జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు, ఎన్నికల ముందు నుంచి కొంచెం స్లో అయ్యింది. ఎన్నికల్లో జగన్ బిజీగా ఉండటంతో, ఆయన విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే తరువాత ఆయన ఎన్నికల్లో గెలవటంతో, తాను ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి అని చెప్తూ, ప్రతి వారం ఏదో ఒకటి చెప్పి, శుక్రవారం విచారణకు హాజరు కాకుండా ఉంటున్నారు. అయితే ఈ కేసు నెమ్మదిగా నీరు గారి పోతుంది అని అందరూ భావిస్తున్న సమయంలో, మూడు రోజుల క్రితం, సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇక వారం వారం మినహాయింపు ఇవ్వటం కుదరదని, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ప్రతి వారం కోర్ట్ కు రావాల్సిందే అని, వచ్చే శుక్రవారం, 10వ తారీఖు కచ్చితంగా కోర్ట్ కు హాజరు కావలి అంటూ, సిబిఐ కోర్ట్, ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ క్యాంప్ లో మళ్ళీ ఆందోళన మొదలైంది. సియం హోదాలో ఉంటూ కోర్ట్ కు వెళ్తే, అది నైతికంగా తప్పు అని భావిస్తున్నారు. గతంలో లాలూ, మధు కోడా మాత్రమే అలా చేసారని, ఇప్పుడు జగన్ మూడో వారు అవుతారని, ప్రతిపక్షాలకు అవకాసం ఇచ్చినట్టు అవుతుందని, భావిస్తున్నారు.
అయితే, ఈ షాక్ నుంచి తెరుకోక ముందే, ఇప్పుడు మాజీ మంత్రి ప్రసాదరావుకు సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇది కూడా జగన్ అక్రమ ఆస్తుల కేసులోనే. ధర్మాన పై, సుప్రీం కోర్ట్ దాఖలైన కేసు ఎంత వరుకు వచ్చిందో చెప్పాలని, సిబిఐ ని కోరారు, హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి బీవీ మధుసూధన్ రావు. ధర్మాణ పై కేసును పరిగణనలోకి తీసుకోవడం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు, ఏమి చేసింది, నిలిపి వేసిందా, లేదా అని చెప్పాలని కోర్ట్ కోరింది. ఈ వివరాలు తమకు జనవరి 7వ తేదీలోపు ఇవ్వాలని, సిబిఐని కోర్ట్ ఆదేశించింది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి పెట్టిన వాన్ పిక్ చార్జ్ షీట్ లో, అప్పటి రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు కూడా పెట్టిన సంగతి తెలిసిందే.
ధర్మాన క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో ఆయన ప్రాసిక్యూషన్కు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవటంతో, సీబీఐ కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే తరువాత ప్రభుత్వం మారటం, ధర్మానకు మంత్రి పదవి పోవటంతో, ఆయన పాత్ర పై కూడా తేల్చాలి అంటూ, సీబీఐ మెమో దాఖలు చేయగా, సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే దీన్ని ధర్మాన హైకోర్టులో సవాలు చెయ్యటంతో, హైకోర్ట్ కొట్టేసింది. హైకోర్ట్ ఇచ్చిన ఈ ఉత్తర్వులను సిబిఐ సుప్రీం కోర్ట్ లో సవాలు చేసింది. అయితే ఈ పిటీషన్ చాలా రోజులుగా పెండింగ్ లో ఉండటంతో, ఆ పిటీషన్ ఏ దశలో ఉందొ చెప్పాలి అంటూ సిబిఐ కోరటంతో, ఇప్పుడు ధర్మాన పై ఒత్తిడి పెరుగుతుంది. ఉన్నట్టు ఉండి కేసులు స్పీడ్ అవ్వటంతో, ధర్మానకు మళ్ళీ అందోళన మొదలైంది.