వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య మిస్టరీగానే ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఐదు బృందాలను నియమించి విచారణ వేగవంతం చేసింది. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పర్యవేక్షణలో మరో ఏడు బృందాలు ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు 20 మంది సాక్షులను విచారించారు. ఏ అంశాన్నీ వదలకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పులివెందుల పోలీసుస్టేషన్‌కు వివేకా దగ్గరి బంధువులు ఆరుగురిని పిలిపించి విచారణ జరిపి వారి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. హత్య అనంతరం ఎన్ని గంటలకు వెళ్లారు? రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గుండెపోటుతో చనిపోయినట్లు ఎందుకు చెప్పారు? అన్న అంశాలపైనే ఈ విచారణ జరిగింది. భూ సెటిల్‌మెంట్లే ఘాతుకానికి కారణమా అన్న కోణంలోనూ విచారణ సాగుతుండగా.. పరమేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల పాటు జరిపిన సిట్‌ దర్యాప్తులో కీలకాంశాలను గుర్తించినట్లు ఆదివారం రాత్రి ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మీడియాకు తెలిపారు.

viveka 18032019

ఎవరీ పరమేశ్వర్‌రెడ్డి... పులివెందుల సమీపంలోని కసనూరుకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి సెటిల్‌మెంట్లు, భూ వివాదాలు పరిష్కరించేవాడు. వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని సమాచారం. ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్‌తో వివేకా గొడవపడినట్లు ప్రచారం సాగుతోంది. ఈ హత్యకు పది రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్‌ కొందరి వద్ద మాట్లాడినట్లు తెలిసింది. ఈ హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి ఆయన కుటుంబం అదృశ్యమవడం వెనక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ, ‘‘మృతుడు వైఎస్‌ వివేకా గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. వివేకానందరెడ్డి, గంగిరెడ్డి, మల్లయ్య రవికుమార్‌, డ్రైవర్‌ ప్రసాద్‌లతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చారు. ఇంటికి వెళ్లగానే డ్రైవర్‌ను పంపి వివేకా నిద్రపోయారు. పీఏ కృష్ణారెడ్డి ఉదయాన్నే 5.30 గంటలకు ఇంటికి వచ్చారు. అరగంట దాటినా వివేకా నిద్ర లేవకపోవడంతో కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఆయన భార్య సౌభాగ్యమ్మకు ఫోన్‌ చేశారు. రాత్రి ఆలస్యంగా రావడంతో నిద్రపోతున్నారని, లేపొద్దని తెలిపింది. కొద్ది సేపటి తర్వాత వాచ్‌మెన్‌తో కలిసి కృష్ణారెడ్డి బెడ్‌రూం తలుపు తీసి లోపలికి వెళ్లగా.. రక్తం కనిపించింది. బాత్‌రూంకు వెళ్లి చూస్తే మృతదేహం కనిపించింది. మాజీ ఎంపీ అవినా్‌షరెడ్డికి, రాఘవరెడ్డికి పులివెందుల సీఐకి వివేకా గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.

