వంగవీటి రాధాకృష్ణ బుధవారం టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని చెప్పారు. విజయవాడలో పేద ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. అందుకే టీడీపీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. తన వ్యక్తిగత ప్రతిష్ట గురించి కాకుండా పేదల కోసం నిందలు మోయడానికి సిద్ధపడి అడుగులేస్తున్నానని వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. నియంత చేతుల్లోకి రాష్ట్ర ప్రజల భవిష్యత్ వెళ్లకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని జగన్‌ను ఉద్దేశించి రాధా పరోక్ష విమర్శ చేశారు. రాధా ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా టీడీపీలో చేరిక ఖాయమైంది. వైసీపీకి రాజీనామా చేసిన ఐదు నెలల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా తొలుత కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేశారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు.

modi 12032019

ఈ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాధా భావించారు. అయితే, రాధాకు టికెట్‌ ఇవ్వలేమని వైసీపీ అధిష్ఠానం ఆరు నెలల క్రితమే తేల్చి చెప్పేసింది. సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మల్లాది విష్ణును నియమించింది. వైసీపీ అధిష్ఠానం ధోరణి.. పొమ్మనకుండా పొగబెట్టినట్లు ఉండటంతో రాధా ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది అక్టోబరులో రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరిలో విలేకరుల సమావేశం నిర్వహించిన రాధా.. వైసీపీలో తనకు ఎదురైన అవమానాలను వెల్లడించారు. తన తండ్రి రంగా అంటే వైసీపీ అధినేత జగన్‌కు ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాధా వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ నేతలు పలుమార్లు ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాలపై స్పందించిన రాధా తన అనుచరులు, రాధా-రంగా మిత్రమండలి సభ్యులతో పలుమార్లు చర్చించారు. భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవ్వడంతో కొద్దిరోజులపాటు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

modi 12032019

చివరికి తన సన్నిహితుల సూచన మేరకు సోమవారం అర్ధరాత్రి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి టీడీపీలో చేరాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తానని చంద్రబాబుతో రాధా పేర్కొన్నట్లు సమాచారం. వైసీపీలో తనకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని, అనూహ్యరీతిలో టీడీపీ నుంచి తనకు మంచి ఆదరణ లభించిందని రాధా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. టీడీపీకి తోడు ఉంటా.. ప్రస్తుత ఎన్నికలు అరాచకానికి.. అభివృద్ధికి, అహంకారానికి.. అనుభవానికి మధ్య జరుగుతున్నాయని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని టీడీపీకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాధా ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఈ ప్రకటనలో టీడీపీలో తాను చేరడానికి గల కారణాలను వివరించారు. ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి చేతుల్లో పడకుండా చూడాలన్న లక్ష్యంతోనే తాను టీడీపీ వైపు మొగ్గు చూపానన్నారు. బెజవాడ నగరంలో ప్రతిసామాన్యుడికీ ఇళ్ల పట్టాలు అందించాలన్న తన తండ్రి దివంగత రంగా ఆశయాలను సఫలీకృతం చేసిన చంద్రబాబుకు రాధా కృతజ్ఞతలు తెలిపారు.

 

పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ టికెట్‌ విషయంలో అధిష్ఠానానికి తన వాదన వినిపించేందుకు భార్యతో కలసి హైదరాబాదులోని లోట్‌సపాండ్‌లో వున్న వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ఆయనకు లోపలకు అనుమతి అనుమతి లభించలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గేటు బయట వేచివున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తనను కాదని పూతలపట్టు నియోజకవర్గంలో వేరొకరికి సీటు ఇస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడంతో అధిష్టానం వద్ద్దే తేల్చుకుందామని సునీల్‌కుమార్‌ మంగళవారం లోట్‌సపాండ్‌కు చేరుకున్నాడు. మామూలుగా అయితే పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంది. సునీల్‌తో పాటు వచ్చిన ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, నాయకులను లోనికి అనుమతించిన సెక్యూరిటీ సునీల్‌ను మాత్రం లోనికి వెళ్లకుండా అడ్డుకుంది. 

sunil 13032019 1

దీంతో పార్టీ అధినేత జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరుతూ తనకు తెలిసిన వారి ద్వారా సమాచారాన్ని లోపలికి పంపేందుకు పలుమార్లు ప్రయత్నించిన సునీల్‌ విఫలమైనట్లు సమాచారం. జిల్లా పార్టీ వ్యవహారాలను చూస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపలకు వెళుతూ సునీల్‌కుమార్‌ వంక చూసీచూడనట్లు వెళ్లిపోవడంతో ఆయన మరింత ఆవేదనకు గురైనట్లు తెలిసింది. తనకు జరిగిన అవమానాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఓ దేశలో ఆయన కంటినుంచి నీరు రావడం.. ఆయన అనుచరులను కలచివేసింది. కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా.. సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకే అన్యాయం చేస్తే ఎలా..? అంటూ ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. తన ఆవేదనను మంగళవారం రాత్రి ఆయన ఫేస్‌బుక్ లైవ్ ద్వారా పూతలపట్టు వైసీపీ కార్యకర్తలకు వివరించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారో.. ఆయన మాటల్లోనే..

