నగరంలోని ప్రముఖ బట్టల దుకాణం అయిన బ్రాండ్ ఫ్యాక్టరీలో 3 రోజుల పాటు బంపర్ ఆఫర్ను ప్రకటించారు. కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే చెల్లించి ఐదు వేల రూపాయల విలువగల షాపింగ్ చేయొచ్చు. ఈ ఆఫర్ నెల 16 నుంచి 18 వరకు అందుబాటులో ఉంటుందని బ్రాండ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. రూ. 5000 కొనుకోండి.. 2000 మాత్రమే చెల్లించండి అని చెప్పడమే కాదు. దీంతో పాటు రూ. 1000 ల విలువగల షర్ట్, మరో రూ. 1000ల విలువగల కాష్ వోచర్, మరో రూ. 400 కాష్ బ్యాక్ ఇది బ్రాండ్ ఫ్యాక్టరీ ఆఫర్.
ఈ ఆఫర్ గురించి తెలిసిన అందరూ బందర్ రోడ్డులోని బ్రాండ్ ఫ్యాక్టరీ ముందు బారులు తీరారు. ఇవాల్టితో గడువు ముగియనుండడంతో జనం మరీ విపరీతంగా వస్తున్నారు. బ్రాండ్ ఫ్యాక్టరీ షోరూం దగ్గర జనం తండోపతండాలుగా ఎగబడుతున్నారు. దీంతో యాజమాన్యం ఏమి చేయలేక షట్టర్లు మూసేసి వెనక్కి పంపిస్తున్నారు.
Advertisements