ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున రానున్నాయి. నర్సాపురం పరిధిలో అతి తక్కువ పోలింగ్‌ కేంద్రాలుండటంతో.. కేవలం 12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోతుంది. అదే రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు 36-37 రౌండ్లు పట్టనుంది. ఈ క్రమంలో ఫలితాలు అన్నింటికంటే చివర్లో వెలువడనున్నాయి. రాష్ట్రంలో 12-13 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నియోజకవర్గం ఒకే ఒక్కటి ఉండగా, 36-37 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. 30 రౌండ్లు దాటి లెక్కింపు జరగాల్సిన నియోజకవర్గాలు 12 ఉన్నాయి. లెక్కింపు ప్రక్రియలో అవాంతరాలు లేకుండా సజావుగా సాగితేనే తొలి ఫలితం తొందరగా తేలుతుంది.

ap 23502019

త్వరగా తేలే అవకాశమున్న నియోజకవర్గాలు..* 12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం వెలువడే నియోజకవర్గాలు: నర్సాపురం * 13-14 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: ఆచంట, కొవ్వూరు (ఎస్సీ) * 14-15 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం వచ్చే నియోజకవర్గాలు: పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ * 15-16 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు * 16-17 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: గుంటూరు తూర్పు, నెల్లూరు గ్రామీణ, ప్రత్తిపాడు, అనపర్తి, నగరి, పార్వతీపురం, వేమూరు, మాడుగుల, విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం పశ్చిమ

ap 23502019

ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశమున్నవి * 36-37 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాలు: రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం * 35 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గం: జగ్గంపేట * 33రౌండ్ల లెక్కింపుతో ఫలితం వెలువడే నియోజకవర్గం: అమలాపురం * 32 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాలు: పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం సిటీ, తుని * 30-31 రౌండ్ల లెక్కింపుతో ఫలితం వెలువడే నియోజకవర్గాలు: పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ సిటీ.

Advertisements

Advertisements

Latest Articles

Most Read