గతంలో అమరావతి నిర్మాణం కోసం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విరాళలతో ఏదో కట్టేయాలని కాదు, ప్రజలు అందరూ భాగస్వామ్యం అవ్వాలని, ఈ అమరావతికి నేను కూడా ఒక పది రూపాయలు ఇచ్చాను, రాష్ట్ర రాజధానికి నేను నా వంతు సహాయం చేశాను అనే భావన ప్రజలకు కలగటానికి, అప్పటి పాలకులు ఇలా చేసారు. మై బ్రిక్, మై అమరావతి పేరుతొ, 10 రూపాయల చొప్పున ఇటుక పెట్టి, సామాన్యులు కూడా కొనుక్కుని, రాజధానిలో నా భాగస్వామ్యం కూడా ఉంది అని అనుకునేలా చేసారు చంద్రబాబు. అప్పట్లో చాలా సంస్థలు కూడా స్వచ్చందంగా చందాలు పోగీసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. కొత్త రాష్ట్రం, రాజధాని కట్టుకోవాలి, ఇలా అనేక విధాలుగా అలోచించి, విరాళాల రూపంలో సహాయం చేసారు. ఇదే కోవలో, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలు కూడా, ఏపి రాజధాని పేరిట విరాళాలు ఇచ్చాయి. మొత్తం 2 కోట్ల 52 లక్షల 47 వేల 259 రూపాయలను 2014 అక్టోబరు 24వ తేదీన, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఏబీఎన్ ఆర్కే ఇచ్చారు.

rk 05012020 2

అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుంది, పరిపాలన మొత్తం వైజాగ్ కు వెళ్తుంది అంటూ, హడావిడి చేస్తుంది. ఇప్పటికే కమిటీ రిపోర్ట్ లు ఈ విధంగా వచ్చాయి. మరో కమిటీ వేసారు. అది కూడా రాగానే, క్యాబినెట్, అసెంబ్లీ, అఖిలపక్షం పెట్టి, మూడు రాజధానుల నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో అమరావతిని చంపేసే పరిస్థితి తెచ్చారు. అప్పట్లో అమరావతికి విరాళాలు ఇచ్చిన వారు అందరూ, ఇప్పుడు తమ విరాళాల పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. తాము అప్పట్లో ఒక మంచి రాజధాని కోసం, అమరావతికి తమ భాగస్వామ్యం కూడా ఉండాలని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చామని, అంతే కాని చంద్రబాబుకు కాదని, మరి, ఇప్పుడు మా విరాళాలు సంగతి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

rk 05012020 3

ఇదే విషయం పై ఏబీఎన్ కు విరాళాలు ఇచ్చిన వారు కూడా తమను ప్రశ్నిస్తున్నారాని, అప్పట్లో 50 వేలు రూపాయలు ఇచ్చిన ఒక దాత, ఇప్పుడు మా విరాళం ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అని అడుగుతున్నారని, ఏబీఎన్ వీకెండ్ కామెంట్ లో ఆర్కే చెప్పారు. అయితే, అలాంటి వారికి నా దగ్గర సమాధానం లేదని, తమ సంస్థని నమ్మి, అప్పట్లో ఏపి రాజధానికి విరాళాలు ఇచ్చిన వారందరికీ, నేను క్షమాపణ చెప్తున్నానని, ఇంతకు మించి నా దగ్గర కూడా ఎలాంటి సమాధానం లేదు అంటూ, ఆర్కే, తనకు విరాళం ఇచ్చిన అందరికీ, వీకెండ్ కామెంట్ బై ఆర్కే లో, బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇది ఒక్క ఆర్కే సమస్య కూడా కాదు, విరాళాలు ఇచ్చిన అందరికీ, ఇప్పటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది కూడా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read