వచ్చే నెల జనవరి 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కు మొదటిసారిగా రాజకీయ మీటింగ్ కు రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన’ అనే ప్రోగ్రాం లో అమిత్ షా పాల్గొంటారు. కర్నూలు, హిందూపురం లోక్సభ నియోజకవర్గాల్లో అమిత్ షా పర్యటిస్తారు. అంతే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు అమిత్ షా వెళ్లనున్నారు. బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అంతే కాకుండా ఏపి సియం జగన్ మోహనరెడ్డి పాలనపై కూడా అమిత్ షా మాట్లాడతారని బిజేపీ నేతలు చెబుతున్నారు.
news
మరోసారి బాంబు పేల్చిన ఆనం...
వైసిపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేసారు. నెల్లూరు జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిపై పంచ్ డైలాగ్లు వదిలారు. సంవత్సరం తరువాత వచ్చే ఎలక్షన్స్ కొందరు వైసిపి నేతలు ఇప్పుడే నా సీటుపై కూర్చోవడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు. నేను కుర్చీ ఎప్పుడు ఖాళీ చేస్తానా ?దాన్ని ఎప్పుడు లాగేద్దామా? అని కొందరు కాచుకు కూర్చున్నారని అన్నారు. ఇంకోవైపు వెంకగిరికి తానే ఫ్యూచర్ ఎమ్మెల్యేనంటూ మరోకడు చెబుతున్నాడని, ఈ నియోజక వర్గ ప్రజలు నన్నుఎమ్మెల్యేను చేసారని ఆనం అన్నరు. 2024 వరకు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అంటూ ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
జగన్ నర్సీపట్నం వస్తున్నారని, ఏమి చేస్తున్నారో చూడండి
ఈ రోజు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండటంతో నర్సీపట్నంలో టిడిపి, జనసేన కార్యకర్తలను ముందుగానే పోలీసులు అరెస్ట్ చేసారు. తెలుగుదేశం ఎస్సీ సెల్ కార్యదర్శి కొండ్రు మరిడయ్యను , గవిరెడ్డి వెంకటరమరణను మరియు కౌన్సిలర్లు మధు, రామరాజును జనసేన కన్వీనర్ సూర్యచంద్ర హౌస్ అరెస్ట్ లు చేసారు. అయితే ఈ ముందస్తు అరెస్ట్ లను టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన టిడిపి నాయకులను, జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రిని మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదని, ఆయన చెత్త పాలనపై ఒళ్లు మండి సొంత పార్టీ నేతలే ఆయన్ను నిలదీసే రోజులు వస్తున్నాయని లోకేష్ ఎద్దేవా చేసారు.
ఆ దివ్యాంగుడిని చూసి చలించిపోయిన చంద్రబాబు
నిన్న చంద్రబాబు కందుకూరు మృతుల కుటుంబాలకు వెళ్లి పరామర్శించారు. భాదితుల కుటుంబాలకు 10లక్షల చెక్కును అందచేసారు. అంతే వాళ్ళ పిల్లల చదివించే భాద్యతను కూడా చంద్రబాబు తీసుకున్నారు. అయితే మృతిచెందిన వారిలో పురుషోత్తం ఇంటికి వెళ్ళినప్పుడు దివ్యాంగుడైన అతని మనవడు తిరుపతయ్యను చంద్రబాబు పరామర్శించారు. తిరుపతయ్య గురించి వారి కుటుంబ సభులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ వైసిపి ప్రభుత్వం ఇవ్వడంలేదని కుటుంబ సభ్యులు చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేసారు.