రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి పరిటాల సునీత పేరును అధిష్టానం ఖరారు చేసింది. అయితే.. ఆమె మాత్రం అభిమానుల కోరిక మేరకు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని ప్రకటించారు. రెండు స్థానాల్లో అవకాశం కల్పించమని అడుగుతున్నామని.. కుదరని పక్షంలో శ్రీరామ్ తనకు బదులుగా రాప్తాడు నుంచి పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని అధినేత దృష్టికి తీసుకెళతానని, ముఖ్యమంత్రి నిర్ణయం తమకు శిరోధార్యమని పరిటాల సునీత తెలిపారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ముత్తవ్వకుంట్ల ఎన్నికల ప్రచారంలో టీడీపీ శ్రేణులకు మంత్రి పరిటాల సునీత పిలుపునివ్వడం విశేషం.

police 13032019

పరిటాల కుటుంబం రాప్తాడు, కల్యాణదుర్గం టికెట్లను తమకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమే ఖరారు చేశారు. రాప్తాడు టికెట్‌ను మరోసారి పరిటాల సునీతకు కేటాయించారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ ఆసక్తి కనబరిచారు. దీంతో రాప్తాడు నుంచి శ్రీరామ్‌ను బరిలో నిలిపేందుకు సునీత సిద్దమయ్యారు. తాము రెండు స్థానాలు కోరినప్పటికీ చంద్రబాబు ఒకటే సీటు కేటాయించడంతో.. సునీత పోటీ నుంచి తప్పుకున్నారు. శ్రీరామ్‌ను గెలిపించాల్సిందిగా ఆమె పార్టీ శ్రేణులను కోరారు.

police 13032019

రాయలసీమలో అనంతపురం జిల్లా ఏపీలో అధికార పార్టీకి పెట్టని కోటగానే ఉంది. గడచిన ఎన్నికల్లో రాయలసీమలో సత్తా చాటిన విపక్ష వైసీపీ అనంతపురంలో మాత్రం చతికిలబడిందనే చెప్పాలి. టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా సత్తా చాటిన వైసీపీ... అనంతపురంలో మాత్రం అంతగా రాణించలేదనే చెప్పాలి. ఇందుకు చాలా కారణాలే ఉన్నా... టీడీపీకి ఆ జిల్లాలో కీలక నేతలు ఉన్నారు. పరిటాల కుటుంబంతో పాటుగా బలమైన కమ్మ సామాజిక వర్గం కూడా ఆ జిల్లాలో చక్రం తిప్పుతోంది. ఇక ఎన్నికల ముందు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం కూడా టీడీపీలో చేరడంతో టీడీపీకి తిరుగులేని విజయాలు ఆ జిల్లాలో నమోదయ్యాయి.

ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నవేళ అభ్యర్థుల జాబితాపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తెదేపా ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసినప్పటికీ.. పెండింగ్‌ స్థానాలపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈసారి మంత్రి లోకేశ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు.. లోకేశ్‌ పోటీపై స్పష్టత ఇచ్చారు. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్‌ పోటీ చేస్తారని పార్టీ అధినేత ప్రకటించారు. తొలుత భీమిలి, విశాఖ నార్త్‌ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి ఆయన బరిలో దిగుతారని ప్రచారం జరిగినప్పటికీ చంద్రబాబు మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీ చేస్తారని ప్రకటించారు.

police 13032019

మరో పక్క, తెదేపా గురువారం తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. ఆరోజు తొలుత తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళానికి చేరుకుని ఆ జిల్లా పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. ఇలా 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. జిల్లాస్థాయి నాయకత్వం మొదలుకుని సేవామిత్రలు, బూత్‌స్థాయి కన్వీనర్ల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనలు ముగిశాక ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారు. ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

police 13032019

సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. తొలి విడత ఎన్నికల్లోనే రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రచార పర్వం షురూ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మార్చి 16న ఎన్నికల ప్రచారానికి తెరలేపుతున్నారు చంద్రబాబు. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి తిరుపతి వచ్చి మధ్యాహ్నం ఒంటిగంటకు సేవామిత్ర బూత్ కమిటీల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు. ఆ మరుసటి రోజు మార్చి 17న విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మార్చి 18న ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం మార్చి 19న అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేపడతారు.

ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్‌లు లెక్కించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే... ఆ పిటిషన్ పై 15వతేదీన విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా విపక్ష నేతలు రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు కోర్టుకు హాజరుకానున్నారు. గత నెలలో ఈసీని కలిసిన విపక్షాలు తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతి లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 2019 ఎన్నికలకు సమయం అంతగా లేదు కాబట్టి కనీసం 50 శాతం వీవీ-ప్యాట్-స్లిప్‌ లను పోలైన ఓట్లతో సరి చూడాలని కోరారు.

