌డం, ప‌శువు కంటే దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌డంతో ఇలా ప‌శువు అన‌క త‌ప్ప‌డంలేద‌ని గౌతు శిరీష అంటుంటారు. టిడిపి అధినేత చంద్ర‌బాబు కందుకూరు ప‌ర్య‌ట‌న‌లో తొక్కిస‌లాట జ‌రిగి 8 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘటనపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ కందుకూరులో జరిగింది ప్రమాదం కాదు అని, దాని వెనుక కుట్ర ఉందంటారు. నేష‌న‌ల్‌ మీడియాలో హైప్ కోసమే ఈ కుట్ర ప‌న్నార‌ని అవాకులు చెవాకులు పేలారు. పథకం ప్రకారం తొక్కిసలాట జరిపించి 8 మందిని చంపేశారని, చంద్రబాబును విచారించాల‌ని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది చ‌నిపోయి కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ రోదిస్తుంటే, శ‌వ‌రాజ‌కీయాల‌కు తెర‌తీసిన మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుని శిరీష ప‌శువు అన‌డం త‌ప్పులేద‌ని జ‌నాలు అనుకుంటున్నారు. ప్ర‌భుత్వంలో ఉండి కూడా ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌వాడిని ప‌శువు అనే అంటారంటున్నారు టిడిపి నేత‌లు.

నిన్న రాత్రి కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్ లో జరిగిన దారుణమైన ఘటనలో ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తమ కుటుంబ సభ్యులు చనిపోయారని చలించిపోయిన చంద్రబాబు, అప్పటికప్పుడు, ఆ కుటుంబాలని ఆదుకోవటానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. అయితే నిన్న రాత్రి నుంచి చంద్రబాబు కుమిలిపోతూ, ఈ రోజు ఉదయం పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు, బాధితుల్ని మరింతగా ఆదుకోవాలని నిర్ణయం తెసుకున్నామని, పార్టీపరంగా ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షలు చొప్పున సాయం ఇస్తున్నాం అని చెప్పారు. దీంతో పార్టీ నేతలు కూడా తమ వంతు సాయం ప్రకటించారు. కేశినేని నాని, గుడివాడకు చెందిన రాము, శిష్ట్లా, బొబ్బిలి నుంచి బేబి నాయన, ఇలా ఇతర టిడిపి నేతలు అందరూ కూడా సాయం ప్రకటించారు. దీంతో పార్టీ నేతల సాయం మొత్తం రూ. 8 లక్షలకు చేరుకుంది. మొత్తంగా పార్టీ తరుపున రూ.23 లక్షలు సాయం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా పిల్లల చదువు బాధ్యతని కూడా చంద్రబాబు తీసుకున్నారు.

నిన్న ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన  ఘటనలో  బాధిత కుటుంబాలను చంద్రబాబు ఈరోజు  పరామర్శించనున్నారు. కందుకూరులో చనిపోయిన 8 మందికి  ఏరియా హాస్పిటల్ లో  పోస్టుమార్టం పూర్తి అయ్యింది.వీరి మృతదేహాలను వారివారి కుటంబసభ్యులకు అప్పచెప్పారు. డాక్టర్లు పోస్టుమార్టం  చేసేప్పుడు వీడియో మొత్తం రికార్డ్ చేసారు. ఒకరు మీద ఒకరు  పడి ఊపిరాడకే చనిపోయారని వైద్యులు ప్రాధమిక అంచనాలో  తెలిపారు. మృతి చెందిన వారి ఇళ్ళకు చంద్రబాబు స్యయంగా వెళ్లి  నివాళులు అర్పించానున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోగా , మరికొంత మంది గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారి ఎనిమిది మంది ఇళ్లకు వెళ్లి నివాళులర్పించనున్నారు చంద్రబాబు.

Advertisements

Latest Articles

Most Read