ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ, ఈ రోజు ఆక్షన్ లోకి దిగారు. తన కార్యాలయంలో, తాను లేని సమయంలో చేసిన మార్పులు పై ఆయన విచారణకు ఆదేశించారు. ఎవరు చెప్తే ఈ మార్పులు చేసారు, ఎందుకు చేసారు అనే విషయాల పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు. తన కార్యాలయంలో ఎందుకు మార్పులు చెయ్యాల్సి వచ్చిందో, తేల్చాలని అన్నారు. నిమ్మగడ్డ లేని సమయంలో, ఆయన కార్యాలయంలో కొన్ని మార్పులు చేసారు. ఇవి వాస్తు మార్పులుగా చెప్పారు. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ చాంబర్, అలాగే అధికారులు కార్యాలయం మధ్యలో ఉన్న తలుపు మూసివేసారు. అయితే ఈ విషయం పై, కొన్ని వార్తా పత్రికల్లో, తానె ఈ వాస్తు మార్పులు చేసినట్టు కధనాలు రావటంతో, ఆయన స్పందిస్తూ, ఈ విషయం పై ఎంక్వయిరీకి ఆదేశించామని, తానూ "rationalist" అని చెప్పుకొచ్చారు. తాను రాక ముందే, కార్యాలయంలో మార్పులు జరిగాయని, దీని పై విచారణ జరుగుతున్నట్టు, నిమ్మగడ్డ చెప్పారు.

ఆంద్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన సమయంలో,ఆయన మాట్లాడుతూ ఈ వ్యవస్థ రాజ్యంగ వ్యవస్థ అని, స్వాతంత్ర సంస్థ అని, రాగద్వేషాలు లేకుండా పని చేస్తానాని చెప్పారు. తనకు ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతుందని, ఆశిస్తున్నా అంటూ, నిమ్మగడ్డ చెప్పారు. తానూ గత శుక్రవారం గవర్నర్ ఆదేశాలు రాగానే, బాధ్యతలు చేపట్టానని, ఈ విషయం అధికారులకు కూడా తెలియ చేసానని చెప్పారు. గతంలో రమేష్ కుమార్ ని ప్రభుత్వం తొలగించి, కనక రాజ్ ని పెట్టటం, తరువాత నిమ్మగడ్డ హైకోర్టు కు వెళ్ళటం, హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేయటం, అయినా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వక పోవటంతో, కోర్టు ధిక్కరణ పిటీషన్ వెయ్యటం, ఇదే క్రమంలో ప్రభుత్వం పలు మార్లు సుప్రీం కోర్టుకు వెళ్ళటం, సుప్రీం కోర్టు కూడా కొట్టేయటం, ఇలా అనేక విషయాలు జరిగిన తరువాత, నిమ్మగడ్డ ఎన్నికల కమీషనర్ గా నియమింప బడ్డారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు వైసిపీ నేతలు అంతా, అమరావాతే రాజధాని అని నమ్మించారు. ఎన్నికల ప్రచారంలో, అలాగే వివిధ సందర్భాల్లో అమరావతి రాజధానిగా ఉంటుందని, తెలుగుదేశం పార్టీ మభ్య పెడుతుంది అంటూ వైసీపీ నేతలు చెప్పారు. ఇక సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి కూడా, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, మభ్య పెట్టవద్దు అంటూ, చెప్పిన మాటలు, అలాగే సాక్షాత్తు అసెంబ్లీలో కూడా, అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నాం అని, కాకపొతే 30 వేల ఎకరాల్లో రాజధాని రావాలి అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అదంతా గతం. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. రాగానే అమరావతి పనులు ఆపేసారు. కొత్తగా మొదలు పెడతారు అని అందరూ అనుకున్నారు. రెండు నెలలు, మూడు నెలలు, ఇలా కాలం గడిచి పోతున్నా, అమరావతి గురించి మాట్లాడటం లేదు. ఇక ఫైనల్ గా, నవంబర్ నెలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అని అసెంబ్లీలో చెప్పి, బాంబు పేల్చారు.

తరువాత శాసనమండలి సెలెక్ట్ కమిటీకి వెళ్ళటం, ఆ తరువాత కోర్టుకు వెళ్ళటం జరిగాయి. అయిన సరే గవర్నర్ చేత బిల్లులు ఆమోదించుకున్నారు. దీని పై తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒక ప్రభుత్వానికి రైతులు భూములు ఇస్తే, ఇలా అన్యాయం చేస్తారా అని నిలదీసింది. అంతే కాదు ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని నమ్మించి, ఇప్పుడు ఇలా చెయ్యటం పై, చంద్రబాబు ప్రజా తీర్పు కోరదాం రమ్మని, జగన్ కు చాలెంజ్ చేసారు. 48 గంటల్లో ఏ నిర్ణయం చెప్పాలని, అసెంబ్లీని రద్దు చేసి, మూడు రాజధానుల పై ప్రజా తీర్పు కోరదామని అన్నారు. ఆ 48 గంటల గడవు మరో గంటలో ముగియనుంది. ఇటు మాట మార్చిన వైసీపీ మాత్రం, మేము రాజీనామాలు చెయ్యం, మీరే చేసుకోండి అని చెప్తుంది. ఇక మరో పక్క నిన్న కోర్టు, 14 వరకు అమరావతిని కదిలించ వద్దు అని చెప్పింది. వీటి అన్నిటి నేపధ్యంలో, చంద్రబాబు ఈ రోజు 5 గంటలకు మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఇప్పుడు ఏ డిమాండ్ చేస్తారు అనే దాని పై సస్పెన్స్ కొనసాగుతుంది. కోర్టు తీర్పు నేపధ్యంలో వ్యూహం మార్చారా ? లేక మరో డిమాండ్ తో ముందుకు వస్తారా అనేది చూడాలి.

