స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు దా-డు-లు దౌ-ర్జ-న్యా-ల-కు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్ధలో నామినేషన్లు వేయనీకుండా అడ్డుకోవటం ఏంటని వైసీపీ తీరు పై , తెలుగుదేశం పార్టీ ప్రతి రోజు ఆందోళన చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు వైసీపీ, అనేక ప్లాన్లు వేసి, టిడిపి నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంది. తస్కరించటం, తిరస్కరించటం, బెదిరించటం, భయపెట్టటం చేసిన వైసీపీ, ఇప్పుడు బహిష్కరించే స్కెచ్ వేసింది. పురపాలక ఎన్నికల్లో విజయం సాధించడానికి తెనాలిలో అధికార పార్టీ శ్రేణులు అడ్డదారులు తొక్కుతున్నాయంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ, సాక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే మైండ్ పోవాల్సిందే. ప్రత్యర్ధిని ఇలా అడ్డగోలుగా దెబ్బ తియ్యాలి అనే వైసీపీ వ్యూహం చూస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది. పులులు, సింహాలు అని చెప్పుకునే వారు, పోటీకి రెడీ అయ్యి, ప్రజల తీర్పు కోరాలి కాని, స్వాతంత్రం వచ్చి, 70 ఏళ్ళు అవుతున్నా, ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి కూడా ఒక పార్టీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏమి చెప్పాలి ? ఇక ఈ వీడియో చూస్తే, మీరు కూడా అవాక్కవుతారు.

tenali 13032020 2

తెనాలి పురపాలిక ఎన్నికల్లో నాలుగోవార్డు నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ప్రవేశించారు. మద్యం సీసాలను వాటర్ ట్యాంక్ వద్ద ఉంచి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదైంది. ఉదయం అబ్కారీ అధికారులు తెలుగుదేశం అభ్యర్థి ఇంటికి వెళ్లారు. వాటర్ ట్యాంకు ఎక్కడ? ఎన్నో ఫ్లోర్ అంటూ ఆరా తీశారు. కాసేపు హడావుడి చేసిన అబ్కారీ సిబ్బంది.. పైఅంతస్తలోని పెంట్‌హౌస్‌లో ఉంటున్న తెదేపా అభ్యర్థి బంధువు తాళ్లూరి కార్తీక్‌ను తీసుకెళ్లారు. అధికారుల తీరుపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలోని వ్యక్తులను గుర్తించకుండా తమను బెదిరిస్తున్నారని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలంటూ సీసీ కెమెరా దృశ్యాలను తెదేపా విడుదల చేసింది.

tenali 13032020 3

ఇదే విషయాల పై, నిన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేస్తున్న దా-డు-లు, దౌ-ర్జ-న్యా-ల-ను విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్‌ కలిసి వివరించారు. రాజశేఖర్ రెడ్డి ని చూశాం, ఇలాంటి రౌ-డీలను చాలా మందిని చూశాం, రౌ-డీ-యి-జం చేస్తే అదే మీకు ఆఖరి రోజు. వైసీపీ నేతలకు పిచ్చి పట్టిందా?.. ఒళ్లు కొవ్వెక్కిందా. ధైర్యం ఉంటే నామినేషన్లు వేసి గెలవండి చూద్దాం. నోటిపిషకేషన్లు వేయకుండా అడ్డుకున్న అన్ని చోట్ల రీ నోటిపేషన్ ఇవ్వాలి. దీనిపై న్యాయపరంగా పోరాడుతాం. ఎవ్వర్నీ వదలం, మీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు, జగన్ పులివెందులలో ఉండకుండా ఇక్కడెందుకు ఉన్నాడు? మీరు అన్ని చోట్ల తిరగవచ్చు మేం తిరగకూడదా? ఎవర్నీ బెదిరిస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఒక ఊరి నుంచి మరోక చోటకు వెళ్లాంలంటే వీసా కావాలనే పరిస్థితి వస్తుంది. వైసీపీ వ్యవహారశైలిపై ప్రజలు ప్రజలు ఆలోచించాలి. ప్రజలు మంచి కోసం పాటు పడే తెలుగుదేశం పార్టీ పట్ల నిలబడాలని ఈ సంధర్భంగా చంద్రబాబు నాయుడు కోరారు.

