ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి ఐటీ సోదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు... ఏపీలోని పలువురు టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. కొన్ని రోజుల క్రిందట సియం రమేష్ పై దాడులు చేసారు. మొత్తం వాతావరణం అంతా టెన్షన్ లో దింపుతున్నారు. ఆపరేషన్ గరుడలో చెప్పిన ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా, షడ్యుల్ ప్రకారం జరుగుతుంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఐటీ దాడులు కాకుండా, ఈ సారి ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి... చంద్రబాబు, తెలుగుదేశం టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపిలో కాకుండా, తెలంగాణాలో చేసారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని నాగార్జున హిల్స్లోగల సుజనాచౌదరికి చెందిన ఇల్లు, ఆయనకుగల రెండు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా... ఈ సోదాలు రెండురోజులపాటు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సోదాల్లో కంపెనీలకు చెందిన కీలక ప్రతాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, మోడీ పై చంద్రబాబు చేస్తున్న రాజకీయ పోరాటంతో, గుజరాత్ బ్రదర్స్ మోడీ, షాలు చంద్రబాబు పై కక్ష పెంచుకున్నారు.
గత మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు అంతు చూస్తాం, చంద్రబాబుని జైల్లో పెడతాం, చంద్రబాబుని పదవిలో నుంచి దించేస్తాం అంటూ బహిరంగంగానే బీజేపీ నేతలు మాట్లాడటం చూసాం. దానికి తగ్గట్టుగానే కోర్ట్ ల్లో కేసులు వేసినా, ఏమి లాభం లేకపోవటంతో, ఇప్పుడు తమ చేతుల్లో ఉన్న ఐటి, ఈడీ, సిబిఐ లకు ఢిల్లీ పెద్దలు పని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ మీద డైరెక్ట్ గా దాడి చేస్తే, అది దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యి, అన్ని విపక్షాలు మరింత బలంగా ఏకం అయ్యే అవకాసం ఉండటంతో, తెలుగుదేశం పార్టీలో ఆర్ధికంగా బలంగా ఉన్న నేతల పై, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యాపార వేత్తల పై, దాడులకు ఢిల్లీ నేతలు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా, ఇప్పటికే విజయవాడ, గుంటూరు, వైజాగ్ లో దాడి చేసిన ఐటి అధికారులు, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీల పై పడ్డారు.