viveka 18032019

వెంటనే సీఐ అక్కడికి చేరుకోగా కృష్ణారెడ్డి, వాచ్‌మెన్‌ రంగన్న, ఇనయతుల్లా, దొడ్లవాగు శంకర్‌రెడ్డి, ఎర్రా గంగిరెడ్డి, వైఎ్‌స.మనోహర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్‌ నాయక్‌, వైఎ్‌స.అవినా్‌షరెడ్డి ఇంకా కొందరు నేరస్థలం వద్ద ఉన్నారు. రక్తపు మరకలున్న దుప్పటిని మార్చేయడంతో పాటు మృతుని గాయానికి కట్టు కట్టి ఉంది. వివేకా వాంతి చేసుకొని కమోడ్‌పై పడగా గాయాలైనట్లు సీఐకి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బలవంతంగా దుండగులు ఇంట్లోకి వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. పోస్టుమార్టం అనంతరం వైద్యులు ఇది హత్యగా నిర్ధారించారు. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు డీఐజీ నేర స్థలానికి వెళ్లి వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, భార్య సౌభాగ్యమ్మలను విచారించారు. అనంతరం పీఏ కృష్ణారెడ్డి వచ్చి నేరస్థలంలో దొరికిందంటూ వివేకా రాసిన లేఖను పోలీసులకు అప్పగించారు. ఉదయం ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదని డీఐజీ ప్రశ్నించగా.. డ్రైవర్‌ ప్రసాద్‌కు ప్రాణ హాని ఉందని, తాను వచ్చేంత వరకు లెటరు నీ దగ్గరే ఉంచమని వివేకా కుమార్తె చెప్పిందని వెల్లడించాడు. వివేకా రాసే శ్యాంపిల్‌ హ్యాండ్‌రైటింగ్‌ జతచేసి లేఖను నిపుణుల అభిప్రాయం కోసం పంపాం. సిట్‌ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 మంది సాక్షులను విచారించారు. సిట్‌ ఆధ్వర్యంలో ఐదు బృందాలు, జిల్లా పోలీసు సారథ్యంలో ఏడు బృందాలు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా హత్యను గుండెపోటుగా చిత్రీకరించడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఎస్పీ వెల్లడించారు.

 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంప్ జిలానీలు అటూఇటూ మారుతూ పార్టీలనే కాదు.. ప్రజలనూ తికమక పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరేందుకు జగన్ నివాసానికి వెళ్లిన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పార్టీ అధినేతకే ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు ప్రయత్నించిన కొణతాల అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఆశించారు. అయితే చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన అనుచరులైన ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్లు, బెహరా భాస్కరరావు, పోతు సత్యనారాయణ, బొనాల శ్రీనివాసరావు తదితరులతో శనివారం లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిశారు.

konathala 17032019

అరగంట భేటీ తర్వాత తన వారిని ఒక్కొక్కరినీ పరిచయం చేశారు. అనంతరం జగన్ అందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అయితే కొణతాల రామకృష్ణ మాత్రం పార్టీ కండువా కప్పుకునేందుకు నిరాకరించి జగన్‌కు ఝలక్ ఇచ్చారు. గతంలో తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తే చాలని కోరారు. అవన్నీ తర్వాత చూసుకుందామని జగన్ అన్నప్పటికీ కొణతాల సమ్మతించలేదు. పార్టీలో చేరకుండానే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి వెళ్లిపోవడంతో జగన్ అవాక్కయ్యారు. అయితే తాను ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించేందుకే తాను జగన్‌ని కలిశానని, పార్టీ చేరేందుకు కాదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

konathala 17032019

2014లో వైపీపీలో కీలకనేతగా ఉన్న ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రాజీనామా చేశారు. అయితే ఆయన అప్పట్లో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాదు రెండ్రోజుల క్రితం కూడా కొణతాల సైకిలెక్కుతారని వార్తలు వినవచ్చాయి. అయితే ఏం జరిగిందో ఏమోకానీ సడన్‌గా ఆయన సొంతగూటికి రావాలని నిర్ణయించుకున్నారు. మరో పక్క, మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీలో చేరారు. ఆదివారం (17-03-2019) కాకినాడలో జరిగిన టీడీపీ ప్రచార సభలో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు హర్షకుమార్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు హర్షకుమార్. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరానన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పేరు మార్చుకున్నారు. నిజంగా కాదు.. ట్విటర్‌లో. సోషల్ మీడియాలో మై భీ చౌకీదార్ పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక రోజు గడవక ముందే అంటే ఆదివారం ట్విటర్‌ హ్యాండిల్ పేరును నరేంద్ర మోదీ నుంచి చౌకీదార్ నరేంద్ర మోదీగా మార్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే) అంటూ బీజేపీ ప్రచారానికి ఊపు తెచ్చిన ప్రధాని మోదీ.. తాజాగా తన ట్విట్టర్ ఖాతా పేరును కూడా 'చౌకీదార్'గా మార్చేశారు. మోదీని ఫాలో అవుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, జేపీ నడ్డా, బీజేపీ ఐటీ ఇన్‌చార్జి అమిత్ మాలవియా, బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ భగ్గా కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలకు చౌకీదార్ ట్యాగ్ తగిలించుకున్నారు.

