అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఖరారు అంశం గంట గంటకూ ఉత్కంఠ కలిగిస్తోంది. పోలింగ్‌కు ఇక కేవలం 25 రోజుల సమయమే ఉంది. ఈ పాటికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ము మ్మరంగా తిరగాల్సి ఉన్నా.. ఇంకా అన్ని స్థానాలకూ అభ్యర్థులు ఖరారు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ అభ్యర్థుల విషయంలో కొంత స్పష్టత ఉన్నా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పెట్టిన పేచీతో అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆది నుంచి తాను చెప్పిందే జరగాలన్నట్టు టీడీపీలో దివాకర్‌రెడ్డి రాజకీయాలు నెరుపుతున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలోని కొన్ని స్థానాల్లో దివాకర్‌రెడ్డి సూచించిన వారికే టికెట్లు కేటాయించారు. ఈ ఐదేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో కొందరు సిట్టింగులను మార్చాలని కొంతకాలంగా ఆయన పట్టుబట్టుతున్నారు. ఈ విషయమై పలుమార్లు చంద్రబాబు సమక్షంలో కూడా వివిధ సభల్లో మాట్లాడారు. కాగా, ఈ ఎన్నికల్లో తాను బరిలో నిలవడం లేదని, తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును అడిగి అనుమతి కూడా తీసుకున్నారు. ఈ మేరకు ఈనెల 6న చంద్రబాబు పవన్‌తోపాటు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డిని కూడా దగ్గరకు పిలిపించుకుని ప్రోత్సహించి పంపించారు. అలాగే జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ దాదాపు 11 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి.. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చా రు.
శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులెవరనేది టీడీపీ శ్రేణుకు స్పష్టమయ్యేలా సంకేతాలు పంపించారు. దీంతో ఎవరికి వారుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాలు కూడా ప్రారంభించారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో ఆ 11 స్థానాలకూ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని ఆశించారు. హిం దూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి తొమ్మిది స్థానాలు పెండింగ్‌లో ఉంచారు. దీంతో జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లోనే కా కుండా ఆశావహుల్లోనూ గంటగంటకూ ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేచీతో టీడీపీ అభ్యర్థుల ఖరారులో ప్రతిష్ఠంభన నెలకొంది. కొంతకాలం నుంచి అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కొన్ని స్థానాల్లో సిట్టింగులను మార్చాలని ఆయన అధిష్ఠానం వద్ద డిమాండు చేస్తూ వస్తున్నారు. వాటిలో అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల ఉన్నాయి. రాయదుర్గం విషయంలో కూడా కొంత గందరగోళం సృష్టించారు. నిజానికి ఈనెల మొదటి వారంలో చంద్రబాబు వద్ద జరిగిన సమీక్షలో రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు, అనంతపురం అర్బన్‌లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి, తాడిపత్రిలో అస్మిత్‌రెడ్డి, ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నియోజకవర్గాల్లో ప్రచారాలు చేసుకోవాలన్నట్లు సంకేతాలు పంపించారు.
దీంతోపాటు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం చేసుకోవాల్సిందింగా చెప్పి పంపించారు. అప్పటికి జిల్లాలో కేవలం కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల అభ్యర్థులు మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. ఆ సమయంలో రెండురోజుల క్రితం చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాలో ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ఖరారు చేస్తూ 9 స్థానాలు పెండింగ్‌లో ఉంచారు. ఇదే సమయమని భావించిన ఎంపీ జేసీ అదేపనిగా శుక్రవారం అమరావతికి వెళ్లి తన పరిధిలోని నాలుగు స్థానాల్లో సిట్టింగులను మార్చాలని, ఆ స్థానాల్లో తాను సూచించిన అభ్యర్థులకు సీట్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ అధిష్ఠానానికి గట్టిగా చెప్పి వచ్చారు. అలా ఇవ్వకపోతే తాము పోటీలో ఉండబోమని కూడా చెప్పినట్టు సమాచారం. శరవేగంగా మారుతున్న ఈ పరిణామాలపై అధిష్ఠానం కూడా ప్రత్యామ్నా య ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ నుంచి ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత సురేంద్రబాబును రంగంలోకి దించాలని జేసీ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.