ప్రభుత్వాన్ని ప్రశ్నించి వార్తల్లో నిలిచిన వెంకాయమ్మ పై వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబ సభ్యుల పై వైసీపీ శ్రేణులు దా-డి చేసాయి. వెంకాయమ్మను ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే కొట్టారు. అయితే వెంకాయమ్మ పై పోలీస్ స్టేషన్ లోనే దా-డి చేయటం, అలాగే కొడుకు పైన దా-డి చేయటం తేలినా, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు తాడికొండ పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లారు. అయితే అనూహ్యంగా అక్కడకు వచ్చిన వైసీపీ శ్రేణులు, టిడిపి నేతల పై కూడా దౌర్జన్యానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరగటంతో, పోలీసులు ఇద్దరినీ సముదాయించారు. బాధ్యుల పై కేసులు పెడతాం అని ఎస్పీ హామీ ఇవ్వటంతో, టిడిపి నేతలు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ ఘటన పై తెలుగుదేశం సీరియస్ అయ్యింది. ఈ రోజు చలో కంతేరుకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దళిత సంఘాలు నేతలతో కలిసి, ఈ రోజు కంతేరు వెళ్లి, వెంకాయమ్మని పరామర్శించనున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా టిడిపి పై అటాక్ కూడా ప్లాన్ చేస్తున్నాయి.

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నుంచి గట్టి ఎదురు దా-డి ఎదుర్కుంటుంది. బీజేపీ ఎక్కి దిగుతుంది. ఇన్నాళ్ళు చంద్రబాబు బూచిగా చూపి, రాజకీయం చేసిన కేసీఆర్ కు బీజేపీని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కావటం లేదు. ప్రజల్లో కూడా కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చేసింది. కేసీఆర్ ఏమి చెప్పినా వినే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకుని వచ్చి, కులాల వారీగా విడగొట్టి, గెలవాలి అనే ప్లాన్ లో ఉన్నారు. అందులో భాగంగానే, తెలంగాణాలో గణనీయంగా ఉన్న టిడిపి ఓట్ల పైన కేసీఆర్ కన్ను పడింది. 5% పైన ఓటింగ్ ఉన్న టిడిపిని మంచి చేసుకునే పనిలో టీఆర్ఎస్ పడింది. ఇందు కోసం ఎన్టీఆర్ ను ఉపయోగించుకున్నారు. ఎప్పుడూ లేనిది ఎన్టీఆర్ జయంతి రోజున, టీఆర్ఏ ఎమ్మెల్యేలు, మంత్రులు మామూలు ప్రేమ కురిపించ లేదు. అసలు కేసీఆర్ కూడా జయంతి ఉత్సవాలకు వస్తారని సమాచారం వచ్చినా, ఆయన చివరి నిమిషాలో డ్రాప్ అయ్యారు. ఒక పక్క ఎన్టీఆర్ నామస్మరణ చేస్తూనే, మరో పక్క చంద్రబాబుని కూడా మంచి చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ లో గెలిచినా, టీఆర్ఎస్ లోకి జంప్ కొట్టిన ఎల్బీనగర్  ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. నిజానికి ఈయన జగన్ కు సన్నిహితుడు. అయినా కూడా ఎల్బీనగర్ లో ఉండే ఒక సామాజికవర్గ ఓట్ల కోసం, చంద్రబాబు నామస్మరణ చేస్తూ, చంద్రబాబు వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు తనను గెలిపించారు కాబట్టి, ఎన్టీఆర్ విగ్రహం పెడతానని ప్రకటించారు. టీఆర్ఎస్ లో వస్తున్న ఈ కొత్త ట్రెండ్, ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే అని తెలుస్తుంది. ఏపిలో ఏ కులాన్ని అయితే బూచిగా చూపించారో, తెలంగాణాలో ఆ కులం ఓట్ల కోసం, ఇదే ప్రశాంత్ కిషోర్ పాట్లు పడుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో చెప్పే వివిధ వ్యవస్థలు