తెలుగు గడ్డ పై అడుగు పెట్టిన వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి, ఆంధ్రాను అన్యాయం చేసిన పాశ్చాత్తాపం సోనియా గాంధీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి, ఏపిలో అడ్రస్ లేకుండా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సందర్భంలో, కాంగ్రెస్ చేసిన అన్యాయం, మోడీ సరి చేస్తారని ఏపి ప్రజలు నమ్మారు. కాని మోడీ నమ్మక ద్రోహం చేసారు. నమ్మించి గొంతు కోశారు. ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చి చెప్పేశారు. రాష్ట్రానికి అన్యాయం చెయ్యటమే కాక, రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలనే కుట్ర కూడా పన్నటంతో, చంద్రబాబు దేశ వ్యాప్తంగా మోడీ పై యుద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంలో, తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సోనియా గాంధీ, ఏపి టాపిక్ తోనే, తన స్పీచ్ మొదలు పెట్టారు.
ఏపికి అన్యాయం చేసాం, మేము సరిచేస్తాం అనే భావం, ఆమె స్పీచ్ లో కనిపించింది. ‘‘ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ప్రతి తల్లీ తన సంతానం బాగుపడాలని కోరుకుంటుంది. నేనూ అలాగే కోరుకున్నా. కానీ, మీ జీవితాలు, బతుకులు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది." అంటూ సోనియా చెప్పారు. తెలంగాణా ఇస్తామని మాటిచ్చాం,రాజకీయంగా మాకు నష్టం జరుగుతుంది అని తెలిసినా, ఆ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణా ఇచ్చాం. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా ఇస్తామని మట్టిస్తున్నాం అని, ఏపి ప్రజలకి సందేశం ఇచ్చారు.
"తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కష్టతరమైన సమస్య అనిపించింది. అప్పుడు ఆంధ్ర్రా, తెలంగాణ ప్రజల బాగోగులు రెండూ నా కళ్ల ముందు ఉన్నాయి. అంత పెద్ద సమస్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆంకాక్షల, స్ఫూర్తి గుర్తించి వారి కలను సాకారం చేశాం. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా మాకు నష్టం జరిగింది. అయినా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం.' అని సోనియా గాంధీ చెప్పారు.