రాష్ట్రంలో చాలా మంది శిశువులు బరువు తక్కువగా ఉండటం... వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్నారు. శిశు మరణాలను నివారించేందుకు, వారిని వ్యాధుల నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ’’ఎన్టీఆర్ బేబి కిట్స్‌’’ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రభుత్వం ఇచ్చేది రూ.772 విలువ చేసే వస్తువులు అయినా అంతకంటే ఎక్కువ విలువచేసే ఫలితాలు కనిపిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల శాతం మూడింతలయింది. ఇదంతా బేబి కిట్స్‌ వల్లనే కాకపోయినా... డెలవరీలు పెరగడానికి మాత్రం ఇదీ ఒక కారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు..

తల్లీబిడ్డలకు ఏకకాలంలో రక్షణ దొరుకుతుండటంతో.. బేబి కిట్స్‌ని అందించే ప్రభుత్వాస్పత్రులకు ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది. పథకం అమల్లోకి వచ్చిన తరువాత డెలివరీల శాతం మూడింతలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి అంతగా సమకూరని శిశుదశని దాటేస్తే.. బిడ్డ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఈ కీలక దశలో బేబికిట్స్‌ని అందించడం మంచి ఫలితాలను ఇస్తున్నదని, చిన్నారుల మరణాల శాతం తగ్గడానికి దోహదపడిందని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెలివరీల కోసం ప్రజలు చేసే ఖర్చు 50 శాతం నుంచి 17 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు. మరో ఏడాదికి ఐదు శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నూటికి 90శాతం మంది పేదలు చికిత్స చేయించుకొనే మిషనరీ ఆసుపత్రుల్లో సైతం బేబి కిట్స్‌ని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

ఏమేం ఉంటాయి..

బేబి కిట్స్‌లో బెడ్‌ కమ్‌ క్యారీ కిట్‌, టవల్‌, హ్యాండ్‌ వాష్‌, దోమ తెర వంటి నాలుగు వస్తువులుంటాయి. వీటిలో బెడ్‌ కమ్‌ క్యారీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉంచితే, తల్లి గర్భంలో శిశువుకు ఎలాంటి రక్షణ లభిస్తుందో, ఆ స్థాయి కవచంలా పనిచేస్తుంది. బయట వాతావరణం వల్ల శిశువులకు వచ్చే వ్యాధుల నుంచి కాపాడటంతోపాటు, ముద్దు చేయడానికి ముందుకొచ్చే వారి నోరు, చేతుల్లోని ఇన్ఫెక్షన్‌ నుంచి చిన్నారులను రక్షిస్తుంది. కాటన్‌తో తయారు చేయడం వల్ల చిన్నారుల శరీరానికి హాయిని అందిస్తుంది. చిన్నారులకు స్నానం అనంతరం వాడటానికి టవల్‌ని కిట్‌లో ఉంచారు. పాలిచ్చే సమయంలో తప్ప.. తల్లులు బిడ్డల దగ్గర సాధారణంగా ఉండరు. ఏదో పని చక్కబెడుతూనే ఉంటారు. అటువంటివారి కోసం హ్యాండ్‌ వాష్‌ని ఉంచారు. పాలిచ్చే ముందు హ్యాండ్‌ వాష్‌తో చేతులు శుభ్రం చేసుకొంటే, ఎలాంటి సమస్యలూ దరికి చేరవు.

 

గత ఏడాది సెప్టెంబరు నుంచి జూలై చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో 2 లక్షల 25 వేల మంది డెలివరీ అయితే 2,05,200 మంది మహిళలకు బేబి కిట్లు అందించారు.

ఈ పధకానికి బసవతారకం కిట్‌ అదనం. ఈ కిట్‌ విలువ రూ. 1000 పైన ఉంటుంది. ఇందులో బాలింతలకు అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్స్‌, తలకు చుట్టుకొనే స్కార్ఫ్‌, బిడ్డకు పాలిచ్చేందుకు అనుకూలంగా ఉండే రెండు యాప్రాన్లు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రె్‌సలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న వారికి రూ.1000 ప్రోత్సాహం అందిస్తున్నారు.

ఈ పధకం ఏంతో పారదర్శకంగా జరుగుతుంది... ఎవరికి కిట్ ఇచ్చారు, ఏ జిల్లలో, ఏ హాస్పిటల్ లో ఇచ్చారు, తల్లి, తండ్రి,బిడ్డ పేరుతో సహా, ఫోటో తీసి వెబ్సైటులో పెడతారు... ఏ రోజు , ఎవరు తీసుకున్నారు అనే వివరాలు అన్నీ తెలుస్తాయి... ఇక్కడ చూడవచ్చు http://hmfw.ap.gov.in/DH/NBK_DisWise_Reports.aspx

Advertisements

Advertisements

Latest Articles

Most Read