ఆయన దగ్గర ఉంటాయి. సొంత ఆలోచనలతో కూడా, ఏమి జరుగుతుందో ముఖ్యమంత్రులు అర్ధం చేసుకుంటారు. అయితే జగన్ మోహన్ రెడ్డి సమాచారం ఇచ్చే వారు తేడాగా ఇస్తున్నారో, లేక జగన్ మోహన్ రెడ్డే తేడాగా ఉన్నారో కానీ, ఆయన అయితే రియాలిటీలో లేరు అనే విషయం అర్ధం అవుతుంది. తాను ఇచ్చే పధకాలతో ప్రజలు, సంతోషంతో డ్యాన్స్ వేస్తున్నారు అనే భ్రమలో జగన్ ఉన్నారని అర్ధం అవుతుంది. రెండు రోజుల క్రితం ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో మాదిగ కార్పొరేషన్ గురించి అడగగా, పధకాలు ఇస్తున్నాంగా ఇంకా ఎందుకు అని జగన్ చెప్పటంతో, అందరికీ దిమ్మ తిరిగింది. నిన్న ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో కూడా ఇదే తీరు. ముస్లిం యువతులకు షాదీముబారఖ్ ఇవ్వాలని కొంత మంది ఎమ్మెల్యేలు కోరితే, అమ్మఒడి ఇస్తున్నాం కదా అని అనటంతో, దిమ్మ తిరిగింది. అలాగే అమ్మఒడి పధకానికి కోతలు పెట్టారని చెప్పటంతో, నిబంధనల ప్రకరం ఇస్తాం, అర్హత లేని వారికి ఎలా ఇస్తాం, గతంలో తప్పు చేసాం, ఇప్పుడు దిద్దుకుంటున్నాం అని జగన్ తేల్చి చెప్పారట. రోడ్డులు గురించి అడిగితే డబ్బులు లేవని చెప్పారట. ఇక కరెంటు, ఇసుక గురించి అడిగితే, ఎల్లో మీడియా కధనాలు నమ్మి, నన్ను ప్రశ్నిస్తారా, అసలు కరెంటు ఎక్కడ పోయిందని దబాయించారట. జగన్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారో తెలుసుకుని, ఎమ్మెల్యేలు అవాక్కయ్యారట.

నిన్న తాడేపల్లిలో గడప గడప వర్క్ షాప్ లో, జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. రోజురోజుకీ ప్రభుత్వం పై ప్రజల్లో అసహనం పెరిగిపోతూ ఉండటం, ఎమ్మెల్యేలు అనుకున్నట్టు ప్రజల్లోకి వెళ్లకపోవటంతో, జగన్ మోహన్ రెడ్డి అసహనంతో ఊగిపోయారు. కొంత మంది ఎమ్మెల్యే సమస్యలు చెప్తున్నా, చేయని వాటి గురించి ఎందుకు, చేసిన వాటిని ప్రజల్లోకి ఎందుకు తీసుకుని వెళ్ళలేక పోతున్నారని ఎదురు ప్రశ్నించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గురించి ఐప్యాక్ టీం ప్రజంటేషన్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు ఎలా పని చేస్తున్నారు అనే విషయం పై, వారు అందరి ముందు చూపించారు. అయితే ఈ ప్రజంటేషన్ తరువాత జగన్ అందుకున్నారు.  ఇప్పటి వరకు ఏడుగురు ఈ కార్యక్రమం ఇంకా మొదలు పెట్టలేదని, వారికి నో టికెట్ అని చెప్పారు. ఆ లిస్టు లో బొత్స, ఆళ్లనాని, చక్రపాణిరెడ్డి, నల్లపురెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‍కుమార్ రెడ్డి, అనిల్‍కుమార్, వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. అయతే వారు కారణాలు చెప్పే ప్రయత్నం చేయగా, జగన్ పట్టించుకోలేదు. మిగతా వారికి వార్నింగ్ ఇస్తున్నా అని, నెల రోజుల్లో మార్పు కనిపించాలని అన్నారు. కొంత మంది కేవలం తూతూమంత్రంగా ప్రజల ముందుకు వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేసారు.  ప్రజల్లోనే ఉండాలని, దాని బట్టే టికెట్లు ఉంటాయని అన్నారు. అయితే పులివెందుల సంగతి ఏమిటి అంటూ, కొంత మంది ఎమ్మెల్యేలు సటైర్ లు వేస్తున్నారు. బయటకు రావాల్సిన జగన్ రాకుండా, ఎమ్మెల్యేలు, మంత్రులను తిట్టటం ఏమిటి అంటూ కొంత మంది పెదవి విరుస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read