sunil 13032019 1

‘పూతలపట్టు వైసీపీ కార్యకర్తలకు అభిమానులతో కొన్ని విషయాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. 2014కు ముందు నేను ఎవరినో మీకు తెలీదు. కానీ నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించారు. నాకు సీటు ఇప్పించిన వారికిగానీ.. వైసీపీకి కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను తేలేదు. నా ప్రవర్తనతో జగన్‌కు కూడా ఎలాంటి చెడ్డ పేరు తేలేదు. కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ అని ఏదేదో అంటున్నారు. ఎవరినీ కలవలేదంటున్నారు. కానీ పార్టీ అంటే నాకు విపరీతమైన అభిమానం.. పిచ్చి.. కొన్ని పరిస్థితుల వల్ల టికెట్ రావచ్చు.. రాకపోవచ్చు.. టికెట్ రానివ్వండి.. రాకపోనీయండి.. మీ అందరి మనిషిగా ఉంటే చాలు.. మనతో పాటు అయిదేళ్లు కలిసి బతికాడు.. అని గుర్తుంచుకుంటే చాలు.. పింఛన్లు రానివాళ్లను చూసినా.. రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తే అందరికీ మంచి చేయాలని అనుకున్నా.. ఎమ్మెల్యే అయ్యాక ఏదో ఒక మంచి పని చేసి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆశ ఉండేది. కానీ ఆ అవకాశం నాకు మళ్లీ వస్తుందో.. లేదో తెలీదు. దేవుడు ఆశీస్సులు ఉంటే నా కల నెరవేరుతుంది...’.. అని సునీల్ కుమార్ కన్నీటిపర్యంతమయ్యారు.

 

 

మళ్లీ గెలుస్తామని బీజేపీ చెబుతోంది. కానీ కమలం గెలుపు అంత ఈజీయా? ఎందుకంటే 2014లో బీజేపీకి తోడున్న పార్టీలు ఇప్పుడు లేవు. బీజేపీ వెంట నడిచిన నాయకులూ లేరు. కమలనాథులకు అండగా నిలిచిన వర్గాలు ఇప్పుడు దూరమయ్యాయి. అంతకు మించి విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. ఇదే కమలాన్ని కలవరపెడుతోందా? ఈసారి అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకోవడం కష్టమనే చెప్పాలి. 2014లో భారీ మెజారిటీతో సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకానొక సమయంలో బీజేపీ దాని భాగస్వామ్య పార్టీలు ఏకంగా 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. కానీ ఈ రెండేళ్లలో పరిస్థితి మారిపోయింది.

modi 12032019

బీజేపీ దూకుడు కొనసాగుతున్న సమయంలో పంజాబ్‌లో చుక్కెదురైంది. అక్కడ అకాలీదళ్ ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీకి అధికారాన్ని దక్కనివ్వలేదు. ఇక కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి.. కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పూర్తిగా ఈక్వేషన్స్ మారిపోయాయి. ప్రస్తుతం బీజేపీ భాగస్వామ్య రాష్ట్రాలు 15 అధికారంలో ఉండగా.. వీటిలో 5 రాష్ట్రాల్లోనే బీజేపీ సొంతంగా అధికారం చేపట్టింది. మిగతా 10 రాష్ట్రాల్లో సంకీర్ణ సర్కారులే ఉన్నాయి. అప్పుడు మోదీని గద్దెనెక్కించిన రాష్ట్రాలే ఇప్పుడు కమలనాథులను టెన్షన్ పెడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయి జారటమే కాదు.. ఎన్డీయేకి కీలకంగా వ్యవహరించిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు దూరంగా జరిగాయి.

modi 12032019

ఏపీలో టీడీపీ పొత్తుతో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ రెండు స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. అయితే నవ్యాంధ్రకు అన్యాయం చేయడంపై మండిపడ్డ చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు విపక్ష కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ సొంతంగా స్థానాలు గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. 2016 తరువాత జరిగిన ఏ బై పోల్‌లోనూ బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు. ఇదే బీజేపీని కలవరపెడుతోంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలపై మోదీ దృష్టి పెట్టారు.

 

 

పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. సుమారు 130 నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన.. పెండింగ్‌లో ఉన్న దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని యోచిస్తున్నారు. పెండింగ్‌లో ఉంచిన నియోజకవర్గాల నేతలను పార్టీ అధిష్ఠానం అమరావతికి పిలిపించింది. యనమల, సుజనాచౌదరి ఆధ్వర్యంలోని రెండు సమన్వయ కమిటీల ద్వారా ఆయా నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను సేకరించారు. సమయం తక్కువగా ఉండటంతో త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వైసీపీ, టీడీపీ కసరత్తు ముమ్మరం చేశాయి.

cabinet 1203219

అయితే... ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం టీడీపీలోని ఐదుగురు మంత్రుల సీట్లకు ఎసరు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావులను ఎంపీలుగా పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. అయితే.. ఎంపీలుగా పోటీ చేయడానికి ఈ ఇద్దరు మంత్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ప్రచారంలో ఉండగానే శిద్దా అనుచరులు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఆయన ఇంటి ముందు బైఠాయించారు. దీంతో అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు శిద్ధా సిద్దమయ్యారు. గంటాది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. విశాఖ ఎంపీగా గంటా శ్రీనివాస్‌ పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చని పక్షంలో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది.

cabinet 1203219

ఒంగోలు ఎంపీగా మంత్రి శిద్దాను పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. ఎంపీగా పోటీకి మంత్రి శిద్దా రాఘవరావు ఆసక్తి చూపలేదు. దర్శి సీటు తమ కుటుంబానికి ఇవ్వాలని మంత్రి శిద్దా కోరుతున్నారు. ఇప్పటికే మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. మంత్రి కాల్వకు టికెట్‌ ఇవ్వొద్దని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు. కొవ్వూరులో మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ కోడెలను కూడా నరసరావుపేట నుంచి ఎంపీగా బరిలో నిలిపే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోడెల భావిస్తున్నట్లు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read