డయల్ 100... ఇది మనకు చిన్నప్పటి నుండి, అలవాటు అయిన పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్. ఏ ఇబ్బంది వచ్చినా, 100 నెంబర్ కి డయల్ చేసి పోలీస్ సహాయం తీసుకుంటాం. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో, ఈ డయల్ 100 కూడా కోల్పోయాం. డయల్ 100, 108 కూడా హైదరాబాద్ లోనే వదిలేయాల్సి వచ్చింది అన్నారు డిజిపి సాంబశివరావు. అందుకే ఇప్పుడు డయల్ 100 బదులు, డయల్ 112 తీసుకువచ్చామని చెప్పారు.
ప్రస్తుతం పనిచేస్తున్న డయల్ 100 కు ఫోన్ చేస్తే, ఆ కాల్ హైదరాబాద్ కాల్ సెంటర్ లో రిసీవ్ చేసుకుని, ఆంధ్రప్రదేశ్ కు సమాచారం అందిస్తున్నారు. ఈ పద్ధతి సరైనది కాదు అని, తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకుంటామని కేంద్రాన్ని కోరగా, NERS ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ఇందుకు గాను, 9.5 కోట్లు రాష్ట్రానికి కేటాయించింది.
ఈ కేంద్రాన్ని విజయవాడ RTC హౌస్ లో ఏర్పాటు చేస్తామని డిజిపి సాంబశివరావు చెప్పారు. రాష్ట్రంలో ఎవరకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా, డయల్ 112 ఫోన్ చేస్తే, వెంటనే ఆ కాల్ కి స్పందిస్తామని చెప్పారు, డిజిపి సాంబశివరావు.