విశాఖపట్నంలో ఇటీవల ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా హాజరు కావాలన్న ఆదేశాలతో హైకోర్టుకు వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలులో ఉందా అంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో 1-4-4 సెక్షన్ అమలు, 500 మంది పోలీసులు లాంగ్ మా-ర్చ్ చేయడం వంటి ఘటనలను ఉదహరిస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలేమిటని ప్రశ్నించింది. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఫిబ్రవరి 27న ప్రభుత్వ అనుమతి తీసుకుని ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎయిర్ పోర్ట్ బయటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా గంటల తరబడి చంద్రబాబు కాన్వాయ్ ను కదలనీయక పోవడంతో పరిస్థితి ఉ-ద్రి-క్తం-గా మారింది.

dgp 13022020 2

పరిస్థితి ఎంత సేపటికీ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు సీఆర్పీసీ 151 సెక్షన్ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న వారిని కాకుండా, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్, మహేశ్వరి సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. అలా నోటీసులు ఇచ్చిన పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఆర్పీసీ 151 సెక్షన్లోని అంశాలను మరోసారి చదవాలని డీజీపీకి సూచించారు. అయితే కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండటం వల్ల నోటీసులు ఇచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోలేదని డీజీపీ న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. విశాఖలో పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

dgp 13022020 3

కోర్టు ఆదేశిస్తే పోలీసులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ట్ చర్యలు తీసుకోవడానికి కోర్టు తీర్పు అవసరం లేదని, 'మీరు చర్యలు తీసుకోకపోతే మేమే తీసుకుంటామ'ని వ్యాఖ్యానించారు. సీఆర్పీసీ 151 సెక్షన్‌ను నిబంధనలకు విరుధంగా ఉపయోగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కేసు విచారణ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ దాదాపు ఆరు గంటల పాటు న్యాయస్థానంలో వేచి చూశారు. ఉదయం 10.25 గంటలకు కోర్టుకొచ్చిన డీజీపీ సాయంత్రం 4.15 వరకు కోర్టులోనే ఉన్నారు. అయితే కోర్ట్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మాత్రం, పోలీసులకు ఇబ్బంది అని చెప్పాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు పోలీసులు చేస్తూ పొతే, మేము జోక్యం చేసుకుంటాం, మా చేత మీరు చెప్పించుకోవాల్సి వస్తుంది అంటూ కోర్ట్ తీవ్ర వ్యఖ్యలు చేసింది.

టీడీపీ తరుపున నామినేషన్లు వేయనీయకుండా అడుగడుగునా ప్రభుత్వం అడ్డుకుంటోందని, రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 559 చోట్ల తెలుగుదేశం వారిని నామినేషన్లు వేయనీయకుండా వైసీపీవారు దౌర్జన్యం చేశారని, 13 చోట్ల జడ్పీటీసీలకు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సహచర ఎమ్మెల్సీలు అశోక్ బాబు, సత్యనారాయణ రాజు, రామకృష్ణలతో కలిసి, మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్థానికపోరులో గెలవడం కోసం వైసీపీ ప్రభుత్వం చేయాల్సిన దారుణాలన్నీ చేస్తోందని, వ్యవస్థలను కుప్పకూలుస్తూ ప్రతిపక్ష పార్టీవారిపై దౌర్జన్యాలకు దిగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయన్నఫిర్యాదుల జాబితా తమ వద్ద ఉందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారులను, పోలీసులను నేరాలు, తప్పుడు పనుల్లో భాగస్వాములను చేస్తోందని, వారిసాయంతో నామినేషన్లు వేయకుండా ప్రతిపక్ష సభ్యులను అడ్డుకుంటోందన్నారు. మేం చెప్పేవాటిని వైసీపీవారు పదేపదే తప్పు అంటుంటారని, అలా చెప్పడానికి వారివద్ద ఏవిధమైన ఆధారాలు ఉండవని, కానీ తమపార్టీ వారికి జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రప్రజలు ఇప్పటికైనా మేలుకోకుంటే రాష్ట్రం బీహార్ కన్నా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉందన్నారు. నియంతను అడ్డుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు. ఏమన్నా చేయండి.. 90శాతం స్థానాలు వైసీపీ గెలిచితీరాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు.

