కాకినాడలో జరిగిన జన్మభూమి సభలో రిటైర్డ్ మహిళా డీఈవో ఉన్నీసా బేగం స్పూర్తిదాయకంగా ప్రసంగించారు. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా? తెలుగు వారిని కించపరుస్తున్న వారికి తగిన బుద్ది చెప్పి చంద్రబాబుకు అండగా నిలబడదాం.. అన్నారు. ఉన్నీసా బేగం ప్రసంగానికి సీఎం చంద్రబాబు ముగ్ధుడై పాదాభివందనం చేశారు. ఆమెను స్పూర్తిగా తీసుకుని మరింత పట్టుదల, కిసిగా అన్యాయం చేసినవారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. 1985లో రిటైర్డ్ అయిన ఉన్నీసా బేగం రాజధాని అమరావతి నిర్మాణానికి తన నెల పెన్షన్ రూ.50 వేలు, అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తున్న తన కూతురి జీతం రూ.10,500 కలిపి సీఎం కు విరాళంగా అందచేశారు.
‘తూర్పు గోదావరి జిల్లా అంటే నాకు ప్రీతిపాత్రం..ఇక్కడి ప్రజలు అన్ని విధాలా ఆదరించారు.. అండదండగా ఉన్నారు.జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.కాకినాడ నగరాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కాకినాడలోని జేఎన్టీయూ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఆరో విడత ‘జన్మభూమి- మాఊరు’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాకు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తీర ప్రాంతంలో రోడ్డు వేయగలిగితే విశాఖ వరకు నేరుగా వెళ్లొచ్చని తెలిపారు. ఇన్ని మౌలిక వసతులున్న జిల్లాలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు పనులు 64 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పోలవరం పూర్తయ్యేలోపే పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పూర్తిచేసి ఏలేరు జలాశయంలో 20 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా 25 టీఎంసీల నీటితో నింపినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం పట్టుదల ఇదని పేర్కొన్నారు. సంక్షేమం..అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సహజ వనరుల సద్వినియోగంతో ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జిల్లాలో ప్రతి ఇంటికీ ఒక స్మార్ట్ఫోన్ ఇస్తామని, ఏ పనికావాలన్నా ఫోన్లో తనకు చెప్పొచ్చని పేర్కొన్నారు. కాకినాడలో నాలుగు కంపెనీలు రావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.