ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసును అక్రమ కేసుగా హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా జాస్తి కృష్ణ కిషోర్ ఎక్కడా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నట్లుగా కానీ అనుచిత లబ్ధి పొందినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి కృష్ణ కిషోర్ పై నమోదు చేసింది, అక్రమమైన కేసు అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే 2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర సర్వీసులో పనిచేస్తున్న కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. ఆ కేసులో వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే కృష్ణ కిషోర్ కొన్ని సొంత నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు చేసింది. ఆ వ్యక్తిగత నిర్ణయాల కారణంగా కృష్ణకిషోర్ అనుచిత లబ్ధి పొందారని, ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి జాస్తి కృష్ణ కిషోర్ అక్రమాలకు పాల్పడినట్లు గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే వైసిపి సర్కారు తీరును తప్పు పడుతూ కృష్ణ కిషోర్, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు . అయితే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఈ కేసును విచారించి ముందుగా కృష్ణ కిషోర్ సస్పెన్షన్ పై స్టే ఇచ్చింది. అనంతరం కేసు ను పూర్తిగా విచారించిన తర్వాత జస్టిస్ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ విచారణ చేసింది.
కృష్ణ కిషోర్ పై వైసీపీ ప్రభుత్వం ఆరోపించిన ఈ ఆరోపణలు చెల్లదని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయితే తరువాత ఈ కేసు హైకోర్టుకు వచ్చింది. ఈ విచారణ సందర్భంలో హైకోర్టు దృష్టికి మూడు అంశాలు తీసుకువచ్చారు. అదేంటంటే జగన్ సిబిఐ కేసును విచారించిన జేడీ లక్ష్మీనారాయణ తో కృష్ణకిషోర్ సంబంధాలున్నాయని అనే కారణంతోనే అతనిపై వ్యక్తిగత ద్వేషం తో సస్పెండ్ చేశారని హైకోర్టుకు చెప్పారు. అదేవిధంగా జాస్తి కృష్ణ కిషోర్ హైదరాబాద్ లో ఆదాయ పన్ను శాఖ అధికారి గా ఉన్నప్పుడు జగతి పబ్లికేషన్స్ నోటీసులు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని జాస్తి కృష్ణ కిషోర్ పై అక్రమ కేసులు ఆమోదించారని హైకోర్టు నిర్ధారణకు వచ్చిందని న్యాయవాదులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మనసులో పెట్టుకుని జాస్తి కృష్ణ కిషోర్ పై అక్రమ కేసులు పెట్టారని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు కొట్టి వేయడమే కాకుండా ఈ కేసు అక్రమమని తేల్చిచెప్పింది. ఇప్పటికే మరో అధికారి ఏబీ వెంకటేశ్వర రావుని ప్రభుత్వం, ఇలాగే వేధిస్తున్న సంగతి తెలిసిందే.