అనేక దుర్మార్గాలు, సిగ్గుమాలిన చర్యలకు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయన్న దీపక్ రెడ్డి, వాటన్నింటిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు పంపుతున్నామని, ఆయనకు ఏమాత్రం చిత్తుశుధ్ది ఉన్నా, ఈ దురాగతాలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దీపక్ డిమాండ్ చేశారు. కార్వేటి మండలం ఎస్సై, సీఐ, చిత్తూరుజిల్లా ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్ చేశామో, ఆ కాల్ లిస్టంతా ఈసీకి అందచేస్తామని, ఆయనేం చర్యలు తీసుకుంటాడో చూస్తామన్నారు. ఎన్నికల కమిషనర్ వెంటనే అధికారులపై చర్యలు తీసుకోలేకపోతే, ఆయన తక్షణమే ఎన్నికలను నిలిపివేయాలన్నారు. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలను జోకర్లలా, బఫూన్లలా భావించకుండా, ప్రజలంటే లెక్కలేనితనంతో వ్యవహరించకుండా, వారికోసమే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న విషయాన్ని ఈసీ గుర్తించాలన్నారు. పోలీస్ శాఖలో ఉన్న చీడపురుగులను ఎన్నికల సంఘం ఏరివేయకుంటే వాటివల్ల వ్యవస్థలకు జరిగే నష్టం చాలా తీవ్రస్థాయిలో ఉంటుందని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. తనవద్ద ఉన్న ఆధారాలను (వీడియోలు, ఆడియోలు, ఫొటోలు) ఎన్నికల కమిషన్ ముందుంచుతామని, వాటిని ఆధారంగా చేసుకొని ఏంచర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే తమపార్టీ తరుపున హైకోర్టుని ఆశ్రయిస్తామన్నారు. ఈగడ్డపై పుట్టిన వ్యక్తిగా ఇక్కడ జరిగే దారుణాలు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు తాను చూడలేకపోతున్నానని చెప్పిన దీపక్ రెడ్డి, ప్రజలంతా ఇప్పటికైనా మేల్కొని, ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని విజ్జప్తి చేశారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే స్వయంగా దౌర్జన్యాలు, దోపిడీలకు దిగి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలోకి దిగకూడదన్న కక్షతో, పోలీసులు, అధికారుల సాయంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన భయాందోళనలు రేకిత్తించిందని ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ తెలిపారు. టీడీపీతరుపున దాదాపు 90శాతం మంది వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు వేయడం చూస్తుంటే, చాలావరకు ప్రతిపక్షం విజయం సాధించినట్టేనన్నారు. ఎన్నికల్లో ఓడిపోతానన్న విపరీతమైన భయం, ఒత్తిడికారణంగానే జగన్ 90శాతం గెలిచితీరాలని ప్రకటన చేశాడన్నారు. జగన్మోహన్ రెడ్డి తన మంత్రులు జీరోలు కాదు హీరోలని చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం మంత్రులంతా జీరోలుగానే మిగిలిపోయారని రామకృష్ణ ఎద్దేవాచేశారు. పాలనావ్యహారాల్లో ఏం జరుగుతుందో కూడా మంత్రలుకు తెలియడంలేదని, రాష్ట్రంలో నియంతపాలనే నడుస్తోందన్నారు. జగన్ పరిపాలనలో అరాచకపాలనకు మారుపేరైన బీహార్ ని వెనక్కు నెట్టి, ఏపీ ముందుస్థానంలో నిలిచిందన్నారు. తామేం చేసినా చెల్లుతుంది, తమను అడిగేవారు లేరన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మంచివాడుకూడా చెడ్డవాడిలా మారే నీచమైన సంస్కృతిని వైసీపీప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇటువంటి చర్యలను తుంచివేయకపోతే, రాష్ట్రం సర్వనాశనమవుతుందన్నారు. టీడీపీతరుపున చాలా ప్రాంతాల్లో బీసీలు, దళితులు, మైనారిటీలే అధికంగా ఎన్నికల్లో నిలిచారని, వారిని అడ్డుకోవడం ద్వారా జగన్ ప్రభుత్వం ఆయావర్గాల వ్యతిరేకిగా నిలిచిందన్నారు.

