ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతా, ఏపిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబుని ఇబ్బంది పెడతా, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ ఏపి నాశనం కోరుకుంటున్న కేసీఆర్, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో మోడీ, అమిత్ షా ఆదేశాల ప్రకారం, స్కెచ్ గీసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో నివాసం ఉంటూ, ఏపిలో పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్న పవన్, వీకెండ్ లో హైదరాబాద్ వీల్లి హాజరు వేయించుకునే జగన్, ఇద్దరూ ఏపిలో ప్రతిపక్షంగా ఉన్నారు. ఫ్యామిలీని వదిలేసి, 68 ఏళ్ళ వయసులో, రాష్ట్రాన్ని నెంబర్ వన్ చెయ్యాలని, పోలవరం పూర్తవ్వాలని, అమరావతి నెంబర్ వన్ సిటీ అవ్వాలని, పేదల కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ, హైదరాబాద్ స్కెచ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే, జగన్, పవన్ ని కలిపి, చంద్రబాబు డీ కొట్టాలనే అమిత్ షా స్కెచ్ విఫలమైన సందర్భంలో, కేసీఆర్ రంగంలోకి దిగినట్టు సమాచారం.

kcr 19122018

మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకు, జగన్, పవన్ లని కలిపి, చంద్రబాబుని ఓడించే డ్యూటీ కేసీఆర్ తీసుకున్నారని తెలుస్తుంది. జగన్, పవన్ ఇద్దరికీ కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. కేసీఆర్ ఏపి ప్రజలను కుక్కలు, రాక్షసులు అన్నా సరే, కేసీఆర్ ని చూస్తూ మాత్రం, వీరిద్దరికీ ఎంతో అభిమానం. అందుకే, జగన, పవన్ లను కలిపే డ్యూటీ కేసీఆర్ కు అప్పగించినట్టు తెలుస్తుంది. మోడీ, షా వ్యూహంలో భాగంగా, కేసీఆర్ రంగంలోకి దిగి, ఏపిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జగన్, పవన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న స్ఫర్థలను తొలగించి ఒకే వర్గంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైకాపా లేదంటే జనసేన పార్టీకి వెళ్లి టీడీపీకి నష్టం చేకూరుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తుంది.

kcr 19122018

వీరిద్దరికి తోడు వామపక్ష పార్టీలను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ఏర్పాటు చేస్తే చంద్రబాబు ఓటమి ఖాయమని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తన కంట్రోల్ లో ఉంచుకోవచ్చని, అక్కడ మోడీ, షా దగ్గర మంచి మార్కులు కొట్టేయోచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా డైరెక్ట్ గా కేసీఆర్ ఏపి రాజకీయాల్లోకి రావాలని భావించారు. అయితే, కేసీఆర్ నేరుగా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినా ఆ పార్టీ పై ప్రజలు వ్యతిరేకత చూపి ఓటు వేయాలనుకున్న వారు కూడా వేయకపోవచ్చని ఢిల్లీ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో కేసీఆర్ ప్రచారాన్ని వైకాపా, జనసేన అంగీకరించవని వారంటున్నారు. అందుకే కేసీఆర్ ని, జగన్, పవన్ మధ్య స్నేహం కుదిర్చి టీడీపీని ఇరుకునపెట్టే వ్యూహం రచించారు. మోడీ, అమిత్ షా, కేసీఆర్, జగన, పవన్, వీరందరి వ్యూహాలు బాగానే ఉన్నాయి కాని, ఏపి ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారో, ఎవరు ఉంటే వారు సేఫ్ గా ఉంటారో, ఎవరు ఉంటే అమరావతి పూర్తి అవుతుందో, ఎవరు ఉంటే పోలవరం పూర్తి అవుతుందో, తుఫానులు వస్తే వాటిని నుంచి కోలుకునేలా ఎవరు భరోసా ఇస్తారో, ఇవన్నీ ఏపి ప్రజలు బేరీజు వేసుకుంటారని, ఢిల్లీ పెద్దలకు, హైదరాబాద్ బ్యాచ్ కి తెలియాలి. చంద్రబాబుని ఓడించాలాన్నా, గెలిపించాలాన్నా, చెయ్యల్సింది ఏపి ప్రజలు... ఢిల్లీ వ్యూహాలు కాదు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read