ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున రానున్నాయి. నర్సాపురం పరిధిలో అతి తక్కువ పోలింగ్ కేంద్రాలుండటంతో.. కేవలం 12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోతుంది. అదే రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు 36-37 రౌండ్లు పట్టనుంది. ఈ క్రమంలో ఫలితాలు అన్నింటికంటే చివర్లో వెలువడనున్నాయి. రాష్ట్రంలో 12-13 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నియోజకవర్గం ఒకే ఒక్కటి ఉండగా, 36-37 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. 30 రౌండ్లు దాటి లెక్కింపు జరగాల్సిన నియోజకవర్గాలు 12 ఉన్నాయి. లెక్కింపు ప్రక్రియలో అవాంతరాలు లేకుండా సజావుగా సాగితేనే తొలి ఫలితం తొందరగా తేలుతుంది.
త్వరగా తేలే అవకాశమున్న నియోజకవర్గాలు..* 12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం వెలువడే నియోజకవర్గాలు: నర్సాపురం * 13-14 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: ఆచంట, కొవ్వూరు (ఎస్సీ) * 14-15 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం వచ్చే నియోజకవర్గాలు: పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ * 15-16 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు * 16-17 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: గుంటూరు తూర్పు, నెల్లూరు గ్రామీణ, ప్రత్తిపాడు, అనపర్తి, నగరి, పార్వతీపురం, వేమూరు, మాడుగుల, విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం పశ్చిమ
ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశమున్నవి * 36-37 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాలు: రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం * 35 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గం: జగ్గంపేట * 33రౌండ్ల లెక్కింపుతో ఫలితం వెలువడే నియోజకవర్గం: అమలాపురం * 32 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాలు: పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం సిటీ, తుని * 30-31 రౌండ్ల లెక్కింపుతో ఫలితం వెలువడే నియోజకవర్గాలు: పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ సిటీ.