ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై, ఎలాంటి దాడి జరుగుతుందో చూస్తున్నాం. అవతల వాళ్ళు సొల్లు, సోది చెప్తుంటే, మనం పోలవరం రికార్డులు, అమరావతి అవార్డులతో వారికి సామాధానం చెప్తున్నాం. విభజన వల్ల పూర్తిగా నష్టపోయిన ఆంధ్రలు, నిలదొక్కుకుని, పరిగెడుతుంటే, చూడలేని వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు, పక్క రాష్ట్ర రాబందులు, మన రాష్ట్ర అభివృద్ధిని చిన్నాభిన్న చెయ్యటానికి రెడీ అయ్యారు. ఢిల్లీ సూత్రదారులు, పన్నిన వికృత క్రీడలో, జగన్, పవన్ పావులు. ఇక కేసీఆర్ ఏడుపులు సరే సరి. మన రాష్ట్రం చేస్తున్న పనుల్లో సగం కూడా చెయ్యలేడు, చంద్రబాబుతో పోటీ పడలేడు, కియా లాంటి కంపెనీలు తేలేడు, మన రాష్ట్రంలో జరుగుతున్నంత సంక్షేమ కార్యక్రమాలు చెయ్యలేడు, అందుకే మన రాష్ట్రం పై ఏడుపు. అందుకే జగన్ లాంటి వాడు ఏపి ముఖ్యమంత్రి అయితే, ఈ రాష్ట్రం తన గుప్పిట్లో పెట్టుకోవచ్చని ప్లాన్. అందుకే ఈ వికృత క్రీడలో, గిఫ్ట్ ఇస్తాను అంటూ జాయిన్ అయ్యాడు.

jagan 07012019

ఇక్కడ జగన్, పవన్, హైదరాబాద్ నుంచి వచ్చి, పార్టీ టైం రాజకీయాలు చేస్తున్నా, చంద్రబాబు ముందు నిలబడలేక పోతున్నారు. అందుకే కేసీఆర్ హెల్ప్ ఆడుతున్నారు. ఇందులో భగంగానే, కేసీఆర్ అత్యంత ఆప్తుడు అయిన, ఒవైసీనీ కూడా వాడటానికి, జగన్ ప్లాన్ చేసాడు. ఇటీవల, మోడీ పై చంద్రబాబు యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి, అనేక సంక్ష్టేమ పధకాల ద్వరా లబ్ది పొందటం, మోడీ తెచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్ లోని లోపాలు ఎత్తి చూపటంతో, ఏపిలో ముస్లింలు, చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో జగన్ అలెర్ట్ అయ్యాడు. ఒవైసీ ద్వారా, ముస్లింలు చంద్రబాబు వైపు వెళ్ళకుండా ఉండేందుకు ప్లాన్ చేసాడు. దీనిలో భాగంగా, అమిత్ షా డైరెక్షణ్ లో, కేసీఆర్ ఆదేశాల మేరకు, జగన్‌కు అత్యం త సన్నిహితుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ అయ్యారు.

jagan 07012019

హైదరాబాద్‌లో సుమారు 4 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. వాస్తవాని కి ఎమ్మెల్యే గౌతంరెడ్డికి, అసదుద్దీన్‌ ఒవైసీకి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ మర్యాదపూర్వకంగా కలిశారని అంటున్నారు. జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌లో భాగమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ నుంచి తమకు ఏలాంటి సహకారం అవసరమో.. జగన్‌ మనసులోని విషయాలను మేకపాటి గౌతంరెడ్డి ద్వారా వివరించినట్లు సమాచారం. ఎన్నికల్లో ముస్లింల ఓట్లను ఆకర్షించడానికి వైసీపీ తరఫున ప్రచారం చేయాలని అసదుద్దీన్‌ను మేకపాటి కోరినట్లు సమాచారం.

ప్రతి విషయంలోని ఏపి ప్రజలని అవమానపరుస్తున్న కేంద్రం, తాజగా, దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఏపీ శకటం పాల్గునకుండా, అనుమతి నిరాకరించి, మరో సారి మన రాష్ట్రాన్ని అవమాన పరిచింది. స్వాతంత్ర్య ఉద్యమం, మహాత్మా గాంధీ జీవితం ఇతివృత్తాలతో కూడిన శకటం తయారు చేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం సూచించింది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విజయవాడ గాంధీకొండ, స్థూపం, ఏపీలో స్వాతంత్ర్య ఉద్యమ ఇతివృత్తంతో శకటం సిద్ధంచేసింది. అయితే మొదట ఈ శకటం బాగుందంటూ కేంద్ర అధికారులు కితాబిచ్చారు. ఇంతలోనే అనూహ్యంగా యూటర్న్ తీసుకున్న కేంద్రం.. శకటం సరిగ్గాలేదని చెప్పడం గమనార్హం. చివరి నిమిషంలో ఏపీ శకటానికి కేంద్ర రక్షణశాఖ అనుమతి నిరాకరించడంతో ఏపీలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

