వైకాపా వేలం పాటలా టిక్కెట్లు అమ్ముకుంటుంటే.. తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తామన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించటానికి వీల్లేదని ఆదేశించారు. చింతలపూడిలో రూ.3 కోట్లు ఇస్తానంటే ఒకరికి.. అంతకంటే ఎక్కువ ఇస్తానంటే ఇంకొకరికీ అంటూ వైకాపా అభ్యర్థుల్ని మారుస్తోందని విమర్శించారు. తెదేపాలో అలాంటి పరిస్థితి లేదని.. పనిచేసిన వారితో పాటు సామాజిక న్యాయాన్నిఅభ్యర్థుల ఎంపికలో పాటిస్తున్నామని వెల్లడించారు.

modi 12032019

టిక్కెట్ ఇవ్వలేకపోతున్నాం అని తాను చెప్తే.. అర్థం చేసుకున్నాం, పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనన్న చంద్రబాబు.. అందరినీ గుర్తించి భవిష్యత్తులో పదవులిస్తామని స్పష్టం చేశారు. కుటుంబం లాంటి పార్టీ కోసం ఇప్పుడు అండగా ఉన్నవారందరి భవిష్యత్తూ పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. కుట్రలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞులని.. విభజన నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులను అంచనా వేసే తీర్పు ఇవ్వబోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మూడు రోజులు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి, మినహాయింపు లేవని.. గెలుపే ధ్యేయంగా యుద్ధానికి సన్నద్ధం కావాలని కోరారు.

modi 12032019

‘వైసీపీ అసలు పార్టీనే కాదు. ఆ పార్టీ గురించి, దాని నాయకుడి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. ఇంత దివాలాకోరు పార్టీని నా జీవితంలో చూడలేదు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించిన కేసీఆర్‌ శిక్షణతో జగన్‌ బిహారీ గ్యాంగ్‌తో కలిసి ఆంధ్రలో 9 లక్షల ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ అండతోనే జగన్‌ ఫామ్‌-7 దుర్వినియోగం చేశారు. ఓట్లు తొలగింపు కుట్రలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. జగన్‌కు ఈ గడ్డపై నమ్మకం లేదు. ఇక్కడి ప్రజలపై విశ్వాసం లేదు. అమరావతిపై అభిమానం లేదు. పాదయాత్ర చేసేటప్పుడు తప్ప.. గత ఐదేళ్లలో ఎప్పుడూ రాష్ట్రంలో బస చేయలేదు. లోటస్‌ పాండ్‌ మినహా ఎక్కడ ఆయనకు సౌఖ్యంగా ఉండదు. తన నీడను కూడా నమ్మని వ్యక్తి జగన్‌. సర్పంచ్‌గా కూడా పని చేసిన అనుభవం లేదు. ఆయన తండ్రి వయసు నాది. నన్నెన్ని మాటలు అంటున్నాడో! ప్రజల కోసం భరిస్తా’ అని సీఎం అన్నారు.

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు ఉండి ఆక్టివ్ అయ్యారు. పోయిన వారం ఆయన అటు స్పీకర్ కోడెలతోనూ, ఇటు వంగవీటి రాధాతోనూ వేర్వేరుగా సమావేశం అయ్యారు. రాజకీయవర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో ఆయన టీడీపీ అధినేతతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. పలు మార్లు భేటీ అయ్యారు కూడా. భేటీ అయినప్పుడల్లా ఆయన టీడీపీలో చేరుతారని, ఏదో ఓ స్థానం నుంచి పార్లమెంట్‌కో అసెంబ్లీకో పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నేరుగా కోడెల, వంగవీటి రాధాలను కలవడం దేనికోసమన్న చర్చ ప్రారంభమయింది.

modi 12032019

వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేశారు కానీ, ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. తెలుగుదేశం పార్టీ ఆహ్వానించినా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్ ఆయనకు నచ్చలేదంటున్నారు. కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. ఈ తరుణంలోనే లగడపాటి రాజగోపాల్ ఆయనను టీడీపీ తరపున విజయవాడ నుంచి కాకుండా ఇతర చోట్ల పోటీ చేసేందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరడంతో నర్సాపురం టిక్కెట్ ఒకటి పెండింగ్‌లో ఉంది. అక్కడ క్షత్రియ సామాజికవర్గంతో పాటు కాపు సామాజికవర్గానికి కూడా రాజకీయ పార్టీలు అవకాశం కల్పిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలో ఓ చోట నుంచి పోటీ చేయాలని లగడపాటి వంగవీటికి సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.

modi 12032019

అయితే, ఈ నేపధ్యంలో లగడపాటి కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేస్తారు అనే టాక్ వినిపిస్తూ వస్తుంది. దీని పై లగడపాటి స్పందించారు. ‘నా రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తా.., ఏ పార్టీలో చేరను, వ్యాపారాలు చేసుకుంటా’నని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’నంటూ ప్రకటించిన ఆయన అదే మాటపై ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నారు. అయితే... ఇప్పడు సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆయన తన రాజకీయ సన్యాసాన్ని వదిలేసి ఏదైనా పార్టీలో చేరి పోటీచేస్తారా అన్న దానిపై అంతటా ఆసక్తి ఉండేది. అయితే ఈ విషయంపై మంగళవారం ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయ సన్యాసం కొనసాగిస్తానని ప్రకటించారు.

వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. రేపు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై నిర్ణయాన్ని మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకే రాధా వదిలేశారు. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబుతో చర్చలు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఈ ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబుతో భేటీలో వైసీపీలో తనకు జరిగిన అవమానాలను కూడా రాధా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తనకు ఎన్నిల్లో పోటీ చేయటం ప్రధాన ఉద్దేశం కాదని.. వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని రాధా పేర్కొంటున్నారు. రేపు సాయంత్రం లోగా టీడీపీలో చేరేందుకు రాధా అంగీకారం తెలిపారు.

modi 12032019

విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా తన వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీని వీడిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. గత నెల రోజులుగా ఈ విషయం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. ఆయన ఎప్పుడు చేరబోతున్నారు అనే దాని పై కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి. రాధా పార్టీని వీడినప్పటినుండి దాదాపుగా నేటికి నెల రోజులు వరకు అయ్యుంటుంది కానీ ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి సరిగ్గా నేటి తో ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇక ఆయన పార్టీలో చేరకపోతే ఆయనకే నష్టం వాటిల్లుతుందని అక్కడి జనం అనుకుంటున్నారు.

modi 12032019

ఈ విషయం ఇలా ఉండగా గత రెండు మూడు రోజుల నుండి ఆయన మళ్ళీ తెర పై కనిపిస్తున్నాడు. నిన్న సాయంత్రం ఆయన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ భేటీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇది ఇలా ఉండగా ఉన్నట్టుండి మళ్ళీ సోమవారం రాత్రి వంగవీటి రాధా విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీ లో రాధా చంద్రబాబు తో తన డిమాండ్లని చెప్పుకునట్టు దానికి బాబు ఒప్పుకునట్టు సమాచారం వస్తుంది. రాధా కి చంద్రబాబు నర్సారావుపేట లేదా అనకాపల్లి టికెట్ ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది. దీంతో రాధా చంద్రబాబు సమక్షం లో టీడీపీ లో చేరడం పక్కా అంటున్నారు టీడీపీ నాయకులు. వంగవీటికి టికెట్‌ ఇస్తే మచిలీపట్నం సిట్టింగ్‌‌ ఎంపీ కొనకళ్ల నారాయణను పెడన శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది.

ప్రధాన పక్షాలను తలదన్నేలా జనసేన గోదావరి జిల్లాల్లో వ్యూహాన్ని రూపొందించిందా..? నరసాపురం లోక్‌సభ స్థానానికి పవన్‌ సోదరుడు నాగబాబును బరిలోకి దింపబోతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ జనసేన నేతలు నిజమేనని బదులిస్తున్నారు. తమ పురిటిగడ్డపై అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలని మొదటి నుంచి పవన్‌కల్యాణ్‌ ఆశ పడుతున్నారు. దీనికి తగ్గట్టు జిల్లాలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఆరా తీస్తూ వచ్చారు. ఒక దశలో తాను పశ్చిమ నుంచే పోటీ చేస్తానంటూ పరోక్ష ప్రకటనలు చేశారు. ఏలూరు నుంచి ఓటు హక్కును పొందారు. అంతకుముందు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చేసిన ప్రకటన మార్చుకున్నట్టే కనిపించింది. ఆ తరువాత ఈ ప్రస్తావన ఎక్కడా ఎత్తలేదు.

modi 12032019

జనసేనలో అసలు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? పార్లమెంటుకా..? అసెంబ్లీకా..? అనేది సస్పెన్స్‌గా మిగిలింది. తాజాగా రాజకీయ ప్రస్తావనలో ఆయన సోదరుడు నాగబాబు పేరు ప్రతిపాదనలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జనసేన ముఖ్యనేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వాస్తవానికి నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగబోతున్నట్టు చాలాకాలం క్రితం ప్రచారం సాగింది. తన అన్న చిరంజీవి ఓటమి పొందిన పాలకొల్లులో తిరిగి పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో పవన్‌ ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

modi 12032019

నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి నాగబాబు బరిలోకి దిగితే, మిగతా అసెంబ్లీ స్థానాలపైనా దీని ప్రభావం పడుతుందని, పార్టీ ఆయా స్థానాల్లో సులువుగా గెలిచేందుకు వీలు ఉంటుందని, తద్వారా జనసేన సత్తాను ప్రదర్శించేందుకు కార్యకర్తలు సమరోత్సాహంతో ముందుకు కదులుతారని నేతలు పవన్‌కు వివరించినట్టు సమాచారం. గతంలో తమ కుటుంబానికి జరిగిన అవమానాలను జనసేన నుంచి గెలుపొంది తిప్పికొట్టాలనే భావనతో ఉన్నట్టు చెబుతున్నారు. అందుకనే నరసాపురం, పాలకొల్లు స్థానాల ప్రతిపాదన కొత్తగా పార్టీలో చర్చకు దారితీసింది. ఇదే తరుణంలో తమ సొంతూరు మొగల్తూరు నరసాపురం పరిధిలోనే ఉండడం పార్టీకి అనుకూలంగా ఉంటుందని తమకున్న అంచనాలను పవన్‌ చెవిన వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisements

Latest Articles

Most Read