జగన్ మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో చెప్పే వివిధ వ్యవస్థలు ఆయన దగ్గర ఉంటాయి. సొంత ఆలోచనలతో కూడా, ఏమి జరుగుతుందో ముఖ్యమంత్రులు అర్ధం చేసుకుంటారు. అయితే జగన్ మోహన్ రెడ్డి సమాచారం ఇచ్చే వారు తేడాగా ఇస్తున్నారో, లేక జగన్ మోహన్ రెడ్డే తేడాగా ఉన్నారో కానీ, ఆయన అయితే రియాలిటీలో లేరు అనే విషయం అర్ధం అవుతుంది. తాను ఇచ్చే పధకాలతో ప్రజలు, సంతోషంతో డ్యాన్స్ వేస్తున్నారు అనే భ్రమలో జగన్ ఉన్నారని అర్ధం అవుతుంది. రెండు రోజుల క్రితం ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో మాదిగ కార్పొరేషన్ గురించి అడగగా, పధకాలు ఇస్తున్నాంగా ఇంకా ఎందుకు అని జగన్ చెప్పటంతో, అందరికీ దిమ్మ తిరిగింది. నిన్న ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో కూడా ఇదే తీరు. ముస్లిం యువతులకు షాదీముబారఖ్ ఇవ్వాలని కొంత మంది ఎమ్మెల్యేలు కోరితే, అమ్మఒడి ఇస్తున్నాం కదా అని అనటంతో, దిమ్మ తిరిగింది. అలాగే అమ్మఒడి పధకానికి కోతలు పెట్టారని చెప్పటంతో, నిబంధనల ప్రకరం ఇస్తాం, అర్హత లేని వారికి ఎలా ఇస్తాం, గతంలో తప్పు చేసాం, ఇప్పుడు దిద్దుకుంటున్నాం అని జగన్ తేల్చి చెప్పారట. రోడ్డులు గురించి అడిగితే డబ్బులు లేవని చెప్పారట. ఇక కరెంటు, ఇసుక గురించి అడిగితే, ఎల్లో మీడియా కధనాలు నమ్మి, నన్ను ప్రశ్నిస్తారా, అసలు కరెంటు ఎక్కడ పోయిందని దబాయించారట. జగన్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారో తెలుసుకుని, ఎమ్మెల్యేలు అవాక్కయ్యారట.
రియాలిటీకి దూరంగా జగన్.. ఎమ్మెల్యేలు సమస్యలు చెప్తున్నా, ఎల్లో మీడియా వార్తలు చెప్తారా అని అసహనం..
Advertisements