నీ మొఖం చూసి, ఎవరు పెట్టుబడులు పెడతారు చంద్రబాబు ? నువ్వు విదేశాలకు వెళ్ళింది, పెట్టుబడులు కోసం కాదు, విలాసాలకు... ఇవి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, అప్పటి ప్రతిపక్ష నేత, జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబు రూపాయి పెట్టుబడికు కూడా 5 ఏళ్ళ పాలనలో తీసుకు రాలేదని జగన్ ఊరు ఊరు తిరుగుతూ చెప్పారు. చంద్రబాబు హయంలో, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ప్రచారం చేసే వాళ్ళు. బాబు వస్తే జాబు వస్తుంది అంటూ చంద్రబాబు ప్రచారం చేసారు కాని, చంద్రబాబు ఒక్క పెట్టుబడి కూడా తేలేదు అంటూ అప్పట్లో వైసీపీ ఊదరగొట్టేది. మేము అధికారంలోకి వస్తే, కంపెనీలే కంపెనీలు, పెట్టుబడులే పెట్టుబడులు, ఉద్యోగాల విప్లవం తెస్తాం, ప్రత్యెక హోదా మెడలు వంచి తీసుకువస్తాం, ఇన్కమ్ టాక్స్ కట్టాల్సిన పని ఉండదు, అంటూ, ఇలా అప్పట్లో అనేక ప్రచారాలు చేసేది వైసీపీ. అయితే చంద్రబాబు కాని, తెలుగుదేశం కాని, ఈ ప్రచారాన్ని లైట్ తీసుకోవటంతో, ప్రజలు కూడా ఇది నమ్మే పరిస్థితి వచ్చింది.

report 1120232020 2

అనంతపురంలో కియా లాంటి కంపెనీ, దేశంలోనే, అతి పెద్ద విదేశీ పెట్టుబడి. చంద్రబాబు ఈ కంపెనీ కోసం, ఎంత కష్టపడ్దరో అందరికీ తెలుసు. అయితే, ఈ కంపెనీ కోసం, 2007లోనే రాజశేఖర్ రెడ్డి ఉత్తరం రాసారు అంటూ, బుగ్గన అసెంబ్లీలో చెప్పారు అనుకోండి, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు ఒక్క ఉద్యోగం తేలేదు, ఒక్క కంపెనీ తేలేదు, ఒక్క రూపాయి పెట్టుబడి లేదు, ఒక్క ఉద్యోగం రాలేదు అంటూ, ఊదరగొట్టారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మొత్తం మారిపోయింది. ఉన్న కంపెనీలు కూడా వెనక్కు పోతున్నాయి. చంద్రబాబు తెచ్చిన కంపెనీలే గతి అయ్యింది. ఈ సందర్భంలో, జగన్ పార్టీలో నెంబర్ 2 అయిన, విజయసాయి రెడ్డి, పార్లిమెంట్ కు ఇచ్చిన ఒక నివేదిక ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది.

report 1120232020 3

విజయసాయి రెడ్డి, పార్లమెంట్ లో, కామర్స్ స్టాండింగ్ కమిటీకి, అధ్యక్షుడుగా ఉన్నారు. 2016-19 మధ్య దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు పై ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ లో, చంద్రబాబు హయంలో, 2016-19 మధ్య 6,897.97 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల, అంటే, దాదాపుగా 50 వేల కోట్లు విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి అంటూ, సాక్షాత్తు విజయసాయి రెడ్డి, సంతకం పెట్టి మరీ చెప్పారు. దేశంలోనే విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవటంలో, 2016-19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆరోస్థానంలో ఉందని ఆయన రిపోర్ట్ లో రాసారు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డే సంతకం పెట్టి మరీ, చంద్రబాబు హయంలో, కేవలం విదేశీ పెట్టుబడులే, 50 వేల కోట్లు వచ్చాయి అని చెప్పారు అంటే, మొన్నటి దాక వారు చేసిన ప్రచారం అబద్ధం అని, వారే చెప్పినట్టు అయ్యింది. పార్లమెంట్ కు ఆన్నీ నిజాలే చెప్పాలి, సాక్షి లెక్కలు చెప్తే తంతారు కాబట్టి, నిజాలు చెప్పారు అంటూ, టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read