విశాఖను మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటయిన మెడ్‌టెక్ జోన్‌ను రేను రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్‌కు సాగర తీరం కేంద్రం కావడం విశేషం. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్ జోన్‌ను ఏర్పాటు చేశారు. మెడికల్ డిస్పోజబుల్స్, వైద్య రంగంలో వినియోగించే యంత్ర పరికరాలు, సర్జికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఇంప్లాంట్స్, వ్యాధి నిర్ధారణతో పాటు ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత. అయితే ఇక్కడే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించింది.120 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇదే సమావేశానికి, అతిధిగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ వచ్చారు. ఆ సమావేశంలో పాల్గున్న తరువాత, అక్కడ ఏర్పాటైన కంపెనీలు గురించి ట్వీట్ చేసారు.
ఇది సెహ్వాగ్ ట్వీట్ "AMTZ-Pioneer Medical Equipment industrial park of the world dedicated @ Vizag on 13th Dec... 14 lakh Sq.ft built in 342 days @ 340 sq.ft/hour.. AMTZ-hosts WHO global forum on Med devices 1st time in India with participation of 100 countries-it’s a giant step for Indian MedTech sector"... సూది నుంచి సీటీ స్కాన్ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్‌టెక్ జోన్’, మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో ఏర్పాటైతే, మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా, అక్కడికి అతిధిగా వచ్చి, మన రాష్ట్రం కాకపోయినా, అక్కడ ఏర్పాటైన కంపనీలు గురించి, అందరికీ తెలిసేలా ట్వీట్ చేసిన సెహ్వాగ్ కు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి.
విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం మదీనాబాగ్ ప్రాంతంలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మెడ్‌టెక్ జోన్లో ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఈ జోన్లో మొత్తం 250 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అవన్నీ ఏర్పాటైతే మొత్తం 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అంచనా. భారత్ ఏటా రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని... ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో మెడ్‌టెక్ జోన్‌ను ఏర్పాటు చేసారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, విశాఖలో ఫర్మా సిటీ పెట్టి, అనేక కంపనీలను తీసుకొచ్చారు. ఇప్పుడు మెడ్ టెక్ జోన్ తో, అనేక వైద్య పరికరాల తయారీ కంపెనీలు రానున్నాయి.