jagna list 17032019

పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో చౌకీదార్ పేరును తగిలించుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, మోదీ చౌకీదార్‌గా పేరు మార్చుకోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొంగలంతా మోదీ ఇంటి పేరు(చౌకీదార్) పెట్టుకోవడం చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యం కలుగుతోందని బీజేపీ నేతలను ఉద్దేశించి సెటైర్ వేశారు. కాగా, అవినీతిపై వ్యతిరేక పోరాటానికి పిలుపునిస్తూ శనివారం 'మై భీ చౌకీదార్' క్యాంపెయిన్‌ను మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

jagna list 17032019

"మీ కాపలదారుడు నిబద్దతతో ఉన్నాడు.. దేశానికి సేవ చేస్తున్నాడు. అయితే నేను ఒంటరిగా లేను. దేశంలో అవినీతిపై, సామాజిక సమస్యలపై పోరాడుతున్న ప్రతీ ఒక్కరు చౌకీదారే(కాపలదారు). దేశ పురోగతి కోసం పాటుపడుతున్న ప్రతీ ఒక్కరూ చౌకీదారే. "— అని ప్రధాని మోదీ శనివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందేశానికి మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను జత చేశారు. మోదీని ప్రతిపక్షాలు తరచూ చౌకీదార్‌ అనే పేరుతో ఎద్దేవా చేస్తుంటాయి. దీంతో ఆయన శనివారం ‘మై భీ చౌకీదార్‌’ (నేనూ కాపలాదారునే) పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా ట్విటర్ పేరు మార్చుకోవడం గమనార్హం.

ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటిస్తుండటం.. టికెట్ ఆశించి దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు పక్క చూపులు చూస్తుంటే.. కొందరు మాత్రం రెబర్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్‌లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా.. తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలకు కూడా టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ తూర్పు నుంచి వైసీపీ టికెట్ ఆశించిన యలమంచిలి రవికి షాక్ తగిలింది. రవికి కాకుండా బొప్పన భవ్ కుమార్‌కు సీటు ఖాయం చేశారు. దీంతో యలమంచిలి రాజకీయ భవిష్యత్‌పై సందిగ్థత ఏర్పడి

yalamanchali 17032019

యలమంచిలి రవి ఆదివారం తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించగా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుచరులు ఒత్తిడి తెచ్చారట. ఇదే సమయంలో జనసేన తరపున టికెట్ కేటాయిస్తామని.. ఈనెల 21న నామినేషన్ చేయాలని జనసేన అధిష్టానం నుంచి ప్రతిపాదన వచ్చిందట. ఈ ఆఫర్‌ను రవి తిరస్కరించినట్లు తెలుస్తోంది. చివరికి అనుచరుల ఒత్తిడి, వారి అభిప్రాయం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న నామినేష్ వేయడం ఖామయని అనుచరులు చెబుతున్నారు.

yalamanchali 17032019

యలమంచిలి రవి 2009లో విజయవాడ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. విజయవాడ తూర్పు టికెట్ ఆశించారు. కానీ అప్పటికే గద్దే రామ్మోహన్‌కు టికెట్ కేటాయించగా.. భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో పార్టీ కోసం పనిచేశారు. గతేడాది అధిష్టానం తీరుపై అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తర్వాత అనుచరులతో సమావేశమై జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు నుంచి రవి టికెట్ ఆశించగా.. స్థానిక సర్వే రిపోర్టు ఆధారంగా ఆ స్థానాన్ని బొప్పన భవ్ కుమార్‌కు కేటాయించారు. దీంతో రవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read