delhi 13032019

టిడిపి అధినేత‌..ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇవియం ల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసారు. ఇవియంల స్థానం లో బ్యాలెట్ కు వెళ్లాల‌ని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఈవీఎం చిప్ ఆధారిత మిషన్ అని, దాన్ని సులభంగా ఏమార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని పై అన్ని పార్టీల‌తో క‌లిసి పోరాడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు అనుగుణంగానే కోర్ట్ లో కేసు వేసారు. ఈ కేసు విషమై రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నానని, బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్‌లు వచ్చాయని చెప్పారు. అవీ సరైన కాంతి లేకుండా చూసుకోవాలని, దాని వల్ల సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

delhi 13032019

ఈవీఎంలను తయారుచేసినవారు ఆ చిప్‌కు కమాండ్‌ ఇచ్చి మోసం చేసే ఆస్కారం ఉందన్నారు. రెండు మూడు నెలల్లోనే ఈవీఎంలో రికార్డు అంతా పోతుందని, మళ్లీ లెక్కించడానికి సైతం ఆస్కారం ఉండదన్నారు. అమెరికాలో కూడా బ్యాలెట్‌తోనే ఎన్నికలకు వెళుతున్నారని, ప్రపంచమంతా ఈవీఎంలకు వ్యతిరేకంగానే ఉందని చంద్రబాబు చెప్పారు. సింగపూర్‌ ప్రధాని కూడా తాము యంత్రాలపై ఆధారపడబోమని చెప్పారన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

మన రాష్ట్రంలోని రైతులే కాదు, మన రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా, చంద్రబాబు విధానాలని పొగుడుతూ, ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈరోజు ప్రముఖ కన్నడ దినపత్రిక "ప్రజావాణి" ఒక వార్తను ప్రచురించింది. " ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లా గొల్లపల్లి జలాశయాన్ని నింపి తద్వారా కాలువల మూలకంగా హిందూపురం ప్రాంతంలోని చెరువులను నింపడం ద్వారా సరిహద్దు ప్రాంతమైన మా కర్ణాటకలోని గౌరిబిదనూరు తాలూకాలోని గ్రామాల బావుల్లో కూడా భూగర్భ జలాలు పెరగడంతో బెంగళూరుకు వలసవెళ్లిన ఆ ప్రాంత ప్రజలు తిరిగి స్వగ్రామాలకు మళ్లుతున్నారు" అంటూ వార్తను ప్రచురించింది.

farmers 1303209 2

అవి ఎనభైల నాటి రోజులు. శ్రీశైలం జలాలను కరవు సీమకు మళ్లించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కోసం క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు సర్వే చేస్తున్న సమయం. ప్రముఖ ఇంజినీరింగు నిపుణుడు శ్రీరామకృష్ణయ్య ఈ కృషిలో భాగస్వాములయ్యారు. అందరూ వారిని చూసి ఈ రాళ్ల సీమలో నీళ్లు పారిస్తారా అంటూ నవ్వుకునేవారట. శ్రీరామకృష్ణయ్య శిష్యుడిగా పేరొందిన విశ్రాంత ఇంజినీరు కంభంపాటి పాపారావు ఈ సంగతులు చెబుతుంటారు. ఇప్పుడు ఆ కరవు జిల్లా రైతులు కిలోమీటర్ల దూరం కాలువ వెంబడి నడిచి .. ప్రవహిస్తున్న నీళ్లను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కరవు సీమ కదిరి సమీప ప్రాంతాలకు కూడా కాలువల నీళ్లు ప్రవహిస్తున్నాయి. నిరంతరం ప్రవహిస్తున్న కాలువల నీళ్లు...సమీప జలాశయాల్లో నిలబెట్టిన నీళ్లు... అనేక గ్రామాల్లో భూగర్భజలాలను సుసంపన్నం చేస్తున్నాయి. నీటికి ఒక భరోసా ఏర్పడింది. ఒక్క వర్షాధారమే కాదు...కాలువల ఆధారంగాను కాసిన్ని నీళ్లు గొంతులు నింపుతాయని, ఇంకా అవకాశం ఉంటే పొలాలు తడుపుతాయనే విశ్వాసం పాదుకుంది. కృష్ణమ్మతో నిండిన చెరువులు, జలాశయాల చెంత ఇప్పుడు పచ్చదనం సంతోషాల సంక్రాంతి చేస్తోంది.

farmers 1303209 3

కరవుతో అతలాకుతలమవుతున్న సీమలో కొన్ని ప్రాంతాలను కృష్ణా జలాలు సుసంపన్నం చేశాయి. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక సాగులో నానా అవస్థలు పడుతున్న రైతాంగం కాసింత ఉపశమనం పొందారు. అనంతపురం, కడప జిల్లాల్లో అనేక జలాశయాలు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి పరుగులు తీస్తూ చెర్లోపల్లి జలాశయాన్ని నింపి చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టింది. గాలేరు నగరి అవుకు టన్నెలు దాటి గండికోటను సుసంపన్నం చేసి మరిన్ని జలాశయాలకు చేరింది. చెరువులు నీటితో నిండి దాహార్తి తీరుస్తున్నాయి. భూగర్భ జలమట్టాలు పెరిగి భవిష్యత్తుకు భరోసా కలిగిస్తున్నాయి. ట్యాంకర్లపైన ఆధారపడి నీటి అవసరాలు తీర్చుకునే ప్రాంతాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చీనీ, అరటి తోటలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. కరవు కష్టాలను తీర్చిన కృష్ణమ్మ అన్నపూర్ణగా తన పేరు సార్థకం చేసుకుంది.

Advertisements

Latest Articles

Most Read