పెనమలూరు ఎమ్మెల్యే కార్యాలయం, పోరంకి...గత కొన్నేళ్ళుగా ఓ ప్రముఖ పత్రికకు పెనమలూరు మండలంలో కొంత భాగంతో పాటు, మరికొన్ని ప్రాంతాలకు క్రైం రిపోర్టర్ గా పని చేస్తున్న ఓ విలేకరి, అతని వృత్తి నిర్వహణలో భాధ్యతా రాహిత్యం, నోటి దురుసుతనంతో పాటు అవినీతి ఆరోపణల నేపధ్యంలో సంబంధిత యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుండి తొలగించిన విషయం స్థానికులకు తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆంద్రప్రభ పత్రికలో ఉద్యోగానికి కుదురుకున్న సదరు విలేకరి రెండు రోజుల క్రితం మరో ముగ్గురితో కలసి ఎమ్మెల్యే వారిని ఇంటి వద్ద కలిసి అనుకూల వార్తలు వ్రాసేందుకు పెద్ద మొత్తం డిమాండ్ చేశారు.

bode 03172019 1

మీడియాలో పెయిడ్ వార్తలు వ్రాయించుకునే స్థాయిలో తన పనితీరు లేదు అని, మీకు అంతగా కావాలంటే ఎన్నికల సమయం కాబట్టి మీ పత్రికకు ప్రకటనలు ఇస్తా అని ఎమ్మెల్యే గారు వారి ప్యాకేజ్ ఆఫర్ ను తిరస్కరించారు. దీనితో ఎమ్మెల్యే గారి ప్రతిష్ట దెబ్బతినేలా, ప్రతిపక్ష నేతలతో ప్యాకేజ్ మాట్లాడుకొని నిన్నటి నుండి పూర్తి నిరాధార ఆరోపణలతో కధనాలను ప్రచురిస్తూ తమ అక్కసు తీర్చుకున్నారు. ఈ విషయమై, సదరు కధనంలో పేర్కొన్న ఆరోపణలను నిగ్గు తేల్చి, భాధ్యులను గుర్తించి శిక్షించాల్సిందిగా బోడె ప్రసాద్ ఫిర్యాదు చేయడం జరిగింది.

bode 03172019 1

సదరు కధనం ప్రతులను, వారు ఇంటికి వచ్చి మాట్లాడిన సిసి రికార్డింగ్ ఫుటేజ్ తో సహా జోడించి, స్థానిక పెనమలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి, పెనమలూరు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మరియు సబ్ కలెక్టర్ మిషా సింగ్ గారికి, పెనమలూరు తహసీల్దారు శ్రీ గోపాలకృష్ణ గారికి, జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ MD ఇంతియాజ్ గారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. అంతే కాకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే, ఈ విషయమై సదరు వ్యక్తులపై, పత్రికపై పరువు నష్టం దావా వేయడంతో పాటు, క్రిమినల్ చర్యలు తీసుకోనబడును అని తెలియచేయడమైనది.

రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీపార్వతి కోణంలో వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టిముట్టాయి. ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ.. మామ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని మానసిక క్షోభకు గురిచేశారంటూ వాస్తవ ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నానంటూ టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్స్, వీడియోలతో అగ్గిరాజేశారు వర్మ. ఇక ఎన్నికలకు మరో నెలరోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా పై అనవసర రాద్ధాంతం లేకుండా చూస్తున్నారు.

jagna list 17032019

ఈ తరుణంలో చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి ప్రతికూల అంశాలతో నింపేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలైతే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ సినిమా విడుదలను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. ఎన్నికలు తొలిదశ పూర్తయ్యే వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్డుకోవాలని టీడీపీకి చెందిని సాధినేని యామిని తదితరులు ఈసీని కలిసి ఫిర్యాదు చేసిని విషయం తెలిసిందే. మార్చి 22న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఎలాంటి
నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది.

jagna list 17032019

ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రబృందానికి సెన్సార్ బోర్డు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. దీనిపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రధాన ఇతివృత్తం.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం ద్వారా జగన్‌ సానుభూతి పొందాలని చూస్తున్నారని అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ పేర్కొన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని కూడా అలాగే ఉపయోగించుకోవాలని చూశారన్నారు. వివేకానందరెడ్డి మరణానంతర పరిణామాలపై ఆయన ఫేస్‌బుక్‌లో కామెంట్లను పోస్టు చేశారు. వివేకా హత్య ఘటన ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆకాంక్ష జగన్‌ ప్రెస్‌మీట్‌లో కనిపిస్తోందన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన బాబాయి వివేకానందరెడ్డిపై రెండుసార్లు చేయిచేసుకున్నారని..ఈ విషయం తనతో పాటు అప్పట్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు అందరికీ తెలుసునని హర్షకుమార్‌ అందులో వెల్లడించారు. 2006లో వైఎస్‌ వివేకానందరెడ్డి రాజీనామా విషయంలో జరిగిన సంఘటనను ఆయన ప్రస్తావించారు.

