సినీ నటుడు అలీ గత కొన్ని రోజులగా వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అలీ కలిశారు. దీంతో ఆయన వైసీపీలోకి చేరనున్నారనే ప్రచారం జరిగింది. జగన్ పాదయాత్ర జనవరి 9వ తేదీన ముగియనుందని.. అదే రోజు అలీకి జగన్ స్వయంగా కండువా కప్పి వైసీపీలో చేర్చుకోనున్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో పవన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే అలీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటనే చర్చ అటు పవన్ అభిమానుల్లోనూ, ఇటు వైసీపీ అభిమానుల్లోనూ జరిగింది. అలీ వైసీపీ ఎంట్రీ వార్తలకు తెరపడక ముందే తాజాగా ఆయన వేసిన మరో అడుగు ఈ పరిణామాలను గమనిస్తున్న వారిని షాక్‌కు గురి చేసింది.

ali 06012019 1

‘అలీ నా గుండె లాంటి వ్యక్తి’ అని పవన్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అలాంటి పవన్‌ ఇంటికెళ్లి మరీ ఇవాళ అలీ భేటీ అయ్యాడు. దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌ను కలిసిన అంశం కూడా పవన్‌తో భేటీలో చర్చకొచ్చినట్లు తెలిసింది. రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారని, అలీ జనసేనలో చేరడం ఖాయమని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే... ఈ ప్రచారం మొదలైన కాసేపటికే తాజాగా అలీ సినీ నిర్మాత అశ్వనీదత్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో అలీ టీడీపీ టికెట్ ఆశించాడనే ప్రచారం కూడా జరిగింది.

ali 06012019 1

ఈ నేపథ్యంలో అలీ టీడీపీ అధినేతను కలవడం చర్చనీయాంశమైంది. వైసీపీలో టికెట్‌పై హామీ దక్కకపోవడం వల్లే అలీ టీడీపీలోకి చేరాలని భావిస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో అలీ అంతరంగమేంటో తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీపై పోరాటానికి పవన్‌ కూడా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చిన అనంతరం వైసీపీలో చేరాలన్న అలీ ఆలోచన మారి ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచి టికెట్ దక్కినా అలీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలీని చేర్చుకుంటే మైనార్టీల అండ కూడా ఉంటుందనే భావన పార్టీల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారింది.

 

 

బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు చేపట్టిన పనులు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో దీన్ని నమోదు చేసేందుకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిథి విశ్వనాథ్‌ ఆదివారం పనులను పరిశీలించారు. ఇప్పటి వరకూ దుబాయ్‌లో నమోదైన రికార్డును అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు పనులలో భాగంగా 24 గంటల్లో 30వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాటు చేసినట్లు నవయుగ ఎండీ బి.శ్రీధర్‌ చెప్పారు. గిన్నిస్‌బుక్‌ ప్రతినిధులు 24 మంది ఈ కాంక్రీట్ పనులను పర్యవేక్షిస్తున్నారు.

polavaram 06012019 2

దుబాయ్‌లో ఒక టవర్‌ నిర్మాణానికి 2017 మే లో 36 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల(ఘ.మీ.) కాంక్రీట్‌ వేశారని, ఇప్పుడా రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లోనే 30 వేల ఘ.మీ. కాంక్రీట్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూణ్నెల్ల కిందట 24 గంటల్లో 11,158 ఘ.మీ. కాంక్రీటు వేశారు. మళ్లీ గత నెలలో 11,289 ఘ.మీ. కాంక్రీట్‌ పనులు చేసి ఆ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఏకంగా 30వేల ఘ.మీ. కాంక్రీటు వేసేందుకు గుత్తేదారు సంస్థ నవయుగ ఆధ్వర్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రతి 15 నిమిషాలకోసారి గణాంకాలు గిన్నిస్‌బుక్‌ ప్రతినిధులు నమోదు చేసుకుంటున్నారు. రేపు ఉదయం పనులను సీఎం చంద్రబాబు పరిశీలంచనున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, రాత్రి 8 గంటలకు, 16 వేల ఘ.మీ. కాంక్రీటు వేశారు.

polavaram 06012019 3

30వేల ఘ.మీ. కాంక్రీట్‌కు కావాల్సినవి.. సిమెంటు : ఏడువేల టన్నులు, ఇసుక : 22వేల టన్నులు, కంకర : 36వేల టన్నులు.. మానవ వనరులు.. కార్మికులు : 3,600 మంది, సాంకేతికేతర సిబ్బంది : 720, సాంకేతిక సిబ్బంది : 500, వివిధ హోదాల్లోని ఇంజినీర్లు : 21 మంది. ప్రస్తుతం ప్రాజెక్టులో గంటకు 3,770 మెట్రిక్‌ టన్నుల కంకర తయారు చేసే క్రషర్లున్నాయి. సిమెంటు, ఇసుక, ఇతర రసాయన మిశ్రమాలు కలిపే బ్లాచింగ్‌ప్లాంట్లలో గంటకు 1560ఘ.మీ. కాంక్రీట్‌ కలిపేలా సన్నద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8గంటలకు స్పిల్‌ఛానల్‌లో పని ప్రారంభించి సోమవారం ఉదయం 8గంటలకు 30వేల ఘ.మీ. పైబడి కాంక్రీట్‌ వేసి రికార్డు సాధించాలనుకుంటున్నారు. అదే పనిని మరికొన్ని గంటలపాటు కొనసాగించే ఆలోచనతో ఉన్నారు. రికార్డు సాధించిన అంశంపై లండన్‌ నుంచి ప్రకటన వచ్చాక ప్రాజెక్టులో సంబరాలు చేసుకునేందుకు నవయుగ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు.