అమరావతి అంశం పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దు అంటూ ఇచ్చిన గెజిట్ పై అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు వెళ్ళింది. ఈ అంశం పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అధికార వికేంద్రీకరణతో పాటుగా, సీఆర్డీఏ రద్దు బిల్లుల పై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ఆ లోగా రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమకు కౌంటర్ వెయ్యటానికి సమయం కావాలని, పది రోజులు సమయం కావాలి అంటూ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరగా, కోర్టు దానికి అంగీకరిస్తూ, ఆగష్టు 14కు వాయిదా వేసి, అప్పటి వరకు ఈ బిల్లుల పై ముందుకు వెళ్ళటానికి లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు, ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్ళటానికి లేదు. అంతే కాదు, ఈ రెండు బిల్లులు ఇప్పుడు ఆమోదంలో లేనట్టే అవుతుంది.

అమరావతి రాజధానిగా, సిఆర్డీఏ లైవ్ లో ఉంటూ ఉంటుందని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్ధం అవుతుంది. పది రోజులు తరువాత ప్రభుత్వం ఇచ్చే కౌంటర్ ని బట్టి, స్టే ని పొడిగించటం కానీ, లేదా తదుపరి ఆదేశాలు ఇవ్వటం కానీ జరుగుతుంది. ఏది ఏమైనా, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఆగష్టు 15న మేము వైజాగ్ వెళ్ళిపోతాం అని లీకులు ఇస్తున్న తరుణంలో, ఆగష్టు 14 వరకు హైకోర్టు స్టే ఇవ్వటంతో, ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. కౌంటర్ వెయ్యమని స్టే ఇవ్వటంతో, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కౌంటర్ ఎలా ఉంటుంది, హైకోర్టు ఆ కౌంటర్ ని పరిగణలోకి తీసుకుంటుందా, అనేది చూడాలి. ఏది ఏమైనా కౌంటర్ వెయ్యమని వాయిదా వెయ్యకుండా, స్టేటస్ కో ఇచ్చి, ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉండాలని, స్టే ఇచ్చి మరీ హైకోర్టు వాయిదా వెయ్యటంతో, ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి...

అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించటం, అక్కడ నుంచి గవర్నర్ వద్దకు రావటం, గవర్నర్ ఆమోదించటం చకచకా జరిగిపోయాయి. దీని పై రైతులు కోర్టుకు వెళ్ళగా, ఈ రోజు కోర్టు 14 వరకు స్టేటస్ కో ఇస్తూ, యధాతధ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఇస్తూ, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చెయ్యమని ఆదేశించింది. ఇది ఇలా ఉంటే, మూడు రాజధానులు అనేది కోర్టుల ముందు నిలవదు అని, ఇందుకు జగన్ ప్రభుత్వం చేసిన చట్టంలో ఉన్న లోపాలే కారణం అంటున్నారు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న, మూడు రాజధానులు, అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం పై, తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని ఏర్పాటు అనేది, చట్ట ప్రకారం జరిగింది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పొందు పరిచిన అంశం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు అవకాసం వచ్చిందని అన్నారు.

ఆ చట్టంలో "ఏ కాపిటల్" (ఒక రాజధాని) అని ఉన్న విషయం ఆయన ప్రస్తావించారు. చట్టంలో కాపిటల్ అని ఉందని, కాపిటల్స్ అని లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా, కేంద్రం చేసిన చట్టానికి లోబడి ఉండాలని, ఇక్కడ అలా జరగకుండా, మూడు రాజధానులు చేసారని అన్నారు. ఇక హైకోర్టు అనేది మార్చటం, ఏ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాని పని అని అన్నారు. హైకోర్టు మార్పు ముందుగా హైకోర్టు జడ్జీలు ఇష్ట ప్రకారం, తరువాత సుప్రీం కోర్టు ఇష్ట ప్రకారం, ఆ తరువాత ప్రెసిడెంట్ అఫ్ ఇండియా సమ్మతితో హైకోర్టు మార్పు ఉంటుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా చట్టంలో పెడుతుంది అని అన్నారు. ఇక ఆర్ధిక బిల్లులు కానివి, అసెంబ్లీ ఇష్టం వచ్చినట్టు చెయ్యటం కుదరదు అని, మండలి సెలెక్ట్ కమిటీకి పంపించిన సమయంలో, దాన్ని ఆమోదిస్తే, రాజ్యాంగ విరుద్ధం అవుతుందని అన్నారు. ఇక రైతులు చేసిన అగ్రిమెంట్లు ఉండనే ఉన్నాయని, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే, ఈ బిల్లులు న్యాయ స్థానాల్లో నిలవవు అని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read