108 26112018 1

‘కాంగ్రెస్‌ ఎంపీలంతా పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఉన్నప్పుడు ఎంపీ సాయిప్రతాప్‌కు ఫోన్‌ వచ్చింది. మన వివేకా రిజైన్‌ చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నారు. సోనియాగాంధీ ఆయనను తీసుకురమ్మన్నారని చెబుతూ.. ఆయన వివేకానందరెడ్డిని విమానాశ్రయం నుంచి తీసుకొచ్చిన విషయాన్ని’ గుర్తుచేశారు. ‘వివేకానందరెడ్డి ఎవరికీ తెలియకుండా స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ వద్దకు వెళ్లి రాజీనామా చేశారు. స్పీకర్‌ వెంటనే సోనియాగాంధీకి ఫోన్‌చేసి విషయం చెప్పారు. సాయిప్రతాప్‌ ద్వారా వివేకాను పిలిపించి సోనియా కారణం అడిగితే.. ఇది మా నాన్న సీటు నువ్వు ఎంత కాలం ఉంటావ్‌ అని అప్పటికే రెండుసార్లు జగన్‌ తనపై చేయిచేసుకున్నాడు’ అని మేడంకు వివేకానందరెడ్డి వివరించారని వెల్లడించారు.

108 26112018 1

సోనియాగాంధీ వెంటనే రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ‘మీ కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోండి.. ఇలా చేస్తే జగన్‌కు సీటు ఇవ్వనని హెచ్చరించగా.. తాను చెబుతూనే ఉన్నానంటూ సోనియాకు వైఎస్‌ క్షమాపణ కూడా చెప్పారు’ అన్నారు. 2009లో జగన్‌ ఎంపీ అయ్యారని, ఈ విషయాలన్నీ అప్పటి రాష్ట్ర ఎంపీలందరికీ తెలుసని ఫేస్‌బుక్‌లో హర్షకుమార్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని హర్షకుమార్‌ వద్ద ‘ఈనాడు’ ప్రస్తావించగా ‘ఫేస్‌బుక్‌లో నేనే పోస్టు చేశానని.. ఇది కొత్త విషయం కాదని, అప్పట్లో అందరికీ తెలిసిందేనని’ ఆయన స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి చాలా సౌమ్యుడని, మంచి వ్యక్తి అని అన్నారు. నాడు వివేకా తన పదవికి రాజీనామా చేసిన సంఘటన గురించి వివరించి చెప్పారు.

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 10:30 గంటలకు కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని స్థానాల్లో వచ్చిన అభ్యర్ధుల జాబితా చూసి, షాక్ అయ్యారు. ముఖ్యంగా విజయవాడ ఈస్ట్ లో, అందరూ యలమంచలి రవికి ఇస్తారని అనుకున్నారు. జగన్ కూడా కన్ఫర్మ చేసారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తరువాత, అక్కడ బొప్పన భవకుమార్ కి సీట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు జగన్. ఎంపీ అభ్యర్థులు వీరే... కడప - వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట - మిధున్ రెడ్డి, చిత్తూరు-రెడ్డప్ప,

jagna list 17032019

తిరుపతి- బి. దుర్గాప్రసాద్, హిందూపూర్ - గోరంట్ల మాధవ్, అనంతపూర్- తలారి రంగంయ్య, కర్నూల్- సంజీవ కుమార్, నంద్యాల-బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు- ఆదాల ప్రభాకర్రెడ్డి, ఒంగోలు- మాగుంట శ్రీనివాసరెడ్డి, బాపట్ల - నందిగం సురేష్, నరసరావుపేట - లావు కృష్ణ దేవరాయలు, గుంటూరు - మాడుగుల వేణుగోపాల్ రెడ్డి, మచిలీపట్నం- బాలశౌరి, విజయవాడ- పి.వరప్రసాద్, ఏలూరు - కోటగిరి శ్రీధర్, నర్సాపురం- రఘురాం కృష్ణం రాజు, రాజమండ్రి-ఎం.భరత్, కాకినాడ- వంగాగీత, అమలాపురం - చింతా అనురాధ, అనకాపల్లి - కె.వెంకట సత్యవతి, విశాఖపట్టణం- ఎం.వి.విసత్యనారాయణ, విజయనగరం- బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్, అరకు- గొడ్డేటి మాధవి

jagna list 17032019

కృష్ణా అసెంబ్లీ అభ్యర్ధులు :- తిరువూరు- కె.రక్షణనిధి, నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు, గన్నవరం- యార్లగడ్డ వెంకటరావు, గుడివాడ- కొడాలి నాని, కైకలూరు- దూలం నాగేశ్వరరావు, పెడన- జోగి రమేష్, మచిలీపట్నం- పేర్ని నాని, అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు, పెనమలూరు- పార్థసారధి, పామర్రు- కె.అనిల్ కుమార్, విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు, విజయవాడ ఈస్ట్- బొప్పాన భావ్‌కుమార్‌, మైలవరం- వసంత కృష్ణప్రసాద్, నందిగామ- జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను... గుంటూరు:- పెదకూరపాడు-శంకర్‌రావు, తాడికొండ- ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి- ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు- కిలారి రోశయ్య, వేమూరు- మెరుగ నాగార్జున, రేపల్లె- మోపిదేవి వెంకటరమణ, తెనాలి- అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల- కోన రఘుపతి, పత్తిపాడు- మేకతోటి సుచరిత, గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు ఈస్ట్- షేక్ మొహమ్మద్ ముస్తఫా, చిలకలూరిపేట- రజని, నర్సరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి- అంబటి రాంబాబు, వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు, గురజాల- కాసు మహేష్ రెడ్డి, మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

Advertisements

Latest Articles

Most Read