కాకినాడలో జరిగిన జన్మభూమి సభలో రిటైర్డ్ మహిళా డీఈవో ఉన్నీసా బేగం స్పూర్తిదాయకంగా ప్రసంగించారు. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా? తెలుగు వారిని కించపరుస్తున్న వారికి తగిన బుద్ది చెప్పి చంద్రబాబుకు అండగా నిలబడదాం.. అన్నారు. ఉన్నీసా బేగం ప్రసంగానికి సీఎం చంద్రబాబు ముగ్ధుడై పాదాభివందనం చేశారు. ఆమెను స్పూర్తిగా తీసుకుని మరింత పట్టుదల, కిసిగా అన్యాయం చేసినవారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. 1985లో రిటైర్డ్ అయిన ఉన్నీసా బేగం రాజధాని అమరావతి నిర్మాణానికి తన నెల పెన్షన్ రూ.50 వేలు, అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తున్న తన కూతురి జీతం రూ.10,500 కలిపి సీఎం కు విరాళంగా అందచేశారు.

cbn 0501209 1

‘తూర్పు గోదావరి జిల్లా అంటే నాకు ప్రీతిపాత్రం..ఇక్కడి ప్రజలు అన్ని విధాలా ఆదరించారు.. అండదండగా ఉన్నారు.జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.కాకినాడ నగరాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కాకినాడలోని జేఎన్‌టీయూ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఆరో విడత ‘జన్మభూమి- మాఊరు’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాకు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తీర ప్రాంతంలో రోడ్డు వేయగలిగితే విశాఖ వరకు నేరుగా వెళ్లొచ్చని తెలిపారు. ఇన్ని మౌలిక వసతులున్న జిల్లాలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

cbn 0501209 1

పోలవరం ప్రాజెక్టు పనులు 64 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పోలవరం పూర్తయ్యేలోపే పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పూర్తిచేసి ఏలేరు జలాశయంలో 20 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా 25 టీఎంసీల నీటితో నింపినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం పట్టుదల ఇదని పేర్కొన్నారు. సంక్షేమం..అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సహజ వనరుల సద్వినియోగంతో ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జిల్లాలో ప్రతి ఇంటికీ ఒక స్మార్ట్‌ఫోన్‌ ఇస్తామని, ఏ పనికావాలన్నా ఫోన్‌లో తనకు చెప్పొచ్చని పేర్కొన్నారు. కాకినాడలో నాలుగు కంపెనీలు రావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు ముందుగా విడుదల చేసి రూ.5వేలు, అంతకంటే తక్కువ మొత్తం డిపాజిట్‌ చేసిన వారికి ఈ నెలలోనే చెల్లింపులు జరపనుంది. కోర్టు స్వాధీనంలో ఉన్న ఆస్తులు కాకుండా సీఐడీ కొత్తగా అటాచ్‌ చేసిన ఆస్తుల్ని ప్రభుత్వం తన స్వాధీనంలో ఉంచుకుని ఈ నిధుల్ని విడుదల చేస్తుంది. వాటి విలువ రూ.300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇప్పటికే కోర్టు స్వాధీనంలో ఉన్న ఆస్తుల వేలం ప్రక్రియలోనూ ప్రభుత్వం పాల్గొంటుంది. వేలంలో ఆ ఆస్తుల్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే నిర్దేశించిన కనీస ధరను కోర్టుకు చెల్లించి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది.

jagan 05012019

అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాట సంఘంతో కలిసి ఈ ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సంయుక్త అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల ఎనిమిదో తేదీలోగా కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. ‘నెల రోజుల్లోగా కోర్టు ద్వారా ఆస్తులన్నీ వేలం వేసేలా చూసి డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ చేస్తాం. అర్హులైన డిపాజిటర్ల జాబితాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించాం’ అని పేర్కొన్నారు. రూ.5వేలు, అంతకంటే తక్కువ మొత్తం డిపాజిట్‌ చేసినవారు సుమారు 5 లక్షల మంది వరకూ ఉంటారని, ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేస్తే వారందరికీ చెల్లింపులు జరపవచ్చని కుటుంబరావు పేర్కొన్నారు.

jagan 05012019

బాధితుల్లో రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసినవారు 80 శాతం ఉంటారని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే వైకాపా అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ‘వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఈ దేశంలోనే అత్యంత ధనికుడైన రాజకీయ నాయకుడు. వాళ్లు చెబుతున్నట్లుగా అగ్రి గోల్డ్‌ ఆస్తుల విలువ రూ.35వేల కోట్లుంటే... దానిలో 10 శాతం రూ.3500 కోట్లు జగనే చెల్లించి వాటిని తీసుకోవచ్చు కదా’ అని వ్యాఖ్యానించారు. సమస్యను నాన్చాలని వైకాపా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగానే చెప్పారని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read