cbn 07012019 2

ఏపీ శకటం పైన కూడా ప్రధాని మోదీ అక్కసు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో భాజపా కక్ష సాధింపునకు ఇది పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వక పోవడంపై లేఖ రాయాలని, కేంద్రం వివక్షతను బహిర్గతం చేయాలని పార్టీ నేతలతో సోమవారం సీఎం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, అందుకే ఏపీపై మోదీ అసూయ పెంచుకున్నారని, అడుగడుగునా కక్ష సాధిస్తున్నారని సీఎం అన్నారు. ఏపీ పేరు వినబడితేనే ఆయనకు అక్కసు పెరిగిపోతోందని, రాష్ట్ర పురోగతి చూసి భరించలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హుందాతనం వదిలేసి మోదీ మాట్లాడుతున్నారని, తన కుటుంబం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

cbn 07012019 3

పోలవరం కాంక్రీటు పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఇదొక చారిత్రక ఘట్టమని సీఎం స్పష్టంచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నామన్నారు. 6వ రోజు ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరం రికార్డు సాధించడంలో చెమటోడ్చిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఇది వేలాది కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది కష్టమని, ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. శరవేగంగా ప్రాజెక్టు పనులు చేస్తున్నందుకు సీబీఐపీ అవార్డు సాధించామని, అది అందుకున్న నాలుగు రోజులకే మరో రికార్డు సాధించామని చెప్పారు. ఇది నిజంగా ప్రతి తెలుగువాడికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

జనవరి ఆరవ తేదీ అర్థరాత్రి... సాంకేతికంగా ఏడవ తేదీలోకి ప్రవేశించాం... కానీ ఆ ఏడవ తేదీ వస్తూనే మనల్ని ప్రపంచ విజేతలను చేసింది. మన కలల పోలవరం ఆ విజయాన్ని నిజం చేసింది... ప్రపంచానికి సవాల్ విసిరి, దమ్ముంటే, మా రికార్డు ని అందుకోండి అంటూ, భారత దేశం తరుపున, ఆంధ్రుడు, ఈ ప్రపంచానికి సవాల్ విసిరాడు. ఆంధ్రా కంపెనీ అయిన నవయుగ, ఈ ఘనతని నిజం చేసింది. గాడాంధాకారాన్ని చీల్చుకుంటూ ఆకాశమంతా తానే అయ్యి ఉదయించే 'ప్రచండ భానుడు' ఆంధ్రుడు... బలితలినిడ యత్నించిన పాదాన్ని తిరగరాసి విశ్వరూపాన్ని వామనరూపం చేసిన చక్రవర్తి ఆంధ్రుడు... నిలకడ లేని గోదావరి జలాలను తన వెంట నడిపించి ధరిత్రికి పచ్చటి ఊపిరులూదే అపర 'భగీరథుడు' ఆంధ్రుడు... నవయుగ లిఖించింది నవశకపు చరిత్ర... పోలవరం సృష్టించింది ప్రపంచ నిర్మాణ రంగంలో చరిత్ర.. మన ఆంధ్ర శాసనం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో....

polavaram 06012019 2

A అమరావతి, P పోలవరం, రెండూ కలిసి, AP, ఇవే నా ముందున్న లక్ష్యాలు అని చెప్పిన చంద్రబాబు, ఒక్కో అడుగు వేసుకుంటూ, ఆ కలను సాదిస్తున్నారు. ఇన్నాళ్లు దుబాయ్‌ పేరిట ఉన్న 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనుల రికార్డు బద్దలైంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకల్లా 22,045 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తిచేసి నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు సాధించింది. సోమవారం ఉదయం 8 గంటలకల్లా 32,100 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొన్నారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్‌ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్‌ వెలుగుల్లోనూ పనులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు ప్రారంభించారు. దాదాపు 4 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు.

polavaram 06012019 3

2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా అధిగమిచింది. 16 గంటల్లోనే ఈ రికార్డును అందుకుంది. రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. పోలవరం ప్రాజెక్ట్‌ ఈ రికార్డును సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. అధికారులను అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఆయన సోమవారం మధ్యాహ్నం సందర్శించనున్నారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను అందుకోనున్నారు. సమర్ధవంతమైన స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఉంటే ప్రపంచ రికార్డులే కాదు .... ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది. ఆలాంటి అమూల్యమైన నాయకత్వాన్ని సమర్ధించడం , పరిరక్షించుకోవటం ప్రతి ఆంధ్రుడి బాధ్యత.

ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా ? ఇలాంటి ప్రశ్న ఎవరన్నా వేస్తే, రాజకీయం కోసం, మరీ ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటారు. కాని, ఢిల్లీ పెద్దలు ఇలాంటి పనులు చేస్తుంటే, ఇలాంటి ఆలోచనలు ఏపి ప్రజల్లో రావటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. రోడ్డున పడేసిన రాష్ట్రాన్ని ఆదుకోవటానికి విభజన చట్టం అని ఒకటి పెట్టారు. అందులో ఏది నెరవేర్చలేదు కేంద్రం. ఎందుకు నెరవేర్చలేదు అని ఏపి ప్రజల తరుపున, ఢిల్లీ పెద్దలను డీ కొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో, ఢిల్లీ పెద్దలు, రాష్ట్రాన్నే ఇబ్బంది పెడుతున్నారు. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్నే డీ కొడతారా అని, కసి పెంచుకుని, ఏపికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా, రిపబ్లిక్ డే నాడు, ప్రదర్శించే ఏపి శకటానికి బ్రేక్ వేసారు. కేంద్రం ఈ సారి, గాంధీజీ జీవితంతో సంబంధం ఉన్న ఇతివృత్తాలతో వాటికి రూపకల్పన చేయాలని చెప్పింది.

republicday 07012019 2

దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడ గాంధీకొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో డ్రాయింగ్స్‌ తయారు చేసి పంపింది. చివరకు దీన్ని ఎంపిక చేయలేదనడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఈ విషయాన్ని తొలి నుంచీ చూస్తూ వచ్చిన ఏపీ భవన్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని గాంధీ కొండపై గాంధీ పీస్‌ ఫౌండేషన్‌ నిర్మించిన 52 అడుగుల స్తూపం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమానికి ప్రబల గుర్తింపుగా దాన్ని నిర్మించారు. తిలక్‌ పీస్‌ ఫౌండేషన్‌కు కోటి రూపాయలు సమీకరించే లక్ష్యంతో ప్రజలు చరఖాలు కొనుగోలు చేసి స్వదేశీ ఉద్యమంలో పాల్గొనాలని ఈ కొండమీద నుంచే గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే, మహాత్మాగాంధీ పిలుపునందుకొని శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు గ్రామస్థులు స్వదేశీ ఉద్యమ దీక్ష బూని ఖాదీ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. మరో పక్క, అంటరానితనం రూపుమాపే సర్వోదయ ఉద్యమంలో భాగంగా అప్పట్లో గాంధీజీ నెల్లూరు జిల్లా పల్లిపాడుకు విచ్చేశారు. ఆ గ్రామంలో అధికంగా ఉన్న అంటరానితనాన్ని రూపుమాపడానికి సబర్మతి ఆశ్రమం తరహాలో పినాకిని నది ఒడ్డున సత్యాగ్రహ ఆశ్రమం నిర్మించాలని ఆయన స్థానిక నాయకులకు సూచించారు.

republicday 07012019 3

గాంధీజీ స్ఫూర్తిని ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తున్న ఈ మూడు ఘట్టాలను గణతంత్ర వేదికగా చాటాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇతివృత్తాలను రక్షణశాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఒప్పుకున్నాక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్రీడీ నమూనా, ఇతివృత్త సంగీతాన్ని రూపొందించింది. చివరి రౌండ్‌ వరకూ ఆంధ్రప్రదేశ్‌ నమూనా పోటీలో ఉంది. అధికారులు అంతా బాగుంది ప్రశంసించారు కూడా. త్వరలో విషయం చెబుతామన్న రక్షణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఎన్నో రాష్ట్రాలు సమర్పించిన నమూనాల కంటే ఆంధ్రప్రదేశ్‌ నమూనా చాలా అద్భుతంగా వచ్చిందని ఎందుకు ఎంపిక కాలేదో అర్థం కాలేదని ఏపీ భవన్‌ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఏపీ శకటం పైన కూడా ప్రధాని మోదీ అక్కసు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో భాజపా కక్ష సాధింపునకు ఇది పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు.

Advertisements

